- Telugu News Photo Gallery Budget 2024: Special Moment Between President, Finance Minister Ahead Of Budget see pics
Budget 2024: బడ్జెట్ వేళ ఆసక్తికర దృశ్యం.. నిర్మలమ్మకు తీపి తినిపించిన రాష్ట్రపతి ముర్ము
దేశ ప్రజలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న క్షణాలు రానే వచ్చేశాయి. కేంద్ర ఆర్ధిక మంత్రి మధ్యంతర బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. అయితే సభలోకి నిర్మలమ్మ అడుగు పెట్టడానికి ముందు ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించారు. అంతేకాదు నిర్మలమ్మకు స్వయంగా స్వీట్ ని తినిపించి నోరు తీపి చేసి మరీ విశేష చెప్పారు ప్రధమ పౌరురాలు.
Updated on: Feb 01, 2024 | 12:09 PM

2024 మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించడానికి ఆర్థిక మంత్రి పార్లమెంటులో ప్రవేశించడానికి ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను అభినందించారు. తన చేతులతో స్వయంగా స్వీట్ ని తీసుకుని తినిపించారు.

ఈ సన్నివేశానికి సంబంధించిన ఫోటోలను రాష్ట్రపతి భవన్ కి చెందిన ఎక్స్ ఖాతాలో షేర్ చశారు. ఆ ఫోటోలలో రాష్ట్రపతి ముర్ము .. సీతారామన్‌కు ఒక స్పూన్ తో స్వీట్ ను నోటికి అందిస్తున్నట్లు ఉంది. నోరు తీపి చేసి మరీ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

"కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు రాష్ట్ర మంత్రులు డాక్టర్ భగవత్ కిషన్‌రావ్ కరద్, పంకజ్ చౌదరి , ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు కేంద్ర బడ్జెట్‌ను సమర్పించే ముందు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఈ సమయంలో రాష్ట్రపతి ముర్ము నిర్మలమ్మపై ప్రశంసల వర్షం కురిపించారు. కేంద్ర ఆర్థిక మంత్రికి శుభాకాంక్షలు" అని రాష్ట్రపతి భవన్ ఎక్స్‌లో పోస్ట్‌లో పేర్కొంది.

కేంద్ర ఆర్ధిక మంత్రిగా నిర్మమలా సీతారామన్ వరసగా ఆరోసారి బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెడుతున్నారు. దీంతో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేశారు సీతారామన్

మొరార్జీ దేశాయ్ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో.. 1959 నుంచి 1964 మధ్య ఐదు వార్షిక బడ్జెట్‌లను .. ఒకసారి మధ్యంతర బడ్జెట్‌ను ఇలా మొత్తం ఆరు సార్లు బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన ఘనతను సొంతం చేసుకున్నారు.

ఇప్పుడు 2024 మధ్యంతర బడ్జెట్‌ను సమర్పిస్తున్న నిర్మాలన్న ఆ రికార్డ్ ను సమం చేశారు.




