Law Courses after 12th: ఇంటర్‌ తర్వాత ‘లా’ కెరీర్‌ ఎంచుకోవాలా..? టాప్‌ లా కోర్సులు, కాలేజీలు ఇవే!

ఇంటర్‌ తర్వాత నేరుగా డిగ్రీలో మాత్రమే చేరాలనే నియమం ఏమీ లేదు. ఇతర ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా న్యాయవాదిగా కెరీర్‌లో స్థిరపడాలని కోరుకునేవారు ఇంటర్‌ నుంచే పునాది ఏర్పరచుకోవచ్చు. న్యాయ కోర్సుల ద్వారా న్యాయమూర్తులు, న్యాయవాదులు, క్రిమినల్ ప్రొఫైలర్లుగా ఎదగవచ్చు. అందుకు ఇంటర్‌ తర్వాత BA LLB , BSc LLB, BBA LLB, B.Com LLB వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి..

Law Courses after 12th: ఇంటర్‌ తర్వాత 'లా' కెరీర్‌ ఎంచుకోవాలా..? టాప్‌ లా కోర్సులు, కాలేజీలు ఇవే!
Law Courses After 12th
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 26, 2024 | 12:13 PM

ఇంటర్‌ తర్వాత నేరుగా డిగ్రీలో మాత్రమే చేరాలనే నియమం ఏమీ లేదు. ఇతర ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా న్యాయవాదిగా కెరీర్‌లో స్థిరపడాలని కోరుకునేవారు ఇంటర్‌ నుంచే పునాది ఏర్పరచుకోవచ్చు. న్యాయ కోర్సుల ద్వారా న్యాయమూర్తులు, న్యాయవాదులు, క్రిమినల్ ప్రొఫైలర్లుగా ఎదగవచ్చు. అందుకు ఇంటర్‌ తర్వాత BA LLB , BSc LLB, BBA LLB, B.Com LLB వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. న్యాయవాద వృత్తి అంటే గంటల తరబడి ఒకటే కేసు గురించి పరిశోధించవల్సి ఉంటుంది. ఒక కేసును గెలవడానికి న్యాయ పరిశోధనలో మునిగిపోవాలి. అందుకు చట్టంలో సత్వరమార్గాలు ఏమీ లేవు. తెలివైన న్యాయవాదికి కూడా వారి తెలివిని అభివృద్ధి చేయడానికి ఎన్నో యేళ్ల అనుభవం అవసరం. ఏది ఏమైనప్పటికీ ఈ రోజుల్లో భారతీయ న్యాయవాదులలో వ్యాపారం, కుటుంబం, సైబర్, పేటెంట్ చట్టంతో సహా ‘లా’ కోర్సులో వివిధ స్పెషలైజేషన్లు బాగా పాపులారిటీ సంపాదించుకున్నాయి. అయితే లా కోర్సులను అభ్యసించడానికి కౌన్సెలింగ్, అడ్మిషన్ ప్రాసెస్ వంటి వివరాలు మీకోసం అందిస్తున్నాం..

  • లా కాలేజీల్లో UG, PG ప్రవేశాలకు అనేక ఎంపిక విధానాలు ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ స్థాయిలలో లా ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్ తీసుకోవాలనుకునే వారికి ఈ కింది కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అవేంటంటే..
  • LLB (3-సంవత్సరాల) ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొందేందుకు కనీసం 45%తో హయ్యర్ సెకండరీ స్కూల్/ఇంటర్మీడియట్ (10+2) లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి
  • LLMలో ప్రవేశం పొందాలంటే తప్పనిసరిగా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. లేదా అందుకు సమానమైన డిగ్రీని కలిగి ఉండాలి.

లా కోర్సుల ప్రవేశ పరీక్షలు

మన దేశంలోని లా కాలేజీలు, యూనివర్సిటీలు ప్రవేశాలు పొందాలంటే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT), ఆల్ ఇండియా లా ఎంట్రన్స్ టెస్ట్ (AILET), లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్ (LSAT ఇండియా), ఢిల్లీ యూనివర్సిటీ LLB ప్రవేశ పరీక్ష, మహారాష్ట్ర లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్, సింబయాసిస్ లా అడ్మిషన్ టెస్ట్.. వంటి ప్రవేశ పరీక్షల్లో ఏదైనా ఒకటి రాసి ప్రవేశాలు పొందవచ్చు.

మన దేశంలో ఉన్న వివిధ లా కోర్సుల వివరాలు..

12వ తరగతి తర్వాత లా కోర్సులను అభ్యసించాలనుకునే అభ్యర్థులకు మన దేశంలో అందుబాటులో ఉన్న అన్ని రకాల లా కోర్సులు ఇవే..

ఇవి కూడా చదవండి
  • BA + LLB – బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ & బ్యాచిలర్ ఆఫ్ లెజిస్లేటివ్ లా
  • BA+LLB (ఆనర్స్) – బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ & బ్యాచిలర్ ఆఫ్ లెజిస్లేటివ్ ఆఫ్ లా (ఆనర్స్)
  • BBA + LLB (ఆనర్స్.) – బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ & బ్యాచిలర్ ఆఫ్ లెజిస్లేటివ్ లా (ఆనర్స్)
  • BBA+ LLB – బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ & బ్యాచిలర్ ఆఫ్ లెజిస్లేటివ్ లా
  • B.Com + LLB – బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ & బ్యాచిలర్ ఆఫ్ లెజిస్లేటివ్ లా
  • B.Com + LLB (ఆనర్స్.) – బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ & బ్యాచిలర్ ఆఫ్ లెజిస్లేటివ్ ఆఫ్ లా (ఆనర్స్)
  • B.Tech.+ LLB – బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ & బ్యాచిలర్ ఆఫ్ లా
  • B.Sc + LLB (ఆనర్స్.) -బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ & బ్యాచిలర్ ఆఫ్ లెజిస్లేటివ్ ఆఫ్ లా (ఆనర్స్)
  • B.Sc + LLB – బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ & బ్యాచిలర్ ఆఫ్ లెజిస్లేటివ్ లా
  • LLB – బ్యాచిలర్ ఆఫ్ లా

డిప్లొమా లా కోర్సులు

ఇంటర్‌ తర్వాత ఈ కింది డిప్లొమా కోర్సులలో దేనినైనా అభ్యసించవచ్చు

  • డిప్లొమా ఇన్ బిజినెస్ లా
  • డిప్లొమా ఇన్ కో-ఆపరేటివ్ లా
  • కార్పొరేట్ లాస్ & మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా
  • డిప్లొమా ఇన్ క్రిమినల్ లా
  • డిప్లొమా ఇన్ క్రిమినాలజీ
  • డిప్లొమా ఇన్ సైబర్ లా
  • డిప్లొమా ఇన్ హ్యూమన్ రైట్స్
  • డిప్లొమా ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాస్
  • అంతర్జాతీయ చట్టాలలో డిప్లొమా
  • కార్మిక చట్టాలలో డిప్లొమా
  • డిప్లొమా ఇన్ లేబర్ లాస్ అండ్ లేబర్ వెల్ఫేర్
  • డిప్లొమా ఇన్ టాక్సేషన్ లాస్
  • డిప్లొమా ఇన్ ఉమెన్ స్టడీస్ & జెండర్ జస్టిస్

భారతదేశంలోని టాప్‌ లా కాలేజీలు

  • నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, బెంగళూరు
  • నేషనల్ లా యూనివర్సిటీ, న్యూఢిల్లీ
  • రాజీవ్ గాంధీ స్కూల్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లా, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఖరగ్‌పూర్
  • నేషనల్ లా యూనివర్సిటీ, జోధ్‌పూర్
  • జిందాల్ గ్లోబల్ లా స్కూల్, సోనిపట్
  • గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ, గాంధీనగర్
  • ఫ్యాకల్టీ ఆఫ్ లా, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, ఢిల్లీ
  • సింబయాసిస్ లా స్కూల్, పూణే
  • బనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసి
  • హిదయతుల్లా నేషనల్ లా యూనివర్సిటీ, రాయ్‌పూర్
  • ఆర్మీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లా, మొహాలి

బ్యాచిలర్ ఆఫ్ లా (LLB) కోర్సులు

హైస్కూల్ తర్వాత లా కోర్సు అభ్యసించాలని కోరుకునే వారు మూడు సంవత్సరాల బ్యాచిలర్ ఆఫ్ లాస్ ప్రోగ్రామ్‌ చదవాల్సి ఉంటుంది. అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం రెండు రకాల లా కోర్సులు ఉన్నాయి. ఒకటి గ్రాడ్యుయేషన్ తర్వాత మూడు సంవత్సరాలు, మరొకటి ఐదేళ్లు.

  • బ్యాచిలర్ ఆఫ్ లాస్ (LLB) (ఆనర్స్)ఫ 12వ తరగతి పూర్తి చేసిన తర్వాత 3 సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని చదవాలి. మేజిస్ట్రేట్, మున్సిఫ్ (సబ్-మేజిస్ట్రేట్), నోటరీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్, సొలిసిటర్, లీగల్ అడ్వైజర్, ట్రస్టీ, టీచర్, లెక్చరర్, లా రిపోర్టర్‌తో సహా ఈ డిగ్రీ చదివిన తర్వాత పలు రకాల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.
  • బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ + బ్యాచిలర్ ఆఫ్ లాస్ (BALLB): 12వ తరగతి పూర్తి చేసిన తర్వాత BALLB కోర్సును ఎంచుకోవచ్చు. చాలా మంది విద్యార్థులు ఈ కోర్సును ఎంచుకుంటారు. మొత్తం ఐదేళ్లు చదవాలి.
  • బి.టెక్. LLB: సాంకేతికతను ఉపయోగించి చట్టంలో నైపుణ్యం పొందాలనుకుంటే ఇది ఉత్తమ ఎంపిక. IT, CA లేదా CS నేపథ్యం ఉన్న అభ్యర్థులు ఈ కోర్సు ఎంచుకోవచ్చు.
  • BCom LLB:ఇది ఐదేళ్ల ప్రొఫెషనల్ లా డిగ్రీ. ఇది బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ అండ్‌ లెజిస్లేటివ్ లా (BCom LLB). ఇది చట్టం, బిజినెస్‌ అంశాలను ప్రస్తావిస్తుంది. BCom LLB కోర్సులో బిజినెస్ కమ్యూనికేషన్, ఆడిటింగ్, ఎకనామిక్స్, బిజినెస్ స్టాటిస్టిక్స్ వంటి అంశాలు ఉంటాయి.
  • బి.ఎస్సీ. LLB:సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీతో ప్రారంభమవుతుంది. ఇంటర్‌ తర్వాత న్యాయ కోర్సులను ఎంచుకునేవారు ఈ కోర్సులో గ్రాడ్యుయేట్లు సైన్స్ అధ్యయనంతోపాటు లా కోర్సును కూడా అభ్యసిస్తారు.

లా కోర్సులలో మరికొన్ని ముఖ్యమైన డిప్లొమా కోర్సులు

  • డిప్లొమా ఇన్ లేబర్ లాస్ అండ్ లేబర్ వెల్ఫేర్
  • డిప్లొమా ఇన్ టాక్సేషన్ (DTL)
  • డిప్లొమా ఇన్ సైబర్ లా

విద్యార్థులు గ్రాడ్యుయేషన్ తర్వాత మూడేళ్ల LLB డిగ్రీని లేదా ఇంటిగ్రేటెడ్ లీగల్ డిగ్రీని (BA LLB, BBA LLB, BSc LLB లేదా BCom LLB వంటివి) కొనసాగించాలనుకుంటున్నారా అనేది వారి వారి ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ LLB డిగ్రీ పూర్తి కావడానికి సాధారణంగా ఐదు సంవత్సరాలు పడుతుంది. LLB డిగ్రీకి మూడు సంవత్సరాలు పడుతుంది. లా ప్రోగ్రామ్‌ను పూర్తి చేసిన తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయమూర్తులు వంటి అనేక రకాల ఉపాధి అవకాశాలు పొందవచ్చు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.