ఇకపై ఏటా రెండు సార్లు సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు

ఇకపై ఏటా రెండు సార్లు సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు

Phani CH

|

Updated on: Apr 28, 2024 | 6:47 PM

వచ్చే ఏడాది నుంచి రెండుసార్లు టెన్త్, ఇంటర్ సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు నిర్వహించే దిశగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే, సెమిస్టర్ విధానాన్ని మాత్రం ప్రారంభించే యోచన లేదని తెలుస్తోంది. ఈ విషయమై పాఠశాలల ప్రిన్సిపాల్స్‌తో వచ్చే నెలలో చర్చలు కూడా జరిపేందుకు విద్యాశాఖ సమాయత్తమవుతోంది. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్లపై ప్రభావం లేకుండా పరీక్షలు నిర్వహించాలని యోచిస్తోంది.

వచ్చే ఏడాది నుంచి రెండుసార్లు టెన్త్, ఇంటర్ సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు నిర్వహించే దిశగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే, సెమిస్టర్ విధానాన్ని మాత్రం ప్రారంభించే యోచన లేదని తెలుస్తోంది. ఈ విషయమై పాఠశాలల ప్రిన్సిపాల్స్‌తో వచ్చే నెలలో చర్చలు కూడా జరిపేందుకు విద్యాశాఖ సమాయత్తమవుతోంది. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్లపై ప్రభావం లేకుండా పరీక్షలు నిర్వహించాలని యోచిస్తోంది. కేంద్రం ప్రవేశపెట్టిన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా సీబీఎస్‌ఈ పరీక్షల్లో మార్పులు చేయాలని నేషనల్ కరికులమ్ ఫ్రేమ్‌వర్క్ ముసాయిదా కమిటీ గతంలో సూచించింది. ఇస్రో మాజీ చైర్మన్ కె. కస్తూరీ రంగన్ సారథ్యంలోని ఈ కమిటీ 11, 12వ తరగతి విద్యార్థులకు సెమిస్టర్ విధానాన్ని వర్తించాలని ప్రతిపాదించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భారీ వ‌ర్షాల‌కు 155 మంది మృతి !! ఎక్కడంటే ??

మీ మొబైల్ పోయిందా ?? అయితే సుడాన్ వెళ్ళిపోయి ఉంటుంది

ప్రపంచంలోని 50 ఉత్తమ వంటకాల్లో 9 భారతీయ వంటకాలు

పర్వతం కనిపించకుండా భారీగా నల్లటి తెర !! ఎందుకంటే ??

విజయ్ మాల్యా విషయంలో ఫ్రాన్స్ సాయం కోరిన భారత్