AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: హైదరాబాదీ వింత ఆలోచన.. నామినేషన్ దాఖలకు ఎలా వెళ్లాడో చూడండి

తమ బలాన్ని, బలగాన్ని నిరూపించుకునేందుకు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తూ నామినేషన్‌ దాఖలు కార్యక్రమానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ర్యాలీకోసం ఒక్కొక్కరూ ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అయితే తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి నామినేషన్‌ కేంద్రానికి వెళ్లిన తీరు అందరి దృష్టి ఆకర్షిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది...

Viral Video: హైదరాబాదీ వింత ఆలోచన.. నామినేషన్ దాఖలకు ఎలా వెళ్లాడో చూడండి
Viral Video
Narender Vaitla
|

Updated on: Apr 26, 2024 | 2:23 PM

Share

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల హంగామా నడుస్తోంది. ఇప్పటికే తొలి దశ ఎన్నికలు విజయవంతంగా కాగా శుక్రవారం రెండో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక నామినేషన్‌ దాఖలుతో పలు రాష్ట్రాల్లో సందడి నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల వేడి రాజుకొంది. దీంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నామినేషన్ దాఖలు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.

తమ బలాన్ని, బలగాన్ని నిరూపించుకునేందుకు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తూ నామినేషన్‌ దాఖలు కార్యక్రమానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ర్యాలీకోసం ఒక్కొక్కరూ ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అయితే తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి నామినేషన్‌ కేంద్రానికి వెళ్లిన తీరు అందరి దృష్టి ఆకర్షిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇంతకీ అతను చేసిన ఆ పనెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

హైదరాబాద్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికలో పోటీ చేస్తున్న ఓ స్వతంత్ర అభ్యర్థి తాజాగా నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే ఈ క్రమంలోనే నామినేషన్‌ దాఖలుకు ఒంటెపై సవారి చేస్తూ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో దీనిని చూసిన కొందరు తమ స్మార్ట్ ఫోన్‌లో వీడియో రికార్డ్‌ చేశారు. ఈ వీడియోను కాస్త సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయగా నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను చార్మినార్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. తనకు ఎన్ని ఓట్లు వస్తుందన్న దానిపై ప్రశ్నించగా.. అది దేవుని చేతిలో ఉంది అంటూ చెప్పుకొచ్చారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
అపరాజిత పూలు, అవిసె గింజలతో గ్లోయింగ్ స్కిన్.. బ్యూటీ చిట్కాలు
అపరాజిత పూలు, అవిసె గింజలతో గ్లోయింగ్ స్కిన్.. బ్యూటీ చిట్కాలు
వాడిని బతకనీయద్దు.. లక్ష్మి చెప్పింది ఇదే!
వాడిని బతకనీయద్దు.. లక్ష్మి చెప్పింది ఇదే!
టీమిండియా ఆటగాళ్లకు గంభీర్ వార్నింగ్
టీమిండియా ఆటగాళ్లకు గంభీర్ వార్నింగ్
నకిలీ ఓట్లు తొలగిస్తుంటే రాహుల్‌కు ఎందుకంత కడుపునొప్పి..?
నకిలీ ఓట్లు తొలగిస్తుంటే రాహుల్‌కు ఎందుకంత కడుపునొప్పి..?
ఖరీదైన ఎరువులు వద్దు..ఉల్లిపాయ పొట్టుతోనే మొక్కలకు అద్భుతమైన పోషణ
ఖరీదైన ఎరువులు వద్దు..ఉల్లిపాయ పొట్టుతోనే మొక్కలకు అద్భుతమైన పోషణ
డెబిట్ కార్డ్ లేకుండా UPI PINను సెట్ చేయడం ఎలా? వెరీ సింపుల్‌..!
డెబిట్ కార్డ్ లేకుండా UPI PINను సెట్ చేయడం ఎలా? వెరీ సింపుల్‌..!
ఐపీఎల్ వేలంలో పాకిస్తాన్ ప్లేయర్.. వీడి ప్లాన్ మామూలుగా లేదు
ఐపీఎల్ వేలంలో పాకిస్తాన్ ప్లేయర్.. వీడి ప్లాన్ మామూలుగా లేదు
మేఘాలయ, అసోం అందాలు చూడాలనుకుంటున్నారా? విశాఖపట్నం నుంచి 8 రోజులు
మేఘాలయ, అసోం అందాలు చూడాలనుకుంటున్నారా? విశాఖపట్నం నుంచి 8 రోజులు
తండ్రయిన 'టూరిస్ట్ ఫ్యామిలీ' సినిమా డైరెక్టర్.. ఎమోషనల్ పోస్ట్
తండ్రయిన 'టూరిస్ట్ ఫ్యామిలీ' సినిమా డైరెక్టర్.. ఎమోషనల్ పోస్ట్
కిలో వెండి ధర 10 గ్రాముల బంగారంతో సమానమవుతుందా? 57 శాతం డౌన్..!
కిలో వెండి ధర 10 గ్రాముల బంగారంతో సమానమవుతుందా? 57 శాతం డౌన్..!