AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai: ముంబైలో మారణహోమం సృష్టిస్తాం.. 6 చోట్ల బాంబులు అమర్చినట్లు మెసేజ్.. నిందితుడి కోసం పోలీసులు గాలింపు

ముంబై ట్రాఫిక్ పోలీసుల హెల్ప్‌లైన్ నంబర్‌లోని వాట్సాప్ నంబర్‌కు ఓ బెదిరింపు సందేశం వచ్చింది. ఈ విషయాన్నీ వెంటనే ట్రాఫిక్ పోలీసులు సిటీ పోలీసులకు, క్రైం బ్రాంచ్ ఏటీఎస్‌కు చెప్పారు. సమాచారం అందిన వెంటనే ముంబై పోలీసులు కొన్ని అనుమానాస్పద ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టారు. అయితే ఇప్పటి వరకూ ఎటువంటి అనుమాస్పద వస్తువులు లభించలేదు.

Mumbai: ముంబైలో మారణహోమం సృష్టిస్తాం.. 6 చోట్ల బాంబులు అమర్చినట్లు మెసేజ్.. నిందితుడి కోసం పోలీసులు గాలింపు
Mumbai Bomb Threat
Surya Kala
|

Updated on: Feb 02, 2024 | 10:02 AM

Share

మహారాష్ట్రలోని ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు బెదిరింపు మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ అందిన వెంటనే అధికారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దేశ ఆర్ధిక రాజధాని ముంబైలోని 6 చోట్ల బాంబులు అమర్చినట్లు ఈ సందేశంలో పేర్కొన్నారు గుర్తు తెలియని వ్యక్తులు. సందేశం అందిన తర్వాత భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. మెసేజ్ పంపిన వ్యక్తిని ముంబై పోలీసులు ట్రేస్ చేసేందుకు రంగంలోకి దిగారు.

ముంబై ట్రాఫిక్ పోలీసుల హెల్ప్‌లైన్ నంబర్‌లోని వాట్సాప్ నంబర్‌కు ఓ బెదిరింపు సందేశం వచ్చింది. ఈ విషయాన్నీ వెంటనే ట్రాఫిక్ పోలీసులు సిటీ పోలీసులకు, క్రైం బ్రాంచ్ ఏటీఎస్‌కు చెప్పారు. సమాచారం అందిన వెంటనే ముంబై పోలీసులు కొన్ని అనుమానాస్పద ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టారు. అయితే ఇప్పటి వరకూ ఎటువంటి అనుమాస్పద వస్తువులు లభించలేదు. ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని అర్థరాత్రి జాయింట్‌ సీపీ ఆదేశించారు. ఈ కాల్స్ పై  నగర పోలీసులతో పాటు క్రైం బ్రాంచ్ కూడా దర్యాప్తు చేస్తోంది.

నిందితుడి కోసం వెదుకుతున్న పోలీసులు

ఈ చర్యకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని ముంబై పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ సందేశం పంపిన నంబర్‌పై నిఘా ఉంచారు. మొబైల్ లొకేషన్‌ను గుర్తించిన వెంటనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

గతంలో కూడా ఇలాంటి కాల్స్

అయితే ముంబై పోలీసులకు ఇలాంటి కాల్స్ రావడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది డిసెంబర్‌లో ముంబై పోలీసులకు ఇలాంటి కాల్స్ వచ్చాయి. గతేడాది ఆగస్టులో ముంబైలోని లోకల్ ట్రైన్‌లో బాంబు పేలుడు జరగబోతోందని ఓ వ్యక్తి ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. రైలులో బాంబులు ఉన్నాయని ఆ వ్యక్తి ముంబై పోలీసులకు తెలిపాడు. అయితే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి పేరు అశోక్ ముఖియా అతను బీహార్‌లోని సీతామర్హి జిల్లా నివాసి. అశోక్ మద్యం మత్తులో ఫోన్ చేశాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!