TS Inter Supply Time Table 2024: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్లో స్వల్పమార్పులు.. పూర్తి టైం టేబుల్ ఇదే
తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్లో స్వల్పమార్పులు చోటుచేసుకున్నాయి. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ను తాజాగా ఇంటర్‌బోర్డు సవరించి కొత్త టైం టేబుల్‌ను విడుదల చేసింది. తొలుత మే 24 నుంచి జూన్ 1 వరకు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మే 24 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్‌బోర్డు..
హైదరాబాద్, ఏప్రిల్ 28: తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్లో స్వల్పమార్పులు చోటుచేసుకున్నాయి. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ను తాజాగా ఇంటర్‌బోర్డు సవరించి కొత్త టైం టేబుల్‌ను విడుదల చేసింది. తొలుత మే 24 నుంచి జూన్ 1 వరకు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మే 24 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్‌బోర్డు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు శనివారం (ఏప్రిల్ 27) విడుదల చేసింది.
ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఫస్టియర్, మధ్యాహ్నం 2:30నుంచి సాయంత్రం 5:30వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జూన్ 4నుంచి 8వరకు నిర్వహిస్తారు. ఫస్టియర్ ఇంగ్లిష్ ప్రాక్టికల్ ఎగ్జామ్ జూన్ 10న ఉదయం 9గంటలకు నిర్వహిస్తారు. జూన్ 11న ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్, 12న ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.
ఇంటర్ ఫస్టియర్ టైం టేబుల్
- మే 24న సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1 పరీక్ష
- మే 25 న ఇంగ్లిష్ పేపర్-1 పరీక్ష
- మే 28న గణితం పేపర్-1ఏ, బోటనీ పేపర్ -1, పొలిటికల్ సైన్స్ పేపర్ -1 పరీక్షలు
- మే 29న గణితం పేపర్ -1బీ, జువాలజీ పేపర్ -1, హిస్టరీ పేపర్ -1 పరీక్షలు
- మే 30న ఫిజిక్స్ పేపర్ -1, ఎకానమిక్స్ పేపర్ -1 పరీక్షలు
- మే 31న కెమిస్ట్రీ పేపర్ -1, కామర్స్ పేపర్ -1 పరీక్షలు
- జూన్ 1న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్ -1 పరీక్షలు
- జూన్ 3న మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ -1, జియోగ్రఫీ పేపర్ -1 పరీక్షలు
ఇంటర్ సెకండియర్ టైం టేబుల్
- మే 24న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ -2 పరీక్ష
- మే 25న ఇంగ్లిష్ పేపర్ -2 పరీక్ష
- మే 28న గణితం పేపర్-2ఏ, బోటనీ పేపర్ -2, పొలిటికల్ సైన్స్ పేపర్ -2 పరీక్షలు
- మే 29న గణితం పేపర్-2బీ, జువాలజీ పేపర్ -2, హిస్టరీ పేపర్ -2 పరీక్షలు
- మే 30న ఫిజిక్స్ పేపర్ -2, ఎకానమిక్స్ పేపర్ -2 పరీక్షలు
- మే 31న కెమిస్ట్రీ పేపర్ -2, కామర్స్ పేపర్ -2 పరీక్షలు
- జూన్ 1న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్ -2 పరీక్షలు
- జూన్ 3న మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ -2, జియోగ్రఫీ పేపర్ -2 పరీక్షలు
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.