AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Donald Trump: డోనాల్డ్‌ ట్రంప్‌కు నోబెల్‌ శాంతి పురస్కారం? ఇది నాలుగోసారి

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ‌గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎల్లప్పుడూ వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉండే ట్రంప్‌ తాజాగా ప్రతిష్టాత్మక నోబెల్‌ శాంతి పురస్కారానికి నామినేట్‌ అయ్యారు. రిపబ్లికన్‌ పార్టీ ఎంపీ క్లాడియా టెన్నీతోపాటు పలువురు రిపబ్లికన్‌ చట్టసభ్యులు ట్రంప్‌ పేరును నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించారు. ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇజ్రాయెల్, బహ్రెయిన్‌, యూఏఈ మధ్య..

Donald Trump: డోనాల్డ్‌ ట్రంప్‌కు నోబెల్‌ శాంతి పురస్కారం? ఇది నాలుగోసారి
Donald Trump Nominated For Nobel Peace
Srilakshmi C
|

Updated on: Feb 01, 2024 | 12:01 PM

Share

యూఎస్‌ఏ, ఫిబ్రవరి 1: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ‌గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎల్లప్పుడూ వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉండే ట్రంప్‌ తాజాగా ప్రతిష్టాత్మక నోబెల్‌ శాంతి పురస్కారానికి నామినేట్‌ అయ్యారు. రిపబ్లికన్‌ పార్టీ ఎంపీ క్లాడియా టెన్నీతోపాటు పలువురు రిపబ్లికన్‌ చట్టసభ్యులు ట్రంప్‌ పేరును నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించారు. ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇజ్రాయెల్, బహ్రెయిన్‌, యూఏఈ మధ్య సంబంధాలను సాధారణీకరించేందుకు అబ్రహం ఒప్పందాల్లో అతని పాత్రను ఉటంకిస్తూ ఆయన పేరును నామినేట్‌ చేశారు. కాగా ప్రతిష్టాత్మక నోబెల్‌ శాంతి బహుమతికి ట్రంప్‌ పేరును నామినేట్‌ చేయడం ఇదేం తొలిసారి కాదు. ఇప్పటి వరకూ నాలుగు సార్లు ఈ విశిష్ట పురస్కారానికి ట్రంప్ పేరు నామినేట్ చేయడం గమనార్హం.

మధ్య ప్రాచ్యంలో గత 30 ఏళ్లలో తొలిసారి శాంతి ఒప్పందాలను సులభతరం చేయడంలో ట్రంప్‌ కీలక పాత్ర పోషించారని క్లాడియా టెన్నీ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. దశాబ్ధాలుగా కొనసాగుతోన్న ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యకు పరిష్కారం చూపించకుండా మధ్యప్రాచ్యంలో అదనపు శాంతి ఒప్పందాలు కుదర్చడం సాధ్యం కాదని, అటువంటి అసాధ్యాన్ని ట్రంప్‌ సుసాధ్యం చేసి చూపించాడని గుర్తు చేశారు. మధ్య ప్రాచ్యంలో శాంతి ఒప్పందాల రూపకల్పనకు ట్రంప్ సాహసోపేతమైన ప్రయత్నాలు చేశారని వివరించారు.

ఇవి కూడా చదవండి

ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతిని అందజేయడం ఎందుకు సబబో ఆయన చెబుతూ.. అబ్రహం ఒప్పందాలను రూపొందించడంలో అధ్యక్షుడుగా ట్రంప్ చేసిన సాహసోపేతమైన ప్రయత్నాలు విశిష్టమైనవి. అయితే ఇవి నోబెల్ శాంతి బహుమతి కమిటీ ఇంత వరకూ గుర్తించలేదు. అందుకే ఈ రోజు ట్రంప్‌ పేరు నామినేట్‌ చేసినట్లు చెప్పారు. అంతర్జాతీయ వేదికపై ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ బలహీణ నాయకత్వం గతంలో కంటే ఇప్పుడు మన దేశ భత్రతకు ముప్పు కలిగించేలా ఉంది. ట్రంప్‌ బలమైన నాయకత్వం, ప్రపంచ శాంతికి ఆయన చేస్తున్న కృషిని గుర్తించాలని మేము కోరుతున్నాం. మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పేరును నామినెట్‌ చేయడం గౌరవంగా భావిస్తున్నాం. ఆయన కృషికి తగిన గుర్తింపు రావాలని కోరుతున్నాం అని అన్నారు.

అయితే 2020లో సంతకం చేసిన అబ్రహం ఒప్పందాలు ఇజ్రాయెల్-అరబ్ సంబంధాలను బలోపేతం చేయడానికి ఒక చర్యగా భావించినప్పటికీ, అవి ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదానికి తుది పరిష్కారాన్ని చూపలేకపోయాయనే విమర్శలు వస్తున్నాయి. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన విదేశాంగ విధానంపై విమర్శలు వస్తున్నప్పటికీ ఇప్పటికే పలుమార్లు ఈ విశిష్ట పురస్కారానికి నామినేట్‌ అయ్యారు. కానీ ఒక్కసారి కూడా బహుమతిని గెలుచుకోలేకపోయారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.