Lifestyle: రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తున్నారా.? ఈ ప్రాణాంతక వ్యాధి తప్పదు
కానీ ఇప్పుడు రాత్రి 11 గంటలకు కూడా భోజనం చేస్తున్నారు. మిడ్‌నైట్ బిర్యానీ పేరుతో ఏకంగా అర్థరాత్రి కూడా తినే వారు ఉన్నారు. అయితే రాత్రి ఆలస్యంగా భోజనం చేసే వారిలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వేధిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి 9 గంటలు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో భోజనం చేయకూడదని సూచిస్తున్నారు. సాధారణంగా రాత్రి ఆలస్యంగా...

ఒకప్పుడు ఉదయం త్వరగా నిద్రలేచే వారు, రాత్రుళ్లు త్వరగా పడుకునే వారు. కానీ ప్రస్తుతం కాలం మారిపోయింది. మారిన కాలంతో పాటు ఉద్యోగ వేళలు, ఆహారపు అలవాట్లు సైతం పూర్తిగా మారిపోయాయి. ఫిఫ్టుల్లో పనిచేయడం, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల వినియోగం పెరగడం కారణం ఏదైనా ఆలస్యంగా నిద్రపోవడం సాధారణంగా మారిపోయింది. దీంతోపాటు ఆలస్యంగా భోజనం చేయడం కూడా కామన్‌గా మారింది. ఒకప్పుడు రాత్రి 8 గంటలలోపు భోజనం చేసి 9 గంటలకు పడుకునేవారు.
కానీ ఇప్పుడు రాత్రి 11 గంటలకు కూడా భోజనం చేస్తున్నారు. మిడ్‌నైట్ బిర్యానీ పేరుతో ఏకంగా అర్థరాత్రి కూడా తినే వారు ఉన్నారు. అయితే రాత్రి ఆలస్యంగా భోజనం చేసే వారిలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వేధిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి 9 గంటలు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో భోజనం చేయకూడదని సూచిస్తున్నారు. సాధారణంగా రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం వల్ల ఊబకాయం, జీర్ణవ్యవస్థలో ఇబ్బందులు వస్తాయని మనకు తెలిసిందే. అయితే ఆలస్యం తినడం వల్ల స్ట్రోక్ ముప్పు కూడా పెరుగుతుందని తాజా అధ్యయనాల్లో తేలింది.
రాత్రి 9 గంటల తర్వాత భోజనం చేయడం వల్ల హెమరేజిక్ స్ట్రోక్ ముప్పు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వేళ కానీ వేళలో భోజనం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరగడంతో పాటు, రక్తపోటు సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఇది మెదడులో రక్తస్రావానికి కారణమయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రుళ్లు భోజనం ఆలస్యంగా భోజనం చేసే వారిలో రక్తపోటు పెరిగి భవిష్యత్తులో పక్షవాతం వచ్చే అవకాశం ఉందని కూడా నిపుణులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే భోజనం చేసిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లో పడుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. తిన్న తర్వాత కొంచెం సేపు నడవాలని సూచిస్తున్నారు. ఇది రక్తపోటు, షుగర్ వంటి సమస్యలు రాకుండా చూడడంలో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. రాత్రి భోజనం చేసిన తర్వాత పడుకోవడానికి కనీసం రెండు గంటల సమయం ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..