AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister Giriraj Singh: ‘అసలు సోనియా, ఇందిరాలకు మంగళసూత్రాలు ఉన్నాయో.. లేవో..’.. మళ్లీ నోరు జారిన కేంద్ర మంత్రి

లోక్‌ సభ ఎన్నికల నేపథ్యంలో నేతలు పరస్పర విమర్శనాస్త్రాలు సందిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాదిలో రాజకీయాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. తాజాగా కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ కాంగ్రెస్‌ మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, సోనియా గాంధీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'త్యాగాలు చేయడానికి అసలు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, కాంగ్రెస్‌ నేత సోనియా గాంధీలకు మంగళసూత్రాలు ఉన్నాయా? నాకు అనుమానమే' అంటూ..

Minister Giriraj Singh: 'అసలు సోనియా, ఇందిరాలకు మంగళసూత్రాలు ఉన్నాయో.. లేవో..'.. మళ్లీ నోరు జారిన కేంద్ర మంత్రి
Minister Giriraj Singh
Srilakshmi C
|

Updated on: Apr 28, 2024 | 9:22 AM

Share

బెగుసరాయ్‌, ఏప్రిల్ 28: లోక్‌ సభ ఎన్నికల నేపథ్యంలో నేతలు పరస్పర విమర్శనాస్త్రాలు సందిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాదిలో రాజకీయాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. తాజాగా కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ కాంగ్రెస్‌ మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, సోనియా గాంధీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘త్యాగాలు చేయడానికి అసలు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, కాంగ్రెస్‌ నేత సోనియా గాంధీలకు మంగళసూత్రాలు ఉన్నాయా? నాకు అనుమానమే’ అంటూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. బీహార్‌లోని బెగుసరాయ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మహిళల మంగళసూత్రాలు, బంగారాన్ని గుంజుకుంటుందని ప్రధాని మోదీ చేసిన విమర్శలపై కాంగ్రెస్‌ నేత ప్రియాంక స్పందిస్తూ.. తన తండ్రి రాజీవ్‌ గాంధీ హత్యను ప్రస్తావి.. తన తల్లి సోనియా మంగళ సూత్రాన్ని త్యాగం చేశారని అన్నారు. అలాగే తన నానమ్మ ఇందిరా గాంధీ దేశం కోసం తన ప్రాణాలను అంకితం చేశారని అన్నారు. ఇక ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై గిరిరాజ్‌ సింగ్‌ స్పందిస్తూ..

‘ఇటలీ నుంచి వచ్చిన ఆమె తల్లి సోనియాకు మంగళసూత్రం ఉంటుందో లేదో నాకు తెలియదు. అలాగే ఫిరోజ్ గాంధీని వివాహం చేసుకున్న ఆమె నానమ్మ ఇందిరా గాంధీకి మంగళసూత్రం ఉందో లేదో కూడా నాకు తెలియదు. ఫిరోజ్‌ గాంధీ పార్సీ మతస్తుడు. వారి మతాచారం ప్రకారం మంగళసూత్రం పెట్టుకునే పద్ధతి లేదు. ప్రస్తుతం ప్రియాంక వద్ద మంగళసూత్రం ఉందనైతె నేను నమ్ముతున్నాను. అయితే వారు ఇంకా ఎన్ని రోజులు ‘డాడీ’, ‘పరివార్’ గురించి చెప్పుకుంటూ ప్రచారం చేస్తారు?’ అంటూ కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ గాంధీల కుటుంబం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చదవండి

కాగా గిరిరాజ్ సింగ్ ‘గాంధీ’ ఫ్యామిలీపై టంగ్ స్లిప్‌ అవడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ చర్మం రంగు ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మారడానికి సహాయపడిందని ఓ సారి అన్నారు. మరొకసారి రాహుల్ గాంధీని ‘విదూషకుడు’ అని సంబోధించారు. ఏదిఏమైనా.. ఎన్నికల వేళ నేతల రాగాలు కాస్త శృతి మించుతున్నట్లు ఉన్నాయి. ఏకంగా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఏనుగుల దినోత్సవం.. ఇంత తెలివైనవా? అచ్చం మనుషుల్లానే చేస్తాయా
ఏనుగుల దినోత్సవం.. ఇంత తెలివైనవా? అచ్చం మనుషుల్లానే చేస్తాయా
దేవుడి ముందు ప్రార్థిస్తున్నప్పుడు చెడు ఆలోచనలు ఎందుకు వస్తాయి?..
దేవుడి ముందు ప్రార్థిస్తున్నప్పుడు చెడు ఆలోచనలు ఎందుకు వస్తాయి?..
ఏయిర్‌ పోర్టులో అనుమానంగా కనిపించిన ప్రయాణికుడు.. ఆపి చెక్‌ చేయగా
ఏయిర్‌ పోర్టులో అనుమానంగా కనిపించిన ప్రయాణికుడు.. ఆపి చెక్‌ చేయగా
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
2026లో భారత్‌లో అత్యధిక జీతాలు అందించే టాప్ 10 ఉద్యోగాలు..
2026లో భారత్‌లో అత్యధిక జీతాలు అందించే టాప్ 10 ఉద్యోగాలు..
కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది..
కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది..
సామాన్యులకు రైల్వేశాఖ బిగ్ రిలీఫ్..
సామాన్యులకు రైల్వేశాఖ బిగ్ రిలీఫ్..
16 సోమవారాల వ్రతానికి శ్రావణ మాసమే ఎందుకు ప్రత్యేకం? దీని వెనుక..
16 సోమవారాల వ్రతానికి శ్రావణ మాసమే ఎందుకు ప్రత్యేకం? దీని వెనుక..
తెలంగాణ తరహాలో స్టైఫండ్ ఇవ్వాలని జూనియర్ డాక్టర్ల డిమాండ్
తెలంగాణ తరహాలో స్టైఫండ్ ఇవ్వాలని జూనియర్ డాక్టర్ల డిమాండ్
కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు.. మారనున్న రూపురేఖలు..
కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు.. మారనున్న రూపురేఖలు..