FASTag KYC: వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ గడువు పొడిగింపు
టోల్ బూత్‌ల వద్ద రద్దీని తగ్గించేందుకు ఫాస్ట్‌ట్యాగ్ వినియోగాన్ని పెంచారు. ఇది ఎలక్ట్రానిక్ టోల్ సేకరణను వేగవంతం చేసింది. ప్రతి వాహనానికి ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి అయితే, ఎక్కువగా ఉన్న వాహనాలకు ఒకే ఫాస్ట్‌ట్యాగ్‌ని ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. అందువలన ఈ e-KYC అప్‌డేట్‌ను తీసుకువచ్చింది. మీరు NHAI FASTag విభాగంలో నోటిఫికేషన్, ఇతర అప్‌డేట్‌లను కనుగొనవచ్చు.
టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ రద్దు పెరగకుండా ఫాస్టాగ్ ద్వారా టోల్ ట్యాక్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఫాస్ట్‌ట్యాగ్‌కు కేవైసీ అప్‌డేట్ చేయడం చాలా ముఖ్యం. కేవైసీ పూర్తి చేయడాన్ని నేషనల్ హైవేస్ అథారిటీ (NHAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కేవైసీ పూర్తి చేసేందుకు గడువు జనవరి 31తో ముగిసింది. అయితే ఈ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ గడువును ఫిబ్రవరి 29వ తేదీ వరకు పెంచుతూ నేషనల్ హైవే అథారిటీ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మరో నెల పాటు కేవైసీ అప్‌డేట్ కోసం వాహనదారులకు అందుబాటులో ఉండనుంది. FASTagలో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు ఈ కేవైసీ అప్‌డేట్‌ను తీసుకువచ్చారు. అయితే ఫిబ్రవరి 29లోగా మీ ఫాస్ట్‌ట్యాగ్‌ను కేవైసీ అప్‌డేట్ చేయకపోతే డీయాక్టివేట్ అవుతుంది.
ఫాస్ట్‌ట్యాగ్ డిమాటి మూడేళ్లపాటు
ఫిబ్రవరి 15, 2021 నుండి నాలుగు చక్రాల వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి చేయబడింది. టోల్ బూత్‌ల వద్ద రద్దీని తగ్గించేందుకు ఫాస్ట్‌ట్యాగ్ వినియోగాన్ని పెంచారు. ఇది ఎలక్ట్రానిక్ టోల్ సేకరణను వేగవంతం చేసింది. ప్రతి వాహనానికి ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి అయితే, ఎక్కువగా ఉన్న వాహనాలకు ఒకే ఫాస్ట్‌ట్యాగ్‌ని ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. అందువలన ఈ e-KYC అప్‌డేట్‌ను తీసుకువచ్చింది.
రెట్టింపు టోల్ ట్యాక్స్
ఫాస్ట్‌ట్యాగ్‌ను అప్‌డేట్ చేయకపోతే వాహనదారులు టోల్ బూత్‌లో రెట్టింపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీరు NHAI FASTag విభాగంలో నోటిఫికేషన్, ఇతర అప్‌డేట్‌లను కనుగొనవచ్చు. సింగిల్ ఫాస్ట్‌ట్యాగ్‌ని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
మీరు ఫాస్ట్‌ట్యాగ్ KYCని అప్‌డేట్ చేయకుంటే త్వరగా చేయండి. KYC అప్‌డేట్ అయ్యిందో.. లేదో తనిఖీ చేయడానికి fastag.ihmcl.comకి లాగిన్ చేయండి. మీరు మీ నమోదిత మొబైల్, పాస్‌వర్డ్ లేదా OTPతో లాగిన్ చేయవచ్చు. డాష్‌బోర్డ్‌లోని మై ప్రొఫైల్‌పై క్లిక్ చేయండి. సరైన సమాచారాన్ని పూరించిన తర్వాత మీరు స్థితిని తనిఖీ చేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి