Snakes: ఈ దేశాల్లో ఒక్క పాము కూడా కనిపించదట.. కారణం ఏంటో తెలుసా?
భూమిపై అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో పాములు ముఖ్యమైనది. అందుకే అవి కనిపిస్తే చాలు మనుషులతోపాటు జంతువులు కూడా అల్లంత దూరానికి పారిపోతాయి. మరికొందరికైతే వాటిని చూడగానే మూర్చవచ్చినంత పనౌతుంది. అన్ని పాములు విషపూరితమైనవి కానప్పటికీ కొన్ని పాములు మాత్రం అత్యంత ప్రాణాంతకమైనవి. పాములు ఎక్కువగా వర్షం పడే ప్రాంతాల్లో, తడి ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి. పాములతో చలగటం అంత మంచిది..
భూమిపై అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో పాములు ముఖ్యమైనది. అందుకే అవి కనిపిస్తే చాలు మనుషులతోపాటు జంతువులు కూడా అల్లంత దూరానికి పారిపోతాయి. మరికొందరికైతే వాటిని చూడగానే మూర్చవచ్చినంత పనౌతుంది. అన్ని పాములు విషపూరితమైనవి కానప్పటికీ కొన్ని పాములు మాత్రం అత్యంత ప్రాణాంతకమైనవి. పాములు ఎక్కువగా వర్షం పడే ప్రాంతాల్లో, తడి ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి. పాములతో చలగటం అంత మంచిది కాదు. పొరపాటున అవి కాటేస్తే వెంటనే ట్రీట్‌మెంట్ తీసుకోవాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం. మన దేశంలో పంట పొలాల్లో పాము కాటుకు గురై ఎంతో మంది రైతులు చనిపోతున్నారు. ప్రపంచంలోని ప్రతి దేశంలో, ప్రతి చోట పాములు కనిపిస్తుంటాయి. పాములు లేది దేశాలు దాదాపు లేనట్లే. ఐతే ఈ దేశంలో మాత్రం పాములు చూద్దామన్నా కనిపించవు. అదే న్యూజిలాండ్.. ఈ దేశానికి పాములు లేని దేశంగా పేరు కూడా ఉంది. దీని భౌగోళిక కారణాల వల్ల ఈ దేశంలో ఒక్కపాము కూడా కనిపించదు.
సాధారణంగా పాములు అత్యంత చల్లని ప్రదేశాల్లో మనలేవు. కానీ న్యూజిలాండ్ జియోగ్రాఫికల్ లొకేషనే గమనిస్తే.. ఇది దాదాపు దక్షిణ ధృవానికి దగ్గర్లో ఉంటుంది. భూమి రెండు ధృవాల్లో మంచు గడ్డ కట్టి అత్యంత చల్లగా ఉంటాయి. కానీ విచిత్రమేమంటే ఈ దేశంలో భూభాగంపై ఒక్క పాము కూడా కనిపించదు. కానీ న్యూజిలాండ్ చుట్టూ సముద్రం ఉంటుంది. ఆ సముద్రంలో అక్కడక్కడా చిన్న చిన్న దీవులు ఉన్నాయి. వాటిల్లో మాత్రం లెక్కకు మించి పాములు ఉంటాయి. ఇక ఆ దీవుల నుంచి పాములు ఈదుతూ న్యూజిలాండ్ రావాలంటే చాలా దూరం ఉండటం వల్ల అవి చేరుకోలేవు.
అయితే ఎవరైనా రహస్యంగా పాములు తీసుకొచ్చి న్యూజిలాండ్‌లో వదిలేస్తే? అనే సందేహం మీకూ వచ్చిందా.. ఈ దేశ చట్టం ప్రకారం పాములను పెంపుడు జంతువులుగా పెంచుకోవడం, విదేశాల నుంచి తీసుకురావడం నిషేధం. అక్కడి స్థానికంగా ఉండే ఇతర ప్రాణులు, పక్షులకు రక్షణ కల్పించేందుకు వీలుగా ఈ చట్టం తీసుకువచ్చారు. అందుకే న్యూజిలాండ్‌లోని జూపార్క్‌లలో కూడా ఒక్కపాము కనిపించదు. పసిఫిక్ మహా సముద్రంలో నైరుతీ భాగంలో న్యూజిలాండ్ ఉంది. ఇది భారీ ఖండంగా పిలిచే గోండ్వానాలాండ్ నుంచి 8.5 కోట్ల యేళ్ల కిందట విడిపోయింది. ఇక న్యూజిలాండ్ లాగానే ఐర్లాండ్‌లో కూడా పాములు కనిపించవు. దేశంలో విచిత్ర నమ్మకం ఉంది. సెయింట్ పాట్రిక్ అనే వ్యక్తి ఆ దేశంలోని పాములన్నింటినీ చంపేశాడని స్థానికులు చెబుతారు. స్థానిక పురాణం ప్రకారం.. ఓ సాధువు 40 రోజులు ఉపవాసం ఉన్న సమయంలో పాములు కాటేశాయి. దీంతో ఆగ్రహించిన ఆయన పాములను సముద్రంలోకి తరిమేశాడని అక్కడి స్థానికులు నమ్ముతారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.