AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bad Cholesterol Control Tips : చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారా..! ఈ డ్రైఫ్రూట్స్‌ మీ శరీరంలోని కొవ్వును వెన్నలా కరిగిస్తాయి..!

ఇది గుండెపోటుకు కూడా దారితీస్తుంది. ప్రఖ్యాత పోషకాహార నిపుణులు చెబుతున్న మేరకు.. కొన్ని ప్రత్యేకమైన డ్రై ఫ్రూట్స్ తింటే, కొలెస్ట్రాల్ స్థాయి అదుపులోకి వస్తుందని అంటున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Bad Cholesterol Control Tips : చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారా..! ఈ డ్రైఫ్రూట్స్‌ మీ శరీరంలోని కొవ్వును వెన్నలా కరిగిస్తాయి..!
ఆయుర్వేదం ప్రకారం డ్రై ఫ్రూట్స్‌ను నానబెట్టి తినాలి. ఎండిన పండ్లను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం వీటిని తినాలి. డ్రై ఫ్రూట్స్ ను మృదువుగా తింటే సులభంగా జీర్ణం అవుతాయి. అలాగే డ్రై ఫ్రూట్స్ సరైన సమయంలో తినాలి. ఆయుర్వేదం ప్రకారం డ్రై ఫ్రూట్స్ ఉదయం ఖాళీ కడుపుతో లేదా అల్పాహారం సమయంలో తినాలి. రాత్రిపూట డ్రై ఫ్రూట్స్ తినడం అంత మంచిదికాదు.
Jyothi Gadda
|

Updated on: Apr 21, 2024 | 8:08 AM

Share

ప్రస్తుత రోజుల్లో చాలా మంది ప్రజలు తమ ఆహారం పట్ల అజాగ్రత్త వైఖరిని కలిగి ఉంటున్నారు. అంతే కాకుండా శారీరక శ్రమ కూడా చాలా తక్కువగా ఉంటోంది. సాధారణంగా ఆయిల్, స్వీట్ ఫుడ్స్ తినడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో ధమనులలో అడ్డంకులు ఏర్పడతాయి. రక్తం గుండెకు చేరుకోవడానికి ఎక్కువ శక్తిని ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిని అధిక రక్తపోటు అంటారు. ఇది గుండెపోటుకు కూడా దారితీస్తుంది. ప్రఖ్యాత పోషకాహార నిపుణులు చెబుతున్న మేరకు.. కొన్ని ప్రత్యేకమైన డ్రై ఫ్రూట్స్ తింటే, కొలెస్ట్రాల్ స్థాయి అదుపులోకి వస్తుందని అంటున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ నియంత్రిస్తుంది..

1. పిస్తా

ఇవి కూడా చదవండి

పిస్తా చాలా ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్. దీని రుచి చాలా మందికి నచ్చుతుంది. పిస్తాపప్పు తినడం వల్ల ఎక్కువ సేపు ఆకలి అనుభూతి ఉండదు. తద్వారా ఊబకాయం, చెడు కొలెస్ట్రాల్ నియంత్రిస్తుంది.

2. బాదం

బాదం ఆరోగ్యానికి కీలకంగా పరిగణించబడుతుంది. మీరు వాటిని నానబెట్టి కూడా తినొచ్చు. ఇందులో అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది శరీరం నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. రోజూ ఒక గుప్పెడు బాదంపప్పు తింటే రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ త్వరగా తగ్గిపోతుంది.

3. వాల్‌నట్..

మీరు ఫిట్‌గా ఉండాలనుకుంటే ఈ రోజు నుండి వాల్‌నట్‌లను తీసుకోవడం ప్రారంభించండి. ఎందుకంటే ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను చాలా వరకు తగ్గిస్తుంది. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, మోనోశాచురేటెడ్ కొవ్వులు ఇందులో ఉంటాయి. ఇది అనేక వ్యాధుల నుండి మనలను రక్షిస్తుంది.

4. వేరుశనగలు..

వేరుశెనగ, ఇతర డ్రై ఫ్రూట్స్‌తో పోలిస్తే అతి తక్కువలోనే లభిస్తుంది.. కాబట్టి ప్రతి ఒక్కరూ సులభంగా తినవచ్చు. రోజూ చిరుతిళ్లలో వేరుశెనగ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
హార్దిక్ కోసం 12 రోజుల సైకిల్ ప్రయాణం.. పాండ్యా రియాక్షన్ చూశారా?
హార్దిక్ కోసం 12 రోజుల సైకిల్ ప్రయాణం.. పాండ్యా రియాక్షన్ చూశారా?
స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్‌!
స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్‌!
ఏపీ ప్రజలకు బిగ్‌ అలర్ట్.. 3 రోజుల పాటు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
ఏపీ ప్రజలకు బిగ్‌ అలర్ట్.. 3 రోజుల పాటు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
మీ టైమ్ వచ్చేసింది భయ్యా..! ఈ రాశుల వారికి బాబా వంగా గుడ్‌న్యూస్
మీ టైమ్ వచ్చేసింది భయ్యా..! ఈ రాశుల వారికి బాబా వంగా గుడ్‌న్యూస్
హైదరాబాద్ - బెంగళూరు బుల్లెట్ ట్రైన్‌ ప్రాజెక్ట్‌ పనులు షురూ!
హైదరాబాద్ - బెంగళూరు బుల్లెట్ ట్రైన్‌ ప్రాజెక్ట్‌ పనులు షురూ!
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభం అప్పుడే.. ముహూర్తం ఖరారు..
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభం అప్పుడే.. ముహూర్తం ఖరారు..
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు
నువ్వేం భర్తవిరా.. అంత చిన్న దానికే భర్యను చంపుతావా?
నువ్వేం భర్తవిరా.. అంత చిన్న దానికే భర్యను చంపుతావా?
ఉడికించిన గుడ్డును ఇలా తింటే.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..
ఉడికించిన గుడ్డును ఇలా తింటే.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!