భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్… అరుణాచల గిరిప్రదక్షిణకు టూరిజం స్పెషల్ ప్యాకేజీ.. రేపే అందుబాటులోకి
పౌర్ణమి రోజున అగ్ని క్షేత్రమైన అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయాలని అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవాలని భక్తులు కోరుకుంటారు. అన్ని దారులు అరుణాచలం వైపే అన్న చందంగా ఉంటుంది. తెలంగాణ టూరిజం శాఖ శివయ్య భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. భక్తుల సౌకర్యార్ధం టూర్ ప్యాకేజీని ప్రకటించింది. గిరి ప్రదక్షిణ కోసం వెళ్లాలనుకునే భక్తులకు ఈ టూర్ హైదరాబాద్ నుంచి భక్తులకు అందుబాటులో ఉండనుంది. ప్రతి పున్నమి రోజున ఈ టూర్ ఉండనుంది. ఈ టూర్ నాలుగు రోజుల పాటు అంటే.. 3 రాత్రులు, 4 పగళ్లు సాగనుంది.
హిందు ధర్మంలో పౌర్ణమి తిధికి విశిష్ట స్థానం ఉంది. ముఖ్యంగా పౌర్ణమి రోజున అగ్ని క్షేత్రమైన అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయాలని అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవాలని భక్తులు కోరుకుంటారు. అన్ని దారులు అరుణాచలం వైపే అన్న చందంగా ఉంటుంది. తెలంగాణ టూరిజం శాఖ శివయ్య భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. భక్తుల సౌకర్యార్ధం టూర్ ప్యాకేజీని ప్రకటించింది. గిరి ప్రదక్షిణ కోసం వెళ్లాలనుకునే భక్తులకు ఈ టూర్ హైదరాబాద్ నుంచి భక్తులకు అందుబాటులో ఉండనుంది. ప్రతి పున్నమి రోజున ఈ టూర్ ఉండనుంది. ఈ టూర్ నాలుగు రోజుల పాటు అంటే.. 3 రాత్రులు, 4 పగళ్లు సాగనుంది.
నెలలో ఏఏ తేదీల్లో అందుబాటులో ఉండనుందంటే
అంటే ఏప్రిల్ 21 వ తేదీ అంటే రేపు , మే 20వ తేదీ , జూన్ 19వ తేదీన గిరి ప్రదక్షిణ కోసం హైదరాబాద్ నుంచి టూర్ మొదలవుతుంది. ఈ టూర్ ప్యాకేజీలో కాణిపాకం, వేలూరు గోల్డెన్ టెంపుల్, అరుణాచల ఆలయాన్ని దర్శించుకోవచ్చు.
టూర్ ఎలా సాగుతుందంటే..
- ఈ టూర్ ప్యాకేజీలో మొదటి రోజు ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు సీఆర్ఓ బషీర్‌బాగ్ నుంచి ప్రారంభం అవుతుంది.
- మర్నాడు ఉదయం అంటే ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 6 గంటలకు కాణిపాక క్షేత్రానికి చేరుకుంటారు. ఇక్కడ స్నాదికార్యక్రమాలు పూర్తి చేసుకుని విఘ్నలకధిపతి వినాయకుడిని దర్శినం చేసుకుంటారు. అనంతరం టిఫిన్ తిన్న తర్వాత తిరువణ్ణామలైకు బయలు దేరాల్సి ఉంటుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు అరుణాచలం చేరుకుంటున్నారు.
- మధ్యాహ్నం 3 గంటలకు అరుణాచలేశ్వరుడిని దర్శనం చేసుకుని రాత్రి పున్నమి వెన్నెల్లో గిరి ప్రదక్షిణ చేయవచ్చు. రాత్రికి అరుణాచలంలో బస చేయాల్సి ఉంటుంది.
- మూడో రోజు ఉదయం అంటే ఏప్రిల్ 23వ తేదీ ఉదయం అరుణాచలంలో టిఫిన్ తిని అక్కడ నుంచి బయలు దేరి మధ్యాహ్నానికి వెలూరు చేరుకుంటారు. అక్కడ శ్రీ పురం స్వర్ణ ఆలయాన్ని శ్రీ మహాలక్ష్మిని దర్శించుకోవాలి. అనంతరం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కావాల్సి ఉంటుంది.
- నాలుగో రోజు ఉదయం హైదరాబాద్ కు తిరిగి చేరుకుంటారు. దీంతో అరుణాచలం టూర్ ముగుస్తుంది.
ప్యాకేజీలో ధరలు వివరాల్లోకి వెళ్తే..
- టూర్ లో భాగంగా పెద్దలకు రూ.7,500
- పిల్లలకు రూ.6,000లకు చెల్లించాల్సి ఉంటుంది.
- ఈ టూర్ ప్యాకేజీలో బస్ జర్నీ, హోటల్ లో బస సౌకర్యాలను కల్పిస్తుంది. అయితే దర్శనం టికెట్లు, భోజనానికి పర్యాటకులు సొంతగా ఖర్చు చేసుకోవాల్సి ఉంటుంది.
- ఇదే విధంగా మే 20వ తేదీ , జూన్ 19వ న కూడా టూర్ సాగనుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..