విజయ్ మాల్యా విషయంలో ఫ్రాన్స్ సాయం కోరిన భారత్

విజయ్ మాల్యా విషయంలో ఫ్రాన్స్ సాయం కోరిన భారత్

Phani CH

|

Updated on: Apr 28, 2024 | 6:30 PM

బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయలకు పైగా రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పరారైన లిక్కర్ టైకూన్ విజయ్ మాల్యాను స్వదేశానికి రప్పించేందుకు భారత్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. 2016 నుంచి యూకేలో నివసిస్తున్న మాల్యాను భారత్.. పరారీలో ఉన్న నేరస్తుడిగా ప్రకటించింది. భారత్ లో ఆయన ఆస్తులను కేంద్ర ప్రభుత్వం వేలం ద్వారా విక్రయించింది. వ్యవస్థీకృత నేరాలు, కౌంటర్ టెర్రరిజంపై ఉమ్మడి పోరులో భాగంగా ఫ్రాన్స్ తో ఇటీవల జరిగిన ద్వైపాక్షిక వర్కింగ్ గ్రూప్ 16వ సమావేశంలో

బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయలకు పైగా రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పరారైన లిక్కర్ టైకూన్ విజయ్ మాల్యాను స్వదేశానికి రప్పించేందుకు భారత్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. 2016 నుంచి యూకేలో నివసిస్తున్న మాల్యాను భారత్.. పరారీలో ఉన్న నేరస్తుడిగా ప్రకటించింది. భారత్ లో ఆయన ఆస్తులను కేంద్ర ప్రభుత్వం వేలం ద్వారా విక్రయించింది. వ్యవస్థీకృత నేరాలు, కౌంటర్ టెర్రరిజంపై ఉమ్మడి పోరులో భాగంగా ఫ్రాన్స్ తో ఇటీవల జరిగిన ద్వైపాక్షిక వర్కింగ్ గ్రూప్ 16వ సమావేశంలో భారత్ మాల్యా అప్పగింత అంశాన్ని ఇండియా ప్రస్తావించింది. విజయ్ మాల్యా ఒకవేళ ఫ్రాన్స్ కు వస్తే ఆయన్ను ఎలాంటి షరతులు లేకుండా తమకు అప్పగించాలని కోరింది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ద ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం ప్రచురించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పురుగులు పట్టిన బియ్యం తినొచ్చా ?? తింటె ఏమౌతుంది ??