Hyderabad: నాన్‌వెజ్ ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. ఇవాళ మటన్, చికెన్ షాపులు బంద్! కారణం ఇదే
నగరంలోని మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఈ రోజు (ఏప్రిల్ 21) హైదరాబాద్ నగర పరిసరప్రాంతాల్లో చికెన్, మటన్ షాపులు బంద్‌లో ఉంటాయి. చికెన్, మటన్ దుకాణాలను మూసి ఉంచాల్సిందిగా ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేసింది. అసలెందుకు ఈ రోజు నాన్ వెజ్ షాపులు మూతపడుతున్నాయంటే.. ఈరోజు జైనులకు ఎంతో ప్రత్యేకమైన దినం. జైనులు పవిత్రంగా భావించే..
హైదరాబాద్, ఏప్రిల్ 22: నగరంలోని మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఈ రోజు (ఏప్రిల్ 21) హైదరాబాద్ నగర పరిసరప్రాంతాల్లో చికెన్, మటన్ షాపులు బంద్‌లో ఉంటాయి. చికెన్, మటన్ దుకాణాలను మూసి ఉంచాల్సిందిగా ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేసింది. అసలెందుకు ఈ రోజు నాన్ వెజ్ షాపులు మూతపడుతున్నాయంటే.. ఈరోజు జైనులకు ఎంతో ప్రత్యేకమైన దినం. జైనులు పవిత్రంగా భావించే మహవీర్ జయంతి నేడు. ఈ సందర్భంగా హైదరాబార్ సహా పరిసర ప్రాంతాల్లోని మాంసం విక్రయదారులు బంద్ పాటించాలని జీహెచ్‌ఎమ్‌సీ నిర్ణయం తీసుకుంది.
మరోవైపు జైన మతానికి చెందిన వారు ఎక్కువ సంఖ్యంలో హైదరాబాద్‌లో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈ పర్వదినాన్ని పురస్కించుకుని చికెన్ , మటన్ షాపులు బందులో ఉంటాయి. కాగా మహావీర్ జయంతి ప్రతీయేట ఏప్రిల్ 21వ తేదీన జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. జీహెచ్‌ఎంసీ ఆదేశాలను అతిక్రమించి విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ హెచ్చరికలు జారీ చేశారు. అయితే సోమవారం నుంచి యథావిథిగా చికెన్, మటన్ విక్రయాలు కొనసాగనున్నాయి. ఆదివారం మాంసం విక్రయాల బంద్ రెండ్రోజుల ముందే జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. దీంతో కొందరు మాంసం ప్రియులు ముందే మాంసం కొనుగోలు చేసి ఫ్రిజ్‌లలో దాచి ఉంచుకున్నారు.
జైన మతానికి చెందిన వారు మహావీర్ జయంతిని పవిత్రంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో మాంసం దుకాణాలను బంద్ చేయాల్సిందిగా జీహెచ్‌ఎంసీ ఆదేశించింది. అంతేకాకుండా నగరంలో ఎక్కడా మాంసం విక్రయాలు జరపకుండా ఉదయం తనిఖీలు చేయాలని ఎంహెచ్‌వోకు ఆదే శాలు జారీ చేసింది. దీంతో అసలే ఆదివారం అందులోనూ సమ్మర్ కావడంతో మాంసం ప్రియులు ఉసూరు మంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.