Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sadhguru: బ్రెయిన్‌ సర్జరీ తర్వాత ఇండొనేసియాలో పర్యటిస్తున్న సద్గురు.. ఘన స్వాగతం పలికిన అక్కడి మంత్రి

బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న ఒక నెల తర్వాత సద్గురు ఫౌండర్- ఇషా ఫౌండేషన్‌లోకి తిరిగి వచ్చారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ఏప్రిల్‌ 19న ఓటు వేసిన సద్గురు భారతదేశం, ఆగ్నేయాసియా మధ్య ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను అన్వేషించడానికి 10 రోజుల పర్యటన కోసం ఇండోనేషియాలోని బాలి చేరుకున్నారు. ఇండోనేషియా పర్యాటక శాఖ మంత్రి శాండియాగా యునో, బృందం..

Sadhguru: బ్రెయిన్‌ సర్జరీ తర్వాత ఇండొనేసియాలో పర్యటిస్తున్న సద్గురు.. ఘన స్వాగతం పలికిన అక్కడి మంత్రి
Sadhguru
Follow us
Subhash Goud

|

Updated on: Apr 20, 2024 | 6:37 PM

బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న ఒక నెల తర్వాత సద్గురు ఫౌండర్- ఇషా ఫౌండేషన్‌లోకి తిరిగి వచ్చారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ఏప్రిల్‌ 19న ఓటు వేసిన సద్గురు భారతదేశం, ఆగ్నేయాసియా మధ్య ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను అన్వేషించడానికి 10 రోజుల పర్యటన కోసం ఇండోనేషియాలోని బాలి చేరుకున్నారు. ఇండోనేషియా పర్యాటక శాఖ మంత్రి శాండియాగా యునో, బృందం స్వాగతించింది. బాలిలోని భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ శశాంక్ విక్రమ్‌తో పాటు సద్గురు కంబోడియాకు వెళ్లే ముందు దేశంలోని వివిధ ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తారు. అయితే నెల రోజలు కిందట బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న సద్గురు.. విశ్రాంతి తీసుకోకుండా.. యాక్షన్ లోకి దిగిపోయారు. ఇషా ఫౌండేషన్‌ని స్థాపించిన సద్గురు అందులో భాగంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఇండొనేసియాలోని బాలిలో పర్యటిస్తున్న సద్గురు.. 10 రోజుల పర్యటనలో భాగంగా ఇండియా – తూర్పు ఆగ్నేయ ఆసియా ఆధ్యాత్మిక, సంస్కృతిక సంబంధాలను అన్వేషించనున్నారు. ఇండొనేసియా పర్యాటక మంత్రితో రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలపై సద్గురుజీ చర్చించారు. ఈ సందర్భంగా ఒడిశాలో జరిగే బాలీ యాత్ర గురించి సద్గురు మాట్లాడారు. ఇది ప్రతి సంవత్సరం జరిగే యాత్ర. ఇందులో భాగంగా ఒడిశా ప్రజలకు చరిత్రలో బాలీతో ఉన్న సంబంధాలపై చర్చించుకుంటారు.

అయితే తన సందర్శన సమయంలో సద్గురు సంస్కృతులు, దేవాలయాల వెనుక ఉన్న శాస్త్రాలను పరిశోధిస్తారు. సద్గురు తన పర్యటన నేపథ్యంలో వందల కోట్ల మంది తన అనుచరులకు, ఇండొనేసియా, కంబోడియాలోని విలువ కట్టలేని అంశాలను వివరిస్తారు. 2023లో సోషల్ మీడియాలో సద్గురు వీడియోలకు 4.37 కోట్ల వ్యూస్ వచ్చాయి.

పేపర్లతో చిన్న చిన్న పడవలు చేసి, నీటిలో వదులుతారు. అలాగే ఎండిపోయిన అరటి బెరళ్లు, కార్కులను నీటిలో వదులుతారు. పూర్వం ఒడిశా ప్రజలు బాలికి.. సముద్రం గుండా.. వెళ్లేవారు. వారి గుర్తుగా ఇలా చేస్తారు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన సద్గురు.. ఇండొనేసియాను మెచ్చుకున్నారు. ఆ దేశం ఇప్పటికీ సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగిస్తోందనీ, అందుకే ప్రపంచ దేశాల ప్రజలను ఆకర్షిస్తోందని పేర్కొన్నారు. సద్గురు తన పర్యటనలో సాంస్కృతిక అంశాల వెనకున్న సైన్స్‌ని పరిశీలిస్తారు. అలాగే.. ఆలయాలను దర్శిస్తారు. రకరకాల ప్రాచీన శక్తి కేంద్రాలను సందర్శిస్తారు. వీటిలో బాలి లోని బెసాకీ, తీర్థ ఎంపల్ ఆలయాలు కూడా ఉన్నాయి.