Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nirmala Sitharaman Saree: బడ్జెట్‌ ప్రసంగంలో తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్‌ ధరించిన చీర విశేషం ఇదే..

ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఆరో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. 2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ రోజు ప్రవేశ పెడుతున్న మధ్యంతర బడ్జెట్ విశిష్టతను సంతరించుకుంది. ఈ క్రమంలో ఆర్ధిక మంత్రి వస్త్రాలంకరణ మొదలు చేతిలో ఉండే బడ్జెట్‌ బ్యాగ్‌ వరకు ప్రతి ఒక్కటీ ప్రత్యేకతను చాటుకుంటాయి. ఇక ఈ రోజు ఉదయం 11 గంటలకు మంత్రి నిర్మల లోక్‌సభలో బడ్జెట్‌ ప్రసంగం..

Nirmala Sitharaman Saree: బడ్జెట్‌ ప్రసంగంలో తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్‌ ధరించిన చీర విశేషం ఇదే..
Nirmala Sitharaman Budget 2024
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 02, 2024 | 6:51 AM

ఢిల్లీ, జనవరి 1: ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఆరో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. 2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ రోజు ప్రవేశ పెడుతున్న మధ్యంతర బడ్జెట్ విశిష్టతను సంతరించుకుంది. ఈ క్రమంలో ఆర్ధిక మంత్రి వస్త్రాలంకరణ మొదలు చేతిలో ఉండే బడ్జెట్‌ బ్యాగ్‌ వరకు ప్రతి ఒక్కటీ ప్రత్యేకతను చాటుకుంటాయి. ఇక ఈ రోజు ఉదయం 11 గంటలకు మంత్రి నిర్మల లోక్‌సభలో బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభించారు. మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించడానికి కొన్ని గంటల ముందు నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి వచ్చారు. అక్కడ నీలం, క్రీమ్-రంగు టస్సార్ చీరలో కనిపించారు మన తెలుగింటి కోడలు మంత్రి నిర్మలా సీతారామన్‌.

నిజానికి.. నిర్మలా సీతారామన్‌కు భారతీయ వస్త్రాల పట్ల తనకున్న అభీష్టాన్ని తొలి నాళ్లనుంచి తనదైన ప్రత్యేకతను చాటుతూనే ఉన్నారు. గతేడాది నవలగుండ ఎంబ్రాయిడరీని చేతితో నేసిన ఎరుపు రంగు ఇల్కల్ చీరను మంత్రి ధరించారు. కర్ణాటకలోని ధార్వాడ్‌కు చెందిన మంత్రి ప్రహ్లాద్ జోషి మంత్రి నిర్మలకు బహుమతిగా అందించబడింది. ఆమె ఈ చీరను ధరించి బడ్జెట్ ప్రవేశ పెట్టే రోజున కనిపించారు. ఇక ఈ రోజు ఆఫ్-వైట్ లేదా క్రీమ్ కలర్ కలర్‌ చీరలో ఆర్థిక మంత్రి కనిపించారు. ఈ రంగు వస్త్రాలు ఆమె ఇష్టమైనవిగా చెప్పవచ్చు. ఎందుకంటే తరచుగా ఆమె ఇదే రంగు వస్త్రాలను ధరించడం కనిపిస్తుంది. 2021లో సిహారమన్ ఎరుపు, తెలుపు రంగు పోచంపల్లి చీరను ధరించారు.

బడ్జెట్ లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

2022లో సీతారామన్ గోధుమ రంగు బొమ్కై చీరను ధరించారు. 2020లో సన్నటి నీలం అంచుతో పూర్తిగా పసుపు రంగు పట్టు చీరలో కనిపించారు. 2019లో గోల్డెన్ బార్డర్‌తో కూడిన గులాబీ రంగు మంగళగిరి చీరను ధరించారు. ఇలా మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశ పెట్టే రోజుల్లో చేతితో నేసిన చీరలే కాకుండా, చేతిలో స్టైలిస్టిక్ గా ప్రతీయేట రెడ్ కలర్‌ బ్యాగ్‌ తీసుకురావడం గమనార్హం. 2019లో ఈ రెడ్ బ్యాగ్‌ను ఆమె మొదటి బడ్జెట్‌కు తీసుకువచ్చారు. ఇక నాటి నుంచి 2024 బడ్జెట్‌ వరకూ అదే ఎరుపు రంగు బ్యాగ్‌ను తీసుకువస్తున్నారు. ఆ బ్యాగ్‌లో ఒక టాబ్లెట్‌ను తీసుకువస్తారు. దీంతో నాటి నుంచి బడ్జెట్ పేపర్‌లెస్‌గా మారింది. టాబ్లెట్‌లోనే ఆమె బడ్జెట్ విషయాలను లోక్‌సభలో చదివి వినిపిస్తున్నారు.

కాగా ఈ రోజు ప్రవేశ పెడుతున్న మధ్యంతర బడ్జెట్ 2024 మోడీ సర్కార్‌కు కీలకమైనదిగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎందుకంటే వరుగా రెండోసారి అధికారం చేపట్టిన మోడీ సర్కార్‌కు ఇదే చివరి బడ్జెట్. ఈ ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ దాదాపు 7 శాతానికి చేరుకోగలదని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక సమీక్షలో పేర్కొంది. భారత ఆర్థిక వ్యవస్థ 2022-23లో 7.2 శాతం, 2021-22లో 8.7 శాతం వృద్ధి సాధించింది. 2023-24లో మూలధన వ్యయాన్ని రూ.10 లక్షల కోట్లకు అంటే 33 శాతం పెంచాలని ప్రతిపాదించింది. ఇది జీడీపీలో 3.3 శాతం.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.