Dogs Ban: దేశంలో ఇక నుంచి 23 జాతి విదేశీ కుక్కలను పెంచుకోవడం నిషేధం.. అమ్మకం, పెంపకం కూడా నేరమే..

మరికొందరి ఇంట్లో కుక్కలను తమ ఇంటికి కావాలా కోసం పెంచుకుంటారు. అయితే ఇలా రక్షణ కోసం పెంచుకునే కుక్కలు కొన్ని ప్రాణ హాని కలిగించేవిగా కూడా ఉంటున్నాయి. విదేశాల నుంచి కొన్ని రకాల కుక్కలను దిగుమతి చేసుకుని మరీ పెంచుకుంటున్నారు. అయితే తమ రక్షణ కోసం తెస్తున్న ఈ కుక్కలు ఇతరుల ప్రాణాలను హరించేవిగా మారుతున్నాయి. దీంతో ఈ కుక్కల పంపకం వివాదాస్పదమైంది. రక్షణ పేరుతో తీసుకొస్తున్న ప్రమాదకరమైన జాతికి చెందిన కుక్కల తో ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Dogs Ban: దేశంలో ఇక నుంచి 23 జాతి విదేశీ కుక్కలను పెంచుకోవడం నిషేధం.. అమ్మకం, పెంపకం కూడా నేరమే..
Dogs Ban In India
Follow us
Surya Kala

|

Updated on: Mar 14, 2024 | 11:11 AM

మానవ జీవితంలో కొన్ని జంతువులు ఒక భాగం అయ్యాయి. కుక్కలు, ఆవులు, పిల్లులు ఇలా రకరకాల జంతువులను ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు. అయితే కొందరి ఇంట్లో కుక్కలు భోగభాగ్యాలను అనుభవిస్తాయి. తమ ఇంటి సభ్యుల్లా భావించి పెంచుతారు. మరికొందరి ఇంట్లో కుక్కలను తమ ఇంటికి కావాలా కోసం పెంచుకుంటారు. అయితే ఇలా రక్షణ కోసం పెంచుకునే కుక్కలు కొన్ని ప్రాణ హాని కలిగించేవిగా కూడా ఉంటున్నాయి. విదేశాల నుంచి కొన్ని రకాల కుక్కలను దిగుమతి చేసుకుని మరీ పెంచుకుంటున్నారు. అయితే తమ రక్షణ కోసం తెస్తున్న ఈ కుక్కలు ఇతరుల ప్రాణాలను హరించేవిగా మారుతున్నాయి. దీంతో ఈ కుక్కల పంపకం వివాదాస్పదమైంది. రక్షణ పేరుతో తీసుకొస్తున్న ప్రమాదకరమైన జాతికి చెందిన కుక్కల తో ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ PETA విదేశాల నుంచి దిగుమతి అవుతున్న కుక్కల విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే అనేక సార్లు అభ్యర్ధించింది. కొన్ని జాతులకు సంబంధించిన కుక్కలను విదేశాల నుంచి చట్ట విరుద్ధంగా దిగుమతి చేస్తున్నారని..  వీటి దాడుల నుంచి మనుషులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

క్రూరమైన కుక్కల దాడుల కారణంగా అనేక సందర్భాల్లో మనుషులు మరణిస్తున్న నేపథ్యంలో రోట్‌వీలర్, పిట్‌బుల్, టెర్రియర్, వోల్ఫ్ డాగ్స్ , మాస్టిఫ్‌ల వంటి అనేక జాతుల కుక్కల దిగుమతి, పెంపకం, అమ్మకాలపై నిషేధం విధించాలని కేంద్రం కోరింది. పెంపుడు కుక్కలు లేదా ఇతర ప్రయోజనాల కోసం అవి “మానవ జీవితానికి ప్రమాదకరమైనవి” అని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

దేశంలో పలు ప్రాంతాల్లో ఈ కుక్కల దాడి వలన ప్రజలకు తీవ్రమైన గాయాలవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇటీవల పిట్‌బుల్ కుక్క దాడిలో గాయపడిన 17 నెలల చిన్నారి ఆస్పత్రి పాలైంది. అంతేకాదు తన పొరుగింటి వ్యక్తి మీద కోపంతో ఓ చిన్నారిపై దాడి చేసేలా యజమని రెచ్చగొట్టడంతో 10 ఏళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఇలా వివిధ సంఘటనలు రోజు రోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ కుక్కల వల్ల మనిషి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని…  పిట్‌బుల్ తరహా వివిధ క్రూరమైన శునకాలపై నిషేధం విధించాలని కోరింది.

నిషేధాల లిస్ట్

1. పిట్‌బుల్ టెర్రియర్ 2. తోసా ఇను 3. అమెరికన్ స్టాఫోర్డ్‌షైర్ టెర్రియర్ 4. ఫిలా బ్రసిలీరో 5. డోగో అర్జెంటినో 6. అమెరికన్ బుల్‌డాగ్ 7. బోయెస్‌బోయెల్ 8. కనగల్ 9. సెంట్రల్ ఆసియన్ షెపర్డ్ డాగ్ 10. కాకేసియన్ షెపర్డ్ డోగ్ సౌత్ రష్యన్ డాగ్ 11. టోర్ంజక్, 12. సర్ప్లానినాక్ 13. జపనీస్ టోసా మరియు అకిటా 14. మాస్టిఫ్స్ 15. రోట్‌వీలర్ 16. టెర్రియర్స్ 17. రోడేసియన్ రిడ్జ్‌బ్యాక్ 18. వోల్ఫ్ డాగ్స్ 19. కానరియో 20. అక్బాష్ 21. మాస్కో గార్డ్ 22. కేన్ కోర్సో 23. బండోగ్

పెటా చేసిన అభ్యర్ధనను .. అందులోకి వాస్తవాలను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాల విదేశీ జాతులపై నిషేధం విధించాలని ఆలోచిస్తోంది. అంతేకాదు ఇప్పటికే కొన్ని రకాల విదేశీ జాతుల కుక్కలను పెంచడం, అమ్మకంపై నిషేధం విధించాలని కేంద్ర పాలిత, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఓ లెటర్ రాసింది. అంతేకాదు మనిషి ప్రాణాలకు ప్రమాదంగా మారిన పిట్‌బుల్స్ , బుల్‌డాగ్, బోయెస్‌బోయెల్, కనగల్, సెంట్రల్ ఆసియన్ షెపర్ డాగ్,  వంటి జాతి కుక్కల అమ్మకం, పెంపకం కోసం లైసెన్సులను ఇక నుంచి జారీ చేయవద్దని కోరింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే