AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పెళ్లి కూతురు ఇంట్లో టీ పోయలేదని ఘర్షణ.. ఇద్దరి తలలు పగిలి, నలుగురికి గాయాలు

సంతోషంగా పెళ్లి జరుగుతున్న ఓ ఇంట్లో ఒక టీ కోసం పెద్ద ఘర్షణనే జరిగింది. ఇద్దరి తలలు పగిలి నలుగురి గాయాలయ్యాయి. పెళ్లికూతురు ఇంట్లో భోజనాలు సరిగా పెట్టలేదని, మాంసం వడ్డించలేదని, మర్యాద సరిగా చేయలేదని గొడవలు జరుగుతుంటాయి. కానీ టీ పోయలేదని ఇరువర్గాలు గొడవ పడ్డ ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. ఏకంగా పెళ్ళి ఆగిపోయేంత వరకు వెళ్ళింది..

Telangana: పెళ్లి కూతురు ఇంట్లో టీ పోయలేదని ఘర్షణ.. ఇద్దరి తలలు పగిలి, నలుగురికి గాయాలు
Tea Cup
N Narayana Rao
| Edited By: Balaraju Goud|

Updated on: Apr 23, 2024 | 11:21 AM

Share

సంతోషంగా పెళ్లి జరుగుతున్న ఓ ఇంట్లో ఒక టీ కోసం పెద్ద ఘర్షణనే జరిగింది. ఇద్దరి తలలు పగిలి నలుగురి గాయాలయ్యాయి. పెళ్లికూతురు ఇంట్లో భోజనాలు సరిగా పెట్టలేదని, మాంసం వడ్డించలేదని, మర్యాద సరిగా చేయలేదని గొడవలు జరుగుతుంటాయి. కానీ టీ పోయలేదని ఇరువర్గాలు గొడవ పడ్డ ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. ఏకంగా పెళ్ళి ఆగిపోయేంత వరకు వెళ్ళింది..

ఖమ్మం నగరంలోని ప్రకాష్ నగర్‌కు చెందిన యువతికి చెరువుబజార్‌కు చెందిన యువకుడితో పెళ్లి కుదిరింది. దీంతో పెళ్లి కూతురి ఇంటి వద్ద పూజలకు పెళ్లి కొడుకు తరఫు బంధువులు వెళ్లారు. అయితే అక్కడ వారికి టీ పోయలేదని చిన్న బుచ్చుకుని మనసులో పెట్టుకున్నారు అబ్బాయి తరుఫు బంధువులు. అనంతరం అందరూ భోజనాలు చేశాక, ఊరేగింపులో డాన్స్‌లు చేస్తున్నారు. ఆ సమయంలోనే సాయంత్రం తమకు టీ పోయలేదని మర్యాద చేయడం రాదంటూ వరుడి తరఫు వారు అమ్మాయి తరుఫు బంధువులతో ఘర్షణకు దిగారు. ఏకంగా గల్లాలే పట్టుకున్నారు.

దానికి వధువు తరుపు బంధువులు ‘టీ ఎందుకు.. మీకు ఏకంగా మందు పోశాం.. భోజనాలు కూడా పెట్టాం అంటూ గొడవకు దిగడంతో పరస్పరం దాడి చేసుకున్నారు. బీరు సీసాలతో కొట్టుకోవడముతో ఇద్దరి తలలు పగిలి నలుగురి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఖమ్మం త్రీటౌన్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. అయితే ఫలితం లేకపోగా, పోలీసుల ముందు కూడా కర్రలతో కొట్టుకుపోవడంతో పోలీసులు చేసేదేంలేక వెళ్లిపోయారు. చివరికి ఇరువైపుల పెద్దలు సర్దిచెప్పటంతో ప్రశాంతంగా పెళ్లి వేడుక ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…