Hanuman Shobha Yatra: భాగ్యనగరంలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర.. ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

మరికాసేపట్లో హనుమాన్ జయంతి సందర్భంగా ఏటా నిర్వహించినట్లే.. ఈసారి కూడా శోభాయాత్రను ఘనంగా నిర్వహించబోతున్నారు.ఈ విజయ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా, పూర్తి ప్రశాంత వాతావరణంలో ఇది జరిగేలా హైదరాబాద్ పోలీసులు.. పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే.. కొన్ని రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ సీపీ శ్రీనివాస రెడ్డి తెలిపారు.

Hanuman Shobha Yatra: భాగ్యనగరంలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర..  ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
Hanuman Shobha Yatra
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Apr 23, 2024 | 10:13 AM

హైదరాబాద్ మహానగరంలో జరగనున్న హనుమాన్ శోభయాత్రకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, విద్యుత్, ఫైర్, ఆర్ అండ్ బీ, రవాణా, హెల్త్ అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసులతో కోఆర్డినేషన్ చేసుకున్నారు పోలీసులు. హనుమాన్ శోభయాత్ర జరిగే రూట్లను హైదరాబాద్ పోలీస్ కమీషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్‌తో పాటు వివిధ శాఖల అధికారులు ఇప్పటికే పర్యవేక్షించారు. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి తాడ్ బండ్ హనుమాన్ టెంపుల్ వరకు జరుగనుంది. శోభయాత్ర జరిగే సమయంలో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని తెలిపారు పోలీసులు..

హనుమాన్ శోభయాత్ర కు జీహెచ్ఎంసీ, సిటి పోలీసులు సయన్వయంతో అన్ని ఏర్పాట్లు చేసారు.శోభయాత్ర లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీ భధ్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. మంగళవారం ఉదయం 11 గంటలకు హనుమాన్ శోభయాత్ర గౌలిగూడలోని రామ్ మందిరం నుంచి ప్రారంభం అయ్యి సికింద్రాబాద్ తాడ్ బండ్ హనుమాన్ టెంపుల్ వరకు జరుగనుంది. శోభయాత్ర జరుగు రూట్లను హైదరాబాద్ సిపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తో పాటు వివిధ శాఖల అధికారులు పర్యవేక్షించారు. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి మొదలయ్యే శోభాయాత్ర కాచిగూడ, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్ ఎక్స్ రోడ్, బన్సీలాల్ పేట్ మీదగా సికింద్రాబాద్ తాడ్ బండ్ హనుమాన్ టెంపుల్ వరకు జరుగుతుంది.

హనుమాన్ శోభయాత్ర 12 కిలోమీటర్లు మేర జరుగుతుందని, 10వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. 450 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి, బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించనున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే ప్రతి వెహికిల్ మౌంటెడ్ జూమ్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నారు. శోభయాత్రలో డీజేలు, ఫైర్ క్రాకర్స్ నిషేధమన్నారు సీపీ. రెచ్చగొట్టే ప్రసంగాలు,పాటలు, బ్యానర్స్ ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఎలాంటి రాజకీయ ప్రసంగాలు, చిహ్నాలకు అనుమతి లేదన్నారు.

హనుమాన్ శోభయాత్రకు వచ్చే భక్తులకు ఏటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నమన్నారు వివిధ శాఖల అధికారులు.. శోభయాత్ర జరుగు రూట్లలో లైటింగ్, ఎలక్ట్రికల్ కు సంబందించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది టీంలు ఎప్పటికప్పుడు రోడ్లను పరిశుభ్రంగా ఉంచుతయన్నారు. వాటర్ వర్క్స్ నుంచి భక్తులకు తాగునీరు అందిస్తున్నమన్నారు. ఆర్ అండ్ బీ డిపార్ట్మెంట్ నుంచి బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో భక్తులు ఎవరైనా అస్వస్థతకు గురైతే, చికిత్స అందించేందుకు హెల్త్ డిపార్ట్మెంట్స్ నుంచి క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నారు.

నగరంలో పలు చోట్లు ట్రాఫిక్ ఆంక్షలు

హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలో పలు చోట్లు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. మొత్తం 44 చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయని తెలిపారు పోలీసులు. గౌలిగూడ రామ్‌ మందిర్‌ దగ్గర ప్రారంభం కానున్న శోభయాత్ర పుత్లీబౌలి క్రాస్‌ రోడ్స్‌, ఆంధ్రాబ్యాంక్‌ క్రాస్‌ రోడ్స్‌, కోఠి డీఎంహెచ్‌ఎస్‌, సుల్తాన్‌ బజార్‌ క్రాస్‌ రోడ్‌, రామ్‌ కోఠి క్రాస్‌ రోడ్స్‌, కాచిగూడ క్రాస్‌ రోడ్స్‌, నారాయణగూడ YMCA, చిక్కడపల్లి క్రాస్‌ రోడ్స్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌, అశోక్‌ నగర్‌, గాంధీ నగర్‌, ప్రాగా టూల్స్‌, కవాడిగూడ, సీజీవో టవర్స్‌, బన్సీలాల్‌ పేట్‌ రోడ్‌, బైబిల్‌ హౌస్‌, సిటీలైట్‌ హోటల్‌, బాటా షోరూం, ఉజ్జయిని మహంకాళి టెంపుల్, ఓల్డ్‌ రాంగోపాల్‌ పేట్‌ పీఎస్, ప్యారడైజ్‌ క్రాస్‌ రోడ్‌, లీ రాయల్‌ ప్యాలెస్‌, బ్రూక్‌ బాండ్‌, ఇంపీరియల్‌ గార్డెన్‌, మస్తాన్‌ కేఫ్‌ మీదుగా తాడ్ బండ్ హనుమాన్ టెంపుల్ లో ముగియనుంది.

మరో శోభయాత్ర కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ నుంచి ప్రారంభమై.. కోఠి ఆంధ్రా బ్యాంక్ వద్ద ప్రధాన శోభయాత్రలో కలవనుంది. ఆయా రూట్లలో మార్నింగ్ పది గంటల నుంచి రాత్రి పది 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉండనున్నాయి. ఈ రూట్లలో ప్రయాణించే వారు ఇబ్బందులు ఎదుర్కొకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని హైదరాబాద్ పోలీసులు సూచించారు.

హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌ తో పాటు సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలోని వైన్ షాప్స్, బార్లు, పబ్‌ లను ఒకరోజు పాటు బంద్ చేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నగరంతో పాటు పలు చోట్ల హన్‌మాన్ జయంతి ర్యాలీలు జరగనున్నాయి కాబట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైన్ షాపులు క్లోజ్ చేయాలని పోలీసులు ఆదేశించారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు దుకాణాలు మూసేయాలని పోలీసులు ఆదేశాల్లో పేర్కొన్నారు. ఎవరైనా రూల్స్ అతిక్రమించి మద్యం దుకాణాలు ఓపెన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్లు హెచ్చరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
కమల్ హాసన్ పై డైరెక్టర్ ఫిర్యాదు..
కమల్ హాసన్ పై డైరెక్టర్ ఫిర్యాదు..
హై యూరిక్‌ ఆసిడ్‌తో బాధపడుతున్నారా? నిమ్మకాయ, వామును అద్భుత ఔషధం!
హై యూరిక్‌ ఆసిడ్‌తో బాధపడుతున్నారా? నిమ్మకాయ, వామును అద్భుత ఔషధం!
ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే ఏంటి? ప్రయోజనం ఏమిటి?
ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే ఏంటి? ప్రయోజనం ఏమిటి?
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..
రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..
ఈ రాశివారు అనూహ్యంగా ఒకట్రెండు శుభవార్తలు వింటారు..
ఈ రాశివారు అనూహ్యంగా ఒకట్రెండు శుభవార్తలు వింటారు..
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు