UPSC: డిగ్రీ పాస్ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం. ఎలా ఎంపిక చేస్తారంటే
డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సొంతం చేసుకునే అవకాశం. కేంద్ర ప్రభుత్వానికి చెందిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేంద్ర సాయుధ బలగాల్లో ఉన్న పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 506 పోటస్లును భర్తీ చేయనున్నారు. ఇంతకీ ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.?
డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సొంతం చేసుకునే అవకాశం. కేంద్ర ప్రభుత్వానికి చెందిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేంద్ర సాయుధ బలగాల్లో ఉన్న పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 506 పోటస్లును భర్తీ చేయనున్నారు. ఇంతకీ ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులను భర్తీ చేయన్నారు. మొత్తం 506 పోస్టులకు గాను బీఎస్‌ఎఫ్‌లో (186), సీఆర్‌పీఎఫ్ (120), సీఐఎస్‌ఎఫ్ (100), ఐటీబీపీ (58), ఎస్‌ఎస్‌బీ (42) ఖాళీలు ఉన్నాయి. ఈ పరీక్షను సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (అసిస్టెంట్ కమాండెంట్) పరీక్ష నిర్వహించనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీతో సమానమైన అర్హత కలిగి ఉండాలి. అలాగే నిర్దిష్టమైన శారీరక, వైద్య ప్రమాణాలు కలిగిఉండాలి.
ఇక అభ్యర్థుల వయసు ఆగస్టు 1, 2024 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ఆధారంగా పలు వర్గాలకు చెందిన అభ్యర్థులుకు సడలింపు ఉంటుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు మే 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మే 14వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక దరఖాస్తుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే మే 15 నుంచి 21వ తేదీ వరకు మార్పులు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజును రూ. 200గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అసవరం లేదు. ఇక ఎంపిక ప్రక్రియ విషయానికొస్తే.. రెండు పేపర్లతో రాత పరీక్ష ఉంటుంది. అంనతరం మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పేపర్ 1 250 మార్కులు ఉంటాయి. పేపర్ 2కి 200 మార్కులు ఉంటాయి. ఆగస్టు 4న జరిగే రాత పరీక్ష కోసం తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో సెంటర్లు ఏర్పాట్లు చేయనున్నారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..