Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chollangi Amavasya: పితృ దోషం తొలగడానికి చొల్లంగి అమావాస్య రోజున చేయాల్సిన పూజలు, దానాలు ఏమిటంటే

ఈ ఏడాది  చొల్లంగి అమావాస్య మాఘమాసంలో 9 ఫిబ్రవరి 2024న వస్తుంది. ఈ రోజున పురాణ గ్రంధాలు సూచించిన కొన్ని నివారణలు చేయడం ద్వారా పితృ దోషం నుండి ఉపశమనం పొందుతారని నమ్మకం. చొల్లంగి అమావాస్య రోజున నువ్వులు, నువ్వులతో చేసిన వస్తువులను దానం చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుంది. అమావాస్య రోజున ఉపవాసం ఉండడం వల్ల పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని మత విశ్వాసం. ఈ నేపథ్యంలో ఈ రోజు చొల్లంగి  అమావాస్య రోజు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం.. 

Chollangi Amavasya: పితృ దోషం తొలగడానికి చొల్లంగి అమావాస్య రోజున చేయాల్సిన పూజలు, దానాలు ఏమిటంటే
Chollangi Amavasya
Follow us
Surya Kala

|

Updated on: Feb 02, 2024 | 8:12 AM

హిందూ క్యాలెండర్ ప్రకారం పుష్య మాసంలోని కృష్ణ పక్ష అమావాస్య తిథిని చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు. ఏడాది పొడవునా వచ్చే అమావాస్యలలో చొల్లంగి అమావాస్యకు విశేష ప్రాధాన్యత ఉందని గ్రంధాలలో చెప్పబడింది. పితృదోషం తొలగి పూర్వీకుల ఆశీస్సులు పొందడానికి ఈ అమావాస్య చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఈ రోజున పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి తర్పణం, పిండదానం, దానాలు మొదలైన కార్యక్రమాలను చేసే సంప్రదాయం ఉంది. ఈ ఏడాది  చొల్లంగి అమావాస్య మాఘమాసంలో 9 ఫిబ్రవరి 2024న వస్తుంది. ఈ రోజున పురాణ గ్రంధాలు సూచించిన కొన్ని నివారణలు చేయడం ద్వారా పితృ దోషం నుండి ఉపశమనం పొందుతారని నమ్మకం. ఈ నేపథ్యంలో ఈ రోజు చొల్లంగి  అమావాస్య రోజు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం..

చొల్లంగి అమావాస్య రోజున నువ్వులు, నువ్వులతో చేసిన వస్తువులను దానం చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుంది. అమావాస్య రోజున ఉపవాసం ఉండడం వల్ల పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని మత విశ్వాసం. ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతుష్టులై తమ వారసులను ఆశీర్వదిస్తారు. చేపట్టిన పనులు ఆటంకాలు లేకుండా అన్ని పనులు పూర్తవుతాయని విశ్వాసం. అమావాస్య రోజున పూర్వీకులు వంశస్థులను కలవడానికి వస్తారని గరుడ పురాణంలో చెప్పబడింది. ఈ రోజున ఉపవాసం ఉండడం, పవిత్ర నదిలో స్నానం చేయడం, దానాలు చేయడం, నైవేద్యాలు సమర్పించడం ద్వారా పూర్వీకులు సంతుష్టులవుతారట.

చొల్లంగి అమావాస్య రోజున చేయాల్సిన పరిహారాలు

  1. చొల్లంగి అమావాస్య రోజున పిండిలో పంచదార కలిపి దానిని చీమలకు ఆహారంగా అందించండి. ఇలా చేయడం వలన పూర్వీకుల దోషాలు తొలగిపోవడమే కాకుండా వారి ఆశీస్సులతో కోరిన కోరికలు నెరవేరుతాయి.
  2. చొల్లంగి అమావాస్య రోజున తప్పనిసరిగా నల్ల నువ్వుల లడ్డూలు, నువ్వుల నూనె, దుప్పటి, ఉసిరి కాయలు, నల్లని వస్త్రాలను పేదవారికి దానం చేయాలి. ఇలా చేయడం వల్ల పితృ దోషం తొలగిపోతుంది.
  3. ఇవి కూడా చదవండి
  4. అమావాస్య రోజున పవిత్ర నదిలో స్నానం చేసి నల్ల నువ్వులను దానం చేయడం ద్వారా పూర్వీకులు సంతుష్టులవుతారని పితృ దోషం నుండి విముక్తి పొందుతారని నమ్మకం.
  5. పితృ దోషం పోవాలంటే చొల్లంగి అమావాస్య రోజున మీ పూర్వీకులను స్మరించుకుని ఆ రోజున సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. అంతే కాకుండా రాగి పాత్రలో నల్ల నువ్వులు, ఎర్రటి పువ్వులను నీటిలో కలిపి ఈ నీటితో సూర్య భగవానుడికి సమర్పించండి.
  6. ఈ రోజున రావి చెట్టుకు తెల్లటి మిఠాయిలను సమర్పించి.. చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణ చేయండి. ఇలా చేయడం వల్ల మీ పూర్వీకుల ఆశీస్సులు మీకు లభిస్తాయి.
  7. చొల్లంగి అమావాస్య రోజున ఇంటి దక్షిణ దిశలో తెల్లటి గుడ్డపై నల్ల నువ్వులను ఉంచి ఇత్తడి లేదా రాగిపై పితృ యంత్రాన్ని అమర్చండి. అనంతరం కుడి వైపున పూర్వీకులను స్మరిస్తూ నువ్వుల నూనె దీపం వెలిగించాలి. మధ్యలో నీటితో నింపిన స్టీల్ పాత్రను ఉంచండి. దానిపై స్టీల్ ప్లేట్, ప్లేట్ మీద నువ్వుల గింజలతో తయారు చేసిన ఆహారాన్ని ఉంచండి. అనంతరం ఆహారంపై తులసి ఆకులను ఉంచండి. తెల్లటి పుష్పాన్ని సమర్పించండి. ఈ నైవేథ్యంలో కొంత భాగాన్ని కుక్కకు, ఆవుకి ఆహారంగా అందించి మిగిలిన దానిని రావి చెట్టు కింద ఉంచండి. ఇలా చేసే సమయంలో మాట్లాడకుండా మౌనంగా ఉండాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు