AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Journalist Vinay Vir: ప్రముఖ దినపత్రిక ‘హిందీ మిలాప్‌’ ఎడిటర్‌ వినయ్‌ వీర్‌ కన్నుమూత.. ముఖ్యమంత్రి రేవంత్ సంతాపం

ప్రముఖ హిందీ పత్రిక హిందీ మిలాప్‌ ఎడిటర్‌, జర్నలిస్ట్‌ వినయ్‌ వీర్‌ (72) శనివారం (ఏప్రిల్ 27) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొన్నాళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో ఆయన పరిస్థితి విషమించి శనివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. దక్షిణ భారతదేశంలో హిందీ జర్నలిజాన్ని కొత్త శిఖరాలకు చేర్చిన జర్నలిస్ట్‌ వినయ్‌ వీర్‌. హిందీ సాహిత్యం, జర్నలిజం అభివృద్ధికి..

Journalist Vinay Vir: ప్రముఖ దినపత్రిక 'హిందీ మిలాప్‌' ఎడిటర్‌ వినయ్‌ వీర్‌ కన్నుమూత.. ముఖ్యమంత్రి రేవంత్ సంతాపం
Daily Hindi Milap Editor Vinay Vir
Srilakshmi C
|

Updated on: Apr 28, 2024 | 11:29 AM

Share

హైదరాబాద్‌, ఏప్రిల్ 28: ప్రముఖ హిందీ పత్రిక హిందీ మిలాప్‌ ఎడిటర్‌, జర్నలిస్ట్‌ వినయ్‌ వీర్‌ (72) శనివారం (ఏప్రిల్ 27) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొన్నాళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో ఆయన పరిస్థితి విషమించి శనివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. దక్షిణ భారతదేశంలో హిందీ జర్నలిజాన్ని కొత్త శిఖరాలకు చేర్చిన జర్నలిస్ట్‌ వినయ్‌ వీర్‌. హిందీ సాహిత్యం, జర్నలిజం అభివృద్ధికి ఆయన విశేష కృషి చేశారు. ఆయన ఎడిటింగ్ స్టైల్ , మేనేజ్ మెంట్ స్టైల్ , భాషపై ఆయనకున్న పట్టు అందరికీ తెలిసిందే.

వినయ్‌ వీర్‌ తల్లిదండ్రులు పాకిస్థాన్‌లోని సింధ్‌ ప్రాంతానికి చెందినవారు. వినయ్‌ తండ్రి యుధ్‌వీర్‌, తల్లి సీతా యుధ్‌వీర్‌ స్వాతంత్య్ర సమరయోధులు. స్వాతంత్య్రానికి పూర్వం వీరు భారత్‌కు వచ్చారు. ఆయన తండ్రి జర్నలిస్ట్‌, తల్లి రాజ్యసభ సభ్యురాలిగా రెండు సార్లు పనిచేశారు. వినయ్‌ వీర్‌ తండ్రి యుధ్‌వీర్‌ స్వాతంత్య్రానికి పూర్వమే ఉర్దూ మిలాప్‌ పత్రికను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని కట్టెలమండిలో స్థిరపడిన వినయ్‌ వీర్‌ కుటుంబం 1962లో హిందీ మిలాప్‌ను నెలకొల్పారు.

వినయ్‌ వీర్‌ హైదరాబాద్ నుం జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్‌ మాస్ కమ్యూనికేషన్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. వినయ్‌ వీర్‌ తన వీర్ తన తండ్రి మరణానంతరం 1991లో డైలీ హిందీ మిలాప్ సంపాదకునిగా బాధ్యతలు స్వీకరించి, జర్నలిజంలో కొత్త ఒరవడికలు సృష్టించారు. వినయ్ వీర్ మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సీనియర్ జర్నలిస్టుగా హిందీ మీడియాకు వీర్ చేసిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. కాగా వినయ్‌కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో ఆదివారం ఉదయం 10 గంటలకు అంత్యక్రియలు నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.