అనారోగ్యానికి గురైన కేర్‌టేకర్‌ని కలవడానికి ఆస్పత్రికి చేరుకున్న ఏనుగు.. హృదయాన్ని తాకే వీడియో

సంరక్షణ చేసే సంరక్షకుడు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నట్లు తెలుసుకున్నట్లు ఉంది.. దీంతో తన సంరక్షకుడిని కలవడానికి ఆస్పత్రి వద్దకు చేరుకుంది. అంతేకాదు ఏ మాత్రం శబ్దం చేయకుండా ఏనుగు తలుపు దగ్గర కూర్చుని.. మెల్లగా పాకుతూ సంరక్షకుడు ఉన్న బెడ్ దగ్గరకు చేరుకుంది. ఏనుగు అతన్ని మేల్కొలపడానికి ప్రయత్నించింది.

అనారోగ్యానికి గురైన కేర్‌టేకర్‌ని కలవడానికి ఆస్పత్రికి చేరుకున్న ఏనుగు.. హృదయాన్ని తాకే వీడియో
Elephant Video Viral
Follow us

|

Updated on: Mar 14, 2024 | 12:33 PM

సింహం, పులి, చిరుతపులి వంటి వన్యప్రాణుల నుంచి మానవులు తమని తాము సురక్షితంగా ఉంచుకోవాలని సలహా ఇస్తారు. అయితే మానవులు భయపడని కొన్ని అడవి జంతువులు ఉన్నాయి. ఎందుకంటే వాటిని మానవులకు సహచరులు అని కూడా పిలుస్తారు. వీటిలో ఏనుగులు కూడా ఉన్నాయి. భూమిపై నివసించే అతి పెద్ద జంతువు ఏనుగు.. శతాబ్దాలుగా మనుషులతో కలిసి జీవిస్తోంది. పూర్వకాలంలో రాజులు, చక్రవర్తులు వీటిపై స్వారీ చేసేవారు. అంతేకాదు వీటిని యుద్ధాలలో కూడా ఉపయోగించేవారు. వాస్తవానికి ఏనుగులు మనుషులతో స్నేహపూర్వకంగా ఉంటాయి. ప్రస్తుతం ఏనుగుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రజల హృదయాలను హత్తుకుంది.

తన సంరక్షణ చేసే సంరక్షకుడు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నట్లు తెలుసుకున్నట్లు ఉంది.. దీంతో తన సంరక్షకుడిని కలవడానికి ఆస్పత్రి వద్దకు చేరుకుంది. అంతేకాదు ఏ మాత్రం శబ్దం చేయకుండా ఏనుగు తలుపు దగ్గర కూర్చుని.. మెల్లగా పాకుతూ సంరక్షకుడు ఉన్న బెడ్ దగ్గరకు చేరుకుంది. ఏనుగు అతన్ని మేల్కొలపడానికి ప్రయత్నించింది. అయితే సంరక్షకుడు చాలా అనారోగ్యంతో, వృద్ధాప్యంలో ఉన్నందున అతను మంచం మీద నుండి కదలలేకపోయాడు. అప్పుడు అతని మంచం సమీపంలో ఉన్న ఒక మహిళ వృద్ధుడి చేతిని పట్టుకుని.. ఏనుగు తొండంపై పట్టుకోవడంలో సహాయపడింది. సంరక్షకుడి పట్ల ఏనుగుకు ఉన్న ప్రేమకు ఇది నిదర్శనంగా నిలిచింది.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి

హృదయాన్ని హత్తుకునే వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @TheFigen_ అనే IDతో షేర్ చేశారు. ‘ఒక ఏనుగు గ్రామంలో ఉన్న ఆసుపత్రిలో తన వృద్ధ సంరక్షకుడిని కలవడానికి వచ్చింది’ అని క్యాప్షన్ ఇచ్చారు. కేవలం 27 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 2.2 మిలియన్లు అంటే 22 లక్షల సార్లు వీక్షించగా, 36 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు.

అదే సమయంలో వీడియో చూసిన తర్వాత నెటిజన్లు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. ఒకరు ఇలా వ్రాశారు, ‘మనుషులు ఆ ఏనుగుకు ఏదైనా మంచి చేసి ఉంటారు.. ఎందుకంటే మనుషులు తమకు మంచి చేసిన  మానవులను వెంటనే మరచిపోతారు. అయితే జంతువులు ఎప్పటికీ మరచిపోలేవు’ అని వ్రాశారు. మరొకరు  ‘ఇది హృదయాన్ని హత్తుకునే క్షణం ఏనుగు తన మానవ స్నేహితుడిని కలవడానికి రావడం అని మరొకరు కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles