Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇనుప ఊపిరితిత్తులతో 70 ఏళ్లు జీవించిన పోలియో పాల్ మృతి.. నరకం వంటి జీవితాన్ని ఎలా గడిపాడంటే

US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం ఆ సంవత్సరం USలో 21,000 కంటే ఎక్కువ పోలియో కేసులు నమోదయ్యాయి. ఆ మహమ్మారి కాలంలో 1946లో ఒక బిడ్డ జన్మించింది. ఆ బిడ్డ పేరు పాల్ అలెగ్జాండర్. 1952లో అంటే పాల్ కు 6 సంవత్సరాల వయసు.. అతను కూడా పోలియో బారిన పడకుండా తప్పించుకోలేకపోయాడు. చిన్నవయసులోనే పోలియో సోకిన పాల్ బతకడానికి దాదాపు 7 దశాబ్దాల పాటు ఇనుప ఊపిరితిత్తుల సహాయం తీసుకోవలసి వచ్చింది. కొన్ని రోజుల క్రితం "పోలియో పాల్" గా ప్రసిద్ధి చెందిన పాల్ అలెగ్జాండర్ 78 సంవత్సరాల వయస్సులో ఈ లోకాన్ని విడిచిపెట్టారు. 

ఇనుప ఊపిరితిత్తులతో 70 ఏళ్లు జీవించిన పోలియో పాల్ మృతి.. నరకం వంటి జీవితాన్ని ఎలా గడిపాడంటే
Paul Alexander Dies At 78
Surya Kala
|

Updated on: Mar 14, 2024 | 11:41 AM

Share

పోలియోమైలిటిస్, పోలియో వైరస్ వల్ల వచ్చే వ్యాధిని సాధారణంగా పోలియో అంటారు. ఇది ప్రధానంగా పిల్లలను ప్రభావితం చేస్తుంది. దాని తీవ్రతను బట్టి, పక్షవాతం, మరణానికి దారితీస్తుంది. ఈ పోలియో  1940లో అమెరికాలో విధ్వంసం సృష్టిస్తుస్తోంది. US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం ఆ సంవత్సరం USలో 21,000 కంటే ఎక్కువ పోలియో కేసులు నమోదయ్యాయి. ఆ మహమ్మారి కాలంలో 1946లో ఒక బిడ్డ జన్మించింది. ఆ బిడ్డ పేరు పాల్ అలెగ్జాండర్. 1952లో అంటే పాల్ కు 6 సంవత్సరాల వయసు.. అతను కూడా పోలియో బారిన పడకుండా తప్పించుకోలేకపోయాడు. చిన్నవయసులోనే పోలియో సోకిన పాల్ బతకడానికి దాదాపు 7 దశాబ్దాల పాటు ఇనుప ఊపిరితిత్తుల సహాయం తీసుకోవలసి వచ్చింది. కొన్ని రోజుల క్రితం “పోలియో పాల్” గా ప్రసిద్ధి చెందిన పాల్ అలెగ్జాండర్ 78 సంవత్సరాల వయస్సులో ఈ లోకాన్ని విడిచిపెట్టారు.

ఐరన్ ఊపిరితిత్తుల సహాయం ఎందుకు తీసుకోవలసి వచ్చిందంటే

అమెరికాకు చెందిన పాల్ అలెగ్జాండర్ అనారోగ్యాన్ని గుర్తించిన అతని తల్లిదండ్రులు అతన్ని టెక్సాస్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో అతని ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని తేలింది. దీంతో 1952లో పాల్ మెడ కింది భాగం పనిచేయడం మానేసింది. అప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైంది. పాల్ పరిస్థితిని చూసిన డాక్టర్లు.. అతడి ప్రాణం దక్కడం కష్టమే అని చెప్పారు. అయితే మరో వైద్యుడు ఇనుప యంత్రంతో ఆధునిక ఊపిరితిత్తులను కనిపెట్టాడు. పాల్ మొత్తం శరీరం యంత్రం లోపల ఉండేది. అతని ముఖం మాత్రమే బయట కనిపించేది. మార్చి 2023లో పాల్  ప్రపంచంలోనే అత్యధిక కాలం జీవించి ఉన్న ఐరన్ ఊపిరితిత్తుల రోగిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో తన పేరు నమోదు చేసుకున్నాడు.

పరిస్థితులకు తలొగ్గలేదు, పుస్తకం రాసిన పాల్

పాల్ పరిస్థితులు అతని ఆశయాలను మార్పు తీసుకుని రాలేదు. అతను ఒక సమయంలో కొన్ని గంటల పాటు యంత్రాన్ని విడిచిపెట్టడానికి అనుమతించే శ్వాస పద్ధతులను నేర్చుకున్నాడు. అంతేకాదు తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు. లా డిగ్రీని పొందాడు. 30 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేశాడు. అంతేకాదు  పాల్ తన ఆత్మకథ కూడా రాశాడు. పుస్తకం పేరు త్రీ మినిట్స్ ఫర్ ఎ డాగ్.. మై లైఫ్ ఇన్ యాన్ ఐరన్ లంగ్. పాల్ తన నోటిలో ఉంచుకున్న ప్లాస్టిక్ స్టిక్‌కు జోడించిన పెన్ను ఉపయోగించి కీబోర్డ్‌పై తన రచన విధానాన్ని ప్రదర్శించారు.

ఇవి కూడా చదవండి

పోలియో టీకాకు మద్దతుదారు

ఈ సంవత్సరం జనవరిలో పాల్ టిక్‌టాక్ ఖాతా “పోలియో పాల్”ని సృష్టించాడు. అక్కడ అతను ఇనుప ఊపిరితిత్తులతో జీవించడం ఎలా ఉంటుందో వివరించాడు. పాల్ మరణించే సమయానికి అతనికి 300,000 మంది ఫాలోవర్స్ , 4.5 మిలియన్లకు పైగా లైక్‌లు ఉన్నారు. పాల్ కూడా పోలియో టీకాకు మద్దతుదారు. తన మొదటి TikTok వీడియోలో లక్షలాది మంది పిల్లలు సురక్షితంగా లేరని పోలియో బారిన పడే అవకాశం ఉందని చెప్పాడు. మరో అంటువ్యాధి వ్యాప్తి చెందకముందే పోలియో వ్యాప్తిని అరికట్టే విధంగా పని చేయాలని సూచించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..