SSC CHT 2025 Exam Date: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రాత పరీక్ష తేదీ విడుదల.. సిటీ ఇంటిమేషన్ స్లిప్పుల లింక్
SSC JHT Exam 2025 city intimation Slip Download link: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్ ఎగ్జామినేషన్ 2025 పేపర్ 2 పరీక్ష డిస్క్రిప్టివ్ విధానంలో త్వరంలోనే జరగనుంది. ఈ క్రమంలో ఈ పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది. పేపర్ 1 పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్ధులు..

హైదరాబాద్, డిసెంబర్ 7: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్ ఎగ్జామినేషన్ 2025 పేపర్ 2 పరీక్ష డిస్క్రిప్టివ్ విధానంలో త్వరంలోనే జరగనుంది. ఈ క్రమంలో ఈ పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది. పేపర్ 1 పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ ఐడీతో లాగిన్ అవడం ద్వారా సిటీ ఇంటిమేషన్ వివరాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక ఈ పరీక్షకు 4 రోజులు ముందుగా వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచుతారు. రాత పరీక్ష డిసెంబర్ 14న ఆఫ్‌లైన్ విధానంలో దేశ వ్యాప్తంగా పలు పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది.
కాగా ఈ ఏడాది ఆగస్టు 12న నిర్వహించిన పేపర్ I పరీక్షకు మొత్తం 6,332 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇటీవలే పేపర్ 1 ఫలితాలు విడుదలవగా అందులో పేపర్ 2 పరీక్షకు 3,642 మంది షార్ట్‌లిస్ట్ అయ్యారు. వీరందరికీ మరో వారం రోజుల్లో డిస్క్రిప్టివ్ విధానంలో పేపర్ 2 పరీక్ష జరగనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 552 గ్రూప్ ‘బి’ నాన్ గేజిటెడ్ పోస్టులను కమిషన్ భర్తీ చేయనుంది.
ముగిసిన క్లాట్ 2026 పరీక్ష.. ఫలితాలు ఎప్పుడంటే?
దేశవ్యాప్తంగా 2026-27 విద్యా సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక న్యాయ విశ్వవిద్యాలయాల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్-2026) ఆదివారం (డిసెంబర్ 7న) ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పరీక్ష జరిగింది. త్వరలోనే ఫలితాలు వెల్లడించనున్నారు. కాగా క్లాట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశ వ్యాప్తంగా ఉన్న లా యూనివర్సిటీల్లో సీట్లు కేటాయిస్తారు. నేషనల్ లా వర్సిటీల కన్సార్షియం తరఫున బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ ఈ పరీక్షను నిర్వహించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 4,500 వరకు లా యూజీ, పీజీ సీట్లు ఉన్నాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




