Congress Confusion: అమేథీలో రాహుల్‌గాంధీ.. రాయ్‌బరేలిలో ప్రియాంకాగాంధీ.. నేతల పోటీపై కాంగ్రెస్‌ డైలామా!

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలుగా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలపైనే ప్రస్తుతం అందరి దృష్టి పడింది. ఎన్నికల నామినేషన్ల పర్వం సమీపిస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఆ రెండు స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారనేది కాంగ్రెస్ తేల్చలేకపోయింది. . దీంతో అమేథీ, రాయ్‌బరేలీలో ఎవరు పోటీ చేస్తారన్నదీ ఉత్కంఠగా మారింది.

Congress Confusion: అమేథీలో రాహుల్‌గాంధీ.. రాయ్‌బరేలిలో ప్రియాంకాగాంధీ.. నేతల పోటీపై కాంగ్రెస్‌ డైలామా!
Rahul Gandhi And Priyanka
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 28, 2024 | 8:14 AM

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలుగా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలపైనే ప్రస్తుతం అందరి దృష్టి పడింది. ఎన్నికల నామినేషన్ల పర్వం సమీపిస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఆ రెండు స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారనేది కాంగ్రెస్ తేల్చలేకపోయింది. . దీంతో అమేథీ, రాయ్‌బరేలీలో ఎవరు పోటీ చేస్తారన్నదీ ఉత్కంఠగా మారింది. ముఖ్యనేతలు రాహుల్, ప్రియాంక స్వయంగా పోటీ చేస్తారన్న చర్చ కొనసాగుతోంది. అయితే అమేథీలో రాహుల్‌, రాయ్‌బరేలిలో ప్రియాంక పోటీకి సై అంటారా ? లేదా ? అన్న విషయంపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. శనివారం జరిగిన కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ సమావేశం దీనిపై ఎటూ తేల్చకుండానే ముగిసింది. దీనిపై నిర్ణయాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గేకు వదిలేస్తూ తీర్మానం చేశారు.

అమేథీలో రాహుల్‌గాంధీ, రాయ్‌బరేలిలో ప్రియాంకాగాంధీ పోటీపై కాంగ్రెస్‌ నేతలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. శనివారం జరిగిన కాంగ్రెస్‌ సీఈసీ సమావేశం కూడా దీనిపై ఏమి తేల్చకుండానే ముగిసింది. . అమేథీ , రాయ్‌బరేలి స్థానాల్లో అభ్యర్ధులను శనివారం ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. అమేథీ నుంచి రాహుల్‌గాంధీ , రాయ్‌బరేలి నుంచి ప్రియాంకగాంధీని బరి లోకి దింపాలని కార్యకర్తలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. సీఈసీ సమావేశంలో కూడా అమేథీ , రాయ్‌బరేలి స్థానాలపై లోతైన చర్చ జరిగింది. రాహుల్‌ , ప్రియాంక పోటీ చేయాలని పలువురు యూపీ నేతలు ఈ సమావేశంలో ప్రస్తావించారు.

రాహుల్‌ , ప్రియాంక పోటీపై నిర్ణయాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గేకు వదిలేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రియాంక , రాహుల్‌ పోటీపై ఇంకా 10 రోజుల సమయం పట్టే అవకాశముందని ఖర్గే చెప్పడం మరిన్ని సందేహాలకు తావిస్తోంది. గాంధీ కుటుంబం నుంచి యూపీలో ఇద్దరు పోటీ చేస్తారా ? లేదా ? అన్న విషయంపై ఎటువంటి క్లారిటీ రావడం లేదు.

కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఇప్పటికే రెండు నియోజకవర్గాల్లో పలుమార్లు సర్వేలు నిర్వహించింది. రాహుల్‌ , ప్రియాంక బరిలో ఉంటే కార్యకర్తల మనోధైర్యం పెరుగుతుందన్న అభిప్రాయం ఈ సర్వేల్లో వ్యక్తమయ్యింది. రాహుల్‌గాంధీ కూడా అమేథీ నుంచి పోటీ చేయడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. సోనియా రాజ్యసభకు నామినేట్‌ కావడంతో రాయ్‌బరేలి నుంచి ప్రియాంక పోటీ చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గాంధీ కుటుంబం అంటే మాకు చాలా ప్రేమ. ప్రియాంకాగాంధీ మాతో ఎప్పుడు టచ్‌లో ఉంటారు. రాహుల్‌గాంధీకి ఇక్కడి ప్రతి గ్రామంతో సంబంధాలు ఉన్నాయి. కరోనా కాలంలో రాహుల్‌గాంధీ మాకు అండగా ఉన్నారు. ఆయన అభ్యర్ధిత్వాన్ని ప్రకటించగానే ఉత్సాహంతో పనిచేస్తాం.. అమేథీ మరోసారి దేశానికి దిక్సూచిగా నిలుస్తుంది. రాజీవ్‌గాంధీ హయాం నుంచి అమేథీ దేశానికి ఒక దిశను చూపించిందన్నారు యోగేంద్ర మిశ్రా , కాంగ్రెస్‌ నేత.

అమేథీ , రాయ్‌బరేలి స్థానాల్లో అభ్యర్ధుల ఎంపికపై చివరి వరకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ సస్సెన్స్‌ను కొనసాగిస్తోంది. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో అమేథీ నుంచి రాహుల్‌గాంధీ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. కేరళ లోని వయనాడు నుంచి ఇప్పటికే ఎన్నికల బరిలో ఉన్నారు రాహుల్‌గాంధీ. అయితే అమేథీ నుంచి పోటీ చేయడానికి సొనియా అల్లుడు రాబర్ట్‌ వాద్రా కూడా పోటీకి రెడీ అంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

స్మార్ట్ బీటా ఇటిఎఫ్‌లు అంటే ఏమిటీ? రాబడి ఎలా ఇస్తాయి?
స్మార్ట్ బీటా ఇటిఎఫ్‌లు అంటే ఏమిటీ? రాబడి ఎలా ఇస్తాయి?
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
లాస్ ఏంజిల్స్ అడవుల్లో భారీ అగ్నిప్రమాదం..16000 ఎకరాల్లో విధ్వంసం
లాస్ ఏంజిల్స్ అడవుల్లో భారీ అగ్నిప్రమాదం..16000 ఎకరాల్లో విధ్వంసం
కూతురితో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సురేఖా వాణి.. ఫొటోస్
కూతురితో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సురేఖా వాణి.. ఫొటోస్
వామ్మో.. అదేమన్న జాతర్ల మేకపోతు అనుకుంటివా ఏందీ..? చిరుతతో అలాఎలా
వామ్మో.. అదేమన్న జాతర్ల మేకపోతు అనుకుంటివా ఏందీ..? చిరుతతో అలాఎలా
అంతా గప్ చుప్..సినిమా విశేషాలను దాచిపెడుతున్న జక్కన్న..ఎందుకంటే?
అంతా గప్ చుప్..సినిమా విశేషాలను దాచిపెడుతున్న జక్కన్న..ఎందుకంటే?
మీరూ చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా? బీ కేర్ ఫుల్..
మీరూ చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా? బీ కేర్ ఫుల్..
కలలో పూర్వీకులు కనిపిస్తే శుభమా? అశుభమా..
కలలో పూర్వీకులు కనిపిస్తే శుభమా? అశుభమా..
మ్యూచువల్ ఫండ్స్ కంటే ఇటిఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడం లాభదాయకమా?
మ్యూచువల్ ఫండ్స్ కంటే ఇటిఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడం లాభదాయకమా?
ఎప్పుడూ ఒకేలానా.. కాస్త కొత్తగా ట్రై చేద్దామంటున్న స్టార్ హీరోస్!
ఎప్పుడూ ఒకేలానా.. కాస్త కొత్తగా ట్రై చేద్దామంటున్న స్టార్ హీరోస్!
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ నిర్మాతలకు బిగ్ షాక్
గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ నిర్మాతలకు బిగ్ షాక్