ఎక్కువ సమయం ఏసీలోనే ఉంటున్నారా..? అయితే జాగ్రత్త.. ఈ సమస్యలు వచ్చే ప్రమాదం..!
అలాగే, ఎయిర్ కండిషనర్స్ క్లీనింగ్ పై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ఎయిర్ కండిషనర్స్‌తో ఉండే ఫిల్టర్స్‌ను సరిగ్గా క్లీన్ చేయకపోయినా, సర్వీస్ చేయించకపోయినా వాటి వల్ల వెంటిలేషన్ తగ్గి శ్వాస సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏసీలను సరిగ్గా సర్వీస్ చేయించడం ముఖ్యం. అలాగే, ఏసీల్లో ఎక్కువగా పనిచేసే వాళ్లు టెంపరేచర్‌ను 26 డిగ్రీలు పెట్టుకోవడం మంచిది. మరీ తక్కువగా పెట్టుకోవటం వల్ల

Side Effects Of AC: వేసవి అల్లాడిస్తుంది. ఎండవేడిమిని తట్టుకోలేక ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం ఏడు గంటలకే సూర్యుడు భగభగలు చూపెడుతున్నాడు. దాంతో ఉదయం 10గంటలకే ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జనం భయపడిపోతున్నారు. వేడి గాలులు, ఉక్కపోతతో వ్యాన్లు, కూలర్లు, ఏసీలను పరుగులు పెట్టిస్తున్నారు. పెరిగిపోయిన ఎండల తీవ్రత కారణంగా ఇప్పుడు గ్రామాల్లోనూ చాలా మంది ప్రజలు తమ ఇళ్లల్లో ఏసీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే, ఎక్కువగా ఏసీ గదుల్లోనే ఉండటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎంత ఆరోగ్యంగా ఉన్న వారికైనా సరే.. ఎక్కువ చల్లదనంతో ఏసీలో కనుక ఉన్నట్టయితే.. వారి ఆరోగ్యంపై ఏసీ వినియోగం దుష్ర్పభావమే చాలా ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సమయం ఏసీలోనే ఉండే వారిలో ఎదురయ్యే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం
ఏసీ గదుల్లోనే ఎక్కువగా ఉండేవారిలో శ్వాస సంబంధిత వ్యాధులు తలెత్తుతాయని చెబుతున్నారు. రాత్రంతా AC ఆన్‌లోనే ఉంచి నిద్రపోవటం వల్ల శ్వాస సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఆస్తమా లేదా అలెర్జీలు వంటి శ్వాస సమస్యలు ఉన్న వారికి, దీని ఫలితంగా దగ్గు, శ్వాస ఆడకపోవడం, ఛాతీలో కఫం, శ్వాసలోపం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఏసీల్లోనే గంటల తరబడి ఉంటున్నవారికి నిమోనియా, లెజియోనేరిస్ వంటి శ్వాస సమస్యలు లేదా తలనొప్పి వంటివి రావొచ్చు. అలాగే ఏసీల్లో ఉంటూ నీటిని తాగడం తగ్గించడం వల్ల జీర్ణ సమస్యలు, కిడ్నీ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
ఎక్కువ సమయం ACలోనే ఉండేవారి శరీరం మాయిశ్చర్‌ను కోల్పోతుంది. గాలిలో ఉన్న మాయిశ్చర్ ని ఎయిర్ కండిషనర్స్ పూర్తిగా పీల్చేస్తాయి. అలాగే అక్కడున్న వారి శరీరంలో కూడా తేమ లేకుండా అవుతుంది. ఫలితంగా వారిలో డీహైడ్రేషన్ సమస్య ఏర్పడుతుంది. కొన్నిసార్లు ఈ డైహైడ్రేషన్ వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడటం, కిడ్నీలు దెబ్బ తినడం ఇంకా గుండెపోటు రావడం వంటి సమస్యలు తలెత్తుతాయని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సమయం AC ఆన్‌లో ఉంచుకుని నిద్రపోయేవారిలో తేమ స్థాయిలు తగ్గడం వల్ల చర్మం, కళ్ళు పొడిబారిపోతాయి. ఇది పొడి, దురద, శరీరంపై పొట్టుల రాలిపోయేందుకు దారితీస్తుంది.
రాత్రంతా ఏసీ గదిలోనే పడుకోవడం వల్ల కండరాలు దృఢంగా మారడం, కీళ్ల నొప్పులు వస్తాయి. ముఖ్యంగా శరీరం ఎక్కువ సమయం పాటు చల్లని ఉష్ణోగ్రతలకు గురైనట్లయితే ఆర్థరైటిస్, ఇతర కండరాల సంబంధించిన సమస్యలను పెంచుతుంది. అలాగే, ఎయిర్ కండిషనర్స్ క్లీనింగ్ పై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ఎయిర్ కండిషనర్స్‌తో ఉండే ఫిల్టర్స్‌ను సరిగ్గా క్లీన్ చేయకపోయినా, సర్వీస్ చేయించకపోయినా వాటి వల్ల వెంటిలేషన్ తగ్గి శ్వాస సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏసీలను సరిగ్గా సర్వీస్ చేయించడం ముఖ్యం. అలాగే, ఏసీల్లో ఎక్కువగా పనిచేసే వాళ్లు టెంపరేచర్‌ను 26 డిగ్రీలు పెట్టుకోవడం మంచిది. మరీ తక్కువగా పెట్టుకోవటం వల్ల దాహం వేయదు. దాంతో ఎక్కువ సమయం నీళ్లు తాగకుండానే గడిపేస్తుంటారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..