Nominations: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ.. తుది అభ్యర్థుల జాబితా ఎప్పుడంటే..?
దేశవ్యాప్తంగా ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 4వ దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. వీటితో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు ఎలక్షన్ కమిషన్. ఈ నేపథ్యంలోనే ఏపీ, తెలంగాణలో నామినేషన్ల పర్వం ముగిసింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి సంబంధించిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తైంది. ఎన్ని నామినేషన్లు అమోదించబడ్డాయి..? ఎన్ని తిరస్కరించారు...? ఇప్పుడా డీటెయిల్స్ చూద్దాం...
దేశవ్యాప్తంగా ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 4వ దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. వీటితో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు ఎలక్షన్ కమిషన్. ఈ నేపథ్యంలోనే ఏపీ, తెలంగాణలో నామినేషన్ల పర్వం ముగిసింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి సంబంధించిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తైంది. ఎన్ని నామినేషన్లు అమోదించబడ్డాయి..? ఎన్ని తిరస్కరించారు…? ఇప్పుడా డీటెయిల్స్ చూద్దాం…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు 893 మంది నామినేషన్లు దాఖలు చేయగా, 271 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు. 622 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించారు. ఇటు ఏపీలోని 25 లోక్‌సభ స్థానాలకు 686 నామినేషన్లు రాగా, వాటిలో 503 నామినేషన్లకు ఆమోదం లభించింది. 183 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. అత్యధికంగా గుంటూరు పార్లమెంటు స్థానానికి 47 నామినేషన్లు వచ్చాయి. అత్యల్పంగా శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి 16 నామినేషన్లు దాఖలయ్యాయి.
అటు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 175 అసెంబ్లీ స్థానాలకు 3,644 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో 2,705 నామినేషన్లకు ఆమోదం లభించింది. 939 నామినేష్లను రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు. అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ స్థానానికి 52 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అత్యల్పంగా చోడవరం అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి 8 నామినేషన్లు మాత్రమే వచ్చాయి.
ఇక నామినేషన్ల తిరస్కరణకు ఎన్నో కారణాలున్నాయంటున్నారు అధికారులు. అన్ని కాలమ్స్‌ను పూరించకపోవడం, కొన్ని కాలమ్స్‌ను ఎంప్టీగా వదిలేయడం అలాగే కొన్నిచోట్ల సంతకాలు చేయకపోవడం వంటి చాలా కారణాలున్నాయని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. ఇక ఏఫ్రిల్ 29 వరకు అంటే రేపటి వరకు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంది. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత.. తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు ఎన్నికల సంఘం అధికారులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…