AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank: మీ సేవింగ్స్‌ అకౌంట్‌లో ఎన్ని డబ్బులున్నాయి.? నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..

సేవింగ్స్‌ అకౌంట్‌కు సంబంధించి కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి. సేవింగ్‌ అకౌంట్‌లో ఎంత నగదు ఉండొచ్చు అంతకంటే ఎక్కువ నగదు ఉంటే ఏమవుతుందన్న విషయాలకు సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి. సేవింగ్స్‌ అకౌంట్‌లో బ్యాలెన్స్‌ ఎక్కువగా ఉంటే ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఎక్కువగా ఉంటే కోత పడొచ్చని..

Bank: మీ సేవింగ్స్‌ అకౌంట్‌లో ఎన్ని డబ్బులున్నాయి.? నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..
Saving Account
Narender Vaitla
|

Updated on: Feb 01, 2024 | 3:01 PM

Share

ప్రస్తుత రోజుల్లో బ్యాంక్‌ అకౌంట్‌ లేని వారు ఉండరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సంక్షేమ పథకాల అమలు నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా బ్యాంకింగ్ సేవలు విస్తరించాయి. డిజిటలైజేషన్‌ నేపథ్యంలో క్షణాల్లో బ్యాంక్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేసే రోజులు వచ్చేశాయ్‌. మనలో చాలా మంది సేవింగ్స్‌ అకౌంట్స్‌ను కలిగి ఉంటారు. అయితే సేవింగ్స్‌ అకౌంట్స్‌ విషయంలో కొన్ని నిబంధనలు ఉంటాయని మీకు తెలుసా.? సేవింగ్స్‌ అకౌంట్స్‌కు సంబంధించి ఉన్న నియమనిబంధనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…

సేవింగ్స్‌ అకౌంట్‌కు సంబంధించి కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి. సేవింగ్‌ అకౌంట్‌లో ఎంత నగదు ఉండొచ్చు అంతకంటే ఎక్కువ నగదు ఉంటే ఏమవుతుందన్న విషయాలకు సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి. సేవింగ్స్‌ అకౌంట్‌లో బ్యాలెన్స్‌ ఎక్కువగా ఉంటే ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఎక్కువగా ఉంటే కోత పడొచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.సేవింగ్స్‌ అకౌంట్‌లో నగదు డిపాజిట్ పరిమితి దాటితే ట్యాక్స్ పరిధిలోకి వస్తుంది.

సేవింగ్స్‌ అకౌంట్‌లో నగదు పరిమితిని విధించడానికి ప్రధాన కారణం.. మనీ లాండరింగ్, పన్ను ఎగవేత నిరోధించడం, నగదు లావాదేవీలను అరికట్టేందుకే. సేవింగ్స్‌ అకౌంట్‌లో ప్రస్తుతం రోజుకు రూ. 1 లక్ష వరకు డిపాజిట్‌ చేసుకునే అవకాశం ఉంది. అయితే కొన్ని రకాల అనుమతులు తీసుకుంటే ఈ పరిమితిని రూ 2.5 లక్షల వరకు పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇక ఏడాది చొప్పున తీసుకుంటే సేవింగ్స్‌ అకౌంట్‌లో నగదు డిపాజిట్‌ పరిమితి రూ. 10 లక్షలు దాటనంత వరకు ఎలాంటి సమస్యలేదు. అయితే ఈ మొత్తం కంటే పెరిగితే మాత్రం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

ఒకవేళ ఒకే ఆర్థిక సంవత్సరంలో నగదు డిపాజిట్‌ రూ. 10 లక్షలు దాటితే సంబంధిత బ్యాంక్‌ రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ మార్గదర్శకాల ప్రకారం.. సేవింగ్స్ అకౌంట్స్‌లో ఉండే, నగదు నిల్వలపై నేరుగా ట్యాక్స్ విధించరు. ఈ నగదుపై లభించే వడ్డీపై పన్ను ఉంటుంది. వివిధ బ్యాంకింగ్ లేదా ఫైనాన్షియల్ సంస్థలు డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీని అందిస్తుంటాయి. ఇదంతా ఎలా ఉన్నా ఏడాదిలో మొత్తం ఆదాయంపై మాత్రమే ఐటీ రిటర్న్స్ ఆధారంగా ట్యాక్స్ ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..