AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stomach Cancer: కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు.. నివారణ, నిర్ధారణ పద్ధతులు ఏమిటంటే

గ్యాస్ట్రిక్ క్యాన్సర్ మగవారిలో వస్తున్న ఐదవ అత్యంత సాధారణ క్యాన్సర్.. కాగా మన దేశంలో స్త్రీలలో వస్తున్న ఏడవ క్యాన్సర్. దీని లక్షణాలు మొదట్లోనే గుర్తిస్తే చాలా వరకూ ప్రమాదాన్ని నివారించవచ్చు. అయితే దీని లక్షణాలు ప్రారంభ దశలో సాధారణ సమస్యల వలె ఉంటాయి. దీంతో చాలామంది తేలికగా తీసుకుంటున్నారు. దీంతో శరీరానికి భారీ హాని కలుగుతుంది. కడుపు క్యాన్సర్ చాలా ప్రమాదకరమైనది. దీనివల్ల ప్రాణాలకు ప్రమాదం కూడా ఎక్కువగానే ఉంటుంది

Stomach Cancer: కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు.. నివారణ, నిర్ధారణ పద్ధతులు ఏమిటంటే
Stomach Cancer
Surya Kala
|

Updated on: Apr 20, 2024 | 6:58 PM

Share

వైద్యం ఎంతగా అభివృద్ధి చెందినా క్యాన్సర్ ఇప్పటికీ ప్రాణాంతక వ్యాధి. ఇందులో చాలా రకాలు ఉన్నాయి.  వాటిలో ఒకటి కడుపు క్యాన్సర్. దీనిని గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అని కూడా అంటారు. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ మగవారిలో వస్తున్న ఐదవ అత్యంత సాధారణ క్యాన్సర్.. కాగా మన దేశంలో స్త్రీలలో వస్తున్న ఏడవ క్యాన్సర్. దీని లక్షణాలు మొదట్లోనే గుర్తిస్తే చాలా వరకూ ప్రమాదాన్ని నివారించవచ్చు. అయితే దీని లక్షణాలు ప్రారంభ దశలో సాధారణ సమస్యల వలె ఉంటాయి. దీంతో చాలామంది తేలికగా తీసుకుంటున్నారు. దీంతో శరీరానికి భారీ హాని కలుగుతుంది. కడుపు క్యాన్సర్ చాలా ప్రమాదకరమైనది. దీనివల్ల ప్రాణాలకు ప్రమాదం కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే గతంలో పెద్దవారిలో ఎక్కువగా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ బాధితులు కనిపించేవారు. అయితే ఇప్పుడు ఈ క్యాన్సర్ బారిన చిన్న వయసులోనే పడుతున్నారు. ఎక్కువగా ఈ క్యాన్సర్ చాలా ఆలస్యంగా గుర్తించబడుతుంది. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లక్షణాల గురించి ప్రజలకు తెలియకపోవడమే దీనికి కారణం.

అటువంటి పరిస్థితిలో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లక్షణాల గురించి తెలుసుకోవడం ముఖ్యం. స్టమక్ క్యాన్సర్ మొదట్లో కడుపు చుట్టుపక్కల ప్రాంతంలో నొప్పి మొదలవుతుందని.. అయితే దీనిని గ్యాస్ సమస్యగా భావించి సొంతంగా మందులు వేసుకోవడం ప్రారంభిస్తారని వైద్యులు చెబుతున్నారు. దీని కారణంగా శరీరంలో చాలా కాలం పాటు కొనసాగే ఈ లక్షణం విస్మరించబడుతుంది. ప్రారంభ దశలో గుర్తించచలేరు. దీంతో ఈ వ్యాధి కాలక్రమంలో తీవ్రంగా మారుతుంది.

గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లక్షణాలు ఇవి

  1. బరువు తగ్గడం
  2. కడుపు నొప్పి
  3. ఆకలి లేకపోవడం
  4. ఆహారం మింగడంలో ఇబ్బంది
  5. వాంతులు
  6. ఏపని చేయకపోయినా అలసట
  7. గుండెల్లో మంట
  8. గ్యాస్ తో ఇబ్బంది
  9. కొంచెం తింటే చాలు కడుపు నిండిన అనుభూతి

గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది?

హెచ్. పైలోరీ బ్యాక్టీరియా వల్ల ఈ క్యాన్సర్ వస్తుంది. ఈ బ్యాక్టీరియా కడుపులోని కణాలను దెబ్బతీస్తుంది. ఈ చెడు కణాలు నెమ్మదిగా పెరగడం ప్రారంభిస్తాయి. కడుపులో కణితులు కూడా ఏర్పడతాయి. దీని తరువాత ఇది శరీరంలోని ఇతర ప్రదేశాలకు వ్యాపిస్తుంది. శరీరానికి హాని కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ కారణాల వల్ల కూడా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ రావచ్చు

ధూమపానం: ధూమపానం వల్ల గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కూడా వస్తుంది. ధూమపానం చేసేవారిలో దాని రసాయనాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి. అవి కడుపులోని కణాలను ప్రభావితం చేస్తాయి. ధూమపానం అలవాటు ఎక్కువగా ఉన్నవారు అల్సర్, క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంది.

ఆహారం, పానీయాలు: చెడు ఆహారపు అలవాట్లు కూడా కడుపు క్యాన్సర్‌కు ప్రధాన కారణం కావచ్చు. ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినే వ్యక్తులకు ఇతరులకన్నా కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

ఔషధాల దుష్ప్రభావాలు: మందుల దుష్ప్రభావాల వల్ల కడుపు క్యాన్సర్ రావచ్చు. ఔషధాలలో అనేక రకాల రసాయనాలు ఉంటాయి. వీటిలోని దుష్ప్రభావాలు కడుపు కణాలను దెబ్బతీస్తాయి.

కడుపు క్యాన్సర్ ను ఎలాంటి పరీక్షతో నిర్ధిస్తారు

ఎండోస్కోపీ

జీవాణుపరీక్ష

సోనోగ్రఫీ

CT స్కాన్

ఎలాంటి అలవాట్లు రక్షణ ఇస్తాయంటే

ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉండండి

ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు తినే ఆహారంలో చేర్చుకోండి

నిల్వ ఉండే ఆహారం తినవద్దు

ధూమపానం చేయవద్దు

కడుపుని రెగ్యులర్ గా చెక్ చేసుకోండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(గమనిక : ఈ కథనంలో అందించిన సలహా సాధారణ సమాచారం కోసం. ఏదైనా ఆరోగ్య సలహాపై చర్య తీసుకునే ముందు డాక్టర్లను సంప్రదించండి)