AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSKపై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్న కొత్త జంట.. క్రికెట్ నేపథ్యంలో పెళ్లి కార్డు వైరల్

భారత్‌లో ఐపీఎల్‌పై ప్రజల్లో క్రేజ్‌ ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. మ్యాచ్ ప్రారంభమైన వెంటనే.. దీని  ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే స్థాయిలో ఉన్నందున ప్రజలు టీవీ స్క్రీన్ ముందు తమను తాము సెట్ చేసుకుంటారు. అలాంటి ఓ అభిమాని ఇన్విటేషన్ కార్డ్ వైరల్ అవుతోంది. కొత్తగా పెళ్లయిన జంట కూడా ట్రోఫీ లాంటి కట్-అవుట్ పోస్టర్‌తో ఫోజులిస్తూ కనిపించారు. అందులో వారి  ఫోటోలున్నాయి.

CSKపై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్న కొత్త జంట.. క్రికెట్ నేపథ్యంలో పెళ్లి కార్డు వైరల్
Unique Card
Surya Kala
|

Updated on: Apr 20, 2024 | 3:52 PM

Share

ఏ జంటకైనా వివాహం అనేది ఒక మధురమైన అనుభూతి. తమ పెళ్లిని స్పెషల్ గా జీవితాంతం గుర్తుంచుకోవడానికి జంట రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అది అందమైన బట్టలు, ఆభరణాలు, అలంకరణ,  పెళ్లి చేసుకునే ప్రదేశం లేదా ఆహ్వానం కార్డు కావచ్చు.. పెళ్లి అనేది చాలా ప్రత్యేకమైనదిగా చేసుకుంటారు. ఇలాంటి పెళ్లి వేడుకలను చూసిన ప్రజలు చాలాసార్లు ఆశ్చర్యపోతారు కూడా. అలాంటి ఆహ్వాన కార్డు ఒకటి ప్రస్తుతం ప్రజల్లో చర్చనీయాంశమైంది.

భారత్‌లో ఐపీఎల్‌పై ప్రజల్లో క్రేజ్‌ ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. మ్యాచ్ ప్రారంభమైన వెంటనే.. దీని  ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే స్థాయిలో ఉన్నందున ప్రజలు టీవీ స్క్రీన్ ముందు తమను తాము సెట్ చేసుకుంటారు. అలాంటి ఓ అభిమాని ఇన్విటేషన్ కార్డ్ వైరల్ అవుతోంది. కొత్తగా పెళ్లయిన జంట కూడా ట్రోఫీ లాంటి కట్-అవుట్ పోస్టర్‌తో ఫోజులిస్తూ కనిపించారు. అందులో వారి  ఫోటోలున్నాయి. ఇది ఆ దంపతులు ఇద్దరూ CSK అభిమానులని స్పష్టం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ పోస్ట్ చూడండి

వైరల్ అవుతున్న ఈ ఆహ్వాన పత్రిక తమిళనాడుకు చెందిన జంటకు సంబంధించింది. ఇందులో రెండు చిత్రాలను పోస్ట్ చేశారు. మొదటిది కొత్తగా పెళ్లయిన జంట ట్రోఫీ లాంటి కటౌట్ పోస్టర్‌తో పోజులివ్వడం కనిపిస్తుంది. దీన్ని చూస్తుంటే అంతర్జాతీయ మ్యాచ్‌లో గెలిచినట్టే అనిపిస్తోంది. ఈ ఆహ్వానం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లోగోను కలిగి ఉంది. అందులో వధూవరుల పేర్లు వ్రాయబడ్డాయి. కార్డులో రాసుకున్న ఆహ్వానం వివరాలు కూడా క్రికెట్ మ్యాచ్ జరిగే విధానం స్ఫూర్తిగా తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ వీడియో cskfansofficial అనే ఖాతా ద్వారా Instaలో భాగస్వామ్యం చేయబడింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వేలాది మంది దీన్ని చూసి, కామెంట్ చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశారు, ‘ఈ విధంగా ఇన్విటేషన్ కార్డ్‌లను సిద్ధం చేయడం అంత ఈజీ కాదు.’ మరొకరు, ‘అందమైన జంట.  రాబోయే ఇన్నింగ్స్‌కు మరిన్ని శుభాకాంక్షలు’ అని రాశారు. అంతేకాదు చాలా మంది ఇతర వినియోగదారులు ఈ వీడియోపై వ్యాఖ్యానిస్తూ రకరకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,.

Follow Us
విషాదం.. ఎనిమిదేళ్ల బాలుడు ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి!
విషాదం.. ఎనిమిదేళ్ల బాలుడు ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి!
రూపాయి ఖర్చు లేకుండా.. ఒక చామంతి మొక్క నుంచి వందల మొక్కలు..
రూపాయి ఖర్చు లేకుండా.. ఒక చామంతి మొక్క నుంచి వందల మొక్కలు..
సజ్జ పిండి, మెంతికూర ఉంటే చాలు.. టేస్టీ మిస్సీ రోటీలు రెడీ!
సజ్జ పిండి, మెంతికూర ఉంటే చాలు.. టేస్టీ మిస్సీ రోటీలు రెడీ!
న్యూజిలాండ్‌తో సిరీస్‌లో భువీ చెత్త ప్రపంచ రికార్డు
న్యూజిలాండ్‌తో సిరీస్‌లో భువీ చెత్త ప్రపంచ రికార్డు
సీఆర్‌పీఎఫ్‌ చారిత్రాత్మక రికార్డు.. 47 ఏళ్ల తర్వాత తొలిసారిగా..
సీఆర్‌పీఎఫ్‌ చారిత్రాత్మక రికార్డు.. 47 ఏళ్ల తర్వాత తొలిసారిగా..
చలికాలంలోనూ పిండి చక్కగా పులియాలంటే ఈ ట్రిక్ పాటించండి!
చలికాలంలోనూ పిండి చక్కగా పులియాలంటే ఈ ట్రిక్ పాటించండి!
ఓటీటీలో వణుకు పుట్టిస్తోన్న సరికొత్త హారర్ థ్రిల్లర్
ఓటీటీలో వణుకు పుట్టిస్తోన్న సరికొత్త హారర్ థ్రిల్లర్
తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంగా మార్చారు.. అమిత్ షా ఫైర్
తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంగా మార్చారు.. అమిత్ షా ఫైర్
అరటిపండు తొక్కలను పారేయకండి-ఒత్తైన,పొడవాటి జుట్టు కోసం ఇలా వాడితే
అరటిపండు తొక్కలను పారేయకండి-ఒత్తైన,పొడవాటి జుట్టు కోసం ఇలా వాడితే
పోలీసు కానిస్టేబుల్‌కే టోకరా.. రూ.29 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు!
పోలీసు కానిస్టేబుల్‌కే టోకరా.. రూ.29 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు!