School Holidays: విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. ఫిబ్రవరి 8న అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం! కారణం ఇదే
తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలు, ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 8న పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. ముస్లింలు జరుపుకునే షబ్-ఎ-మెరాజ్ పండుగ సందర్భంగా తెలంగాణ సర్కార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన సెలవుల క్యాలెండర్‌లో ఫిబ్రవరి 8వ తేదీని షబ్-ఎ-మెరాజ్‌కు సెలవు దినంగా ప్రకటించింది. అయితే దీనిని సాధారణ సెలవుగా కాకుండా ఆప్షనల్ హాలిడేగా పేర్కొంది..
హైదరాబాద్, ఫిబ్రవరి 2: తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలు, ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 8న పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. ముస్లింలు జరుపుకునే షబ్-ఎ-మెరాజ్ పండుగ సందర్భంగా తెలంగాణ సర్కార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన సెలవుల క్యాలెండర్‌లో ఫిబ్రవరి 8వ తేదీని షబ్-ఎ-మెరాజ్‌కు సెలవు దినంగా ప్రకటించింది. అయితే దీనిని సాధారణ సెలవుగా కాకుండా ఆప్షనల్ హాలిడేగా పేర్కొంది. తాజాగా తెలంగాణ సర్కార్ ఫిబ్రవరి 8వ తేదీని సాధారణ సెలవుగా మార్చి పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది.
కాగా షబ్-ఎ-మెరాజ్ ముస్లింలు పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఆ రోజు మసీదులను దీపాలతో అందంగా అలంకరిస్తారు. రాత్రంతా జాగారం చేసి ప్రార్థనలు చేస్తారు. ఈ పండగ రోజు ఇస్రా, మేరాజ్‌ల కథను మసీదుల్లో చెబుతుంటారు. ముస్లీంలు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చే ఈ పండగ రోజును ప్రభుత్వం సెలవుగా ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేశారు. ఇక ఫిబ్రవరి 8న సాధారణ సెలవు దినంగా ప్రకటన విడుదల కావడంతో ఆ రోజున ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు మూత పడనున్నాయి. ఇకపోతే ఫిబ్రవరి 8వ తేదీ తర్వాత ఈ నెలలో సాధారణ సెలవులు లేవు. వచ్చే నెల మార్చి నెలలోనే సాధారణ సెలవులు ఉన్నాయి.
హాలిడే క్యాలెండర్ ప్రకారం 2024 మర్చి నెలలో వచ్చే సెలవులు ఇవే..
మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా సెలవు ఉంటుంది. మార్చి 25వ తేదీన హోలీ పండగ, మార్చి 29వ తేదీన గుడ్ ఫ్రైడే సందర్భగా సెలవులు ఉంటాయి. ఆ తర్వాత ఏప్రిల్ నెలలో 5వ తేదీన బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఏప్రిల్ 9న ఉగాది పర్వదినం సందర్భంగా సెలవు ఉంటుంది. ఏప్రిల్ 11, 12 తేదీల్లో రంజాన్ పురస్కరించుకుని సెలవులు ఉంటాయి. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి, ఏప్రిల్ 17 శ్రీరామనవమికి సెలవులు ఉన్నాయి. జూన్ 17న బక్రీద్, జులై 17న మెుహర్రం, జులై 29న బోనాలు, ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే, ఆగస్ట్ 26 శ్రీకృష్ణ జన్మాష్టమి, సెప్టెంబర్ 7న వినాయక చవితి, సెప్టెంబర్ 16న ఇద్ నబీ, అక్టోబర్ 2న మహత్మ గాంధీ జయంతి, అక్టోబర్‌లో దసరా సెలవులు, అక్టోబర్ 31న దీపావళి, నవంబర్ 15 గురు నానక్ జయంతి, డిసెంబర్ 25న క్రిస్మస్.. వరుసగా ఈ తేదీల్లో సెలవులు ఉంటాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.