పర్వతం కనిపించకుండా భారీగా నల్లటి తెర !! ఎందుకంటే ??

ప్రముఖ టూరిస్ట్ స్పాట్ మౌంట్ ఫ్యూజీ అగ్నిపర్వతాన్ని సందర్శించే విదేశీ టూరిస్టులు నిబంధనలను అతిక్రమిస్తుండటంతో జపాన్ కీలక నిర్ణయం తీసుకుంది. పర్వత ప్రాంతంలో ఎక్కడంటే అక్కడ చెత్త పడేస్తుండటం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తుండటంతో పర్యాటకులను కట్టడి చేయాలని నిర్ణయించింది. ఇకపై ఆ పర్వతం కనిపించకుండా 8 అడుగుల ఎత్తు, 65 అడుగుల పొడవుతో భారీ మెష్ నెట్ ను నల్ల తెరలాగా అడ్డుగా ఏర్పాటు చేయనుంది.

పర్వతం కనిపించకుండా భారీగా నల్లటి తెర !! ఎందుకంటే ??

|

Updated on: Apr 28, 2024 | 6:31 PM

ప్రముఖ టూరిస్ట్ స్పాట్ మౌంట్ ఫ్యూజీ అగ్నిపర్వతాన్ని సందర్శించే విదేశీ టూరిస్టులు నిబంధనలను అతిక్రమిస్తుండటంతో జపాన్ కీలక నిర్ణయం తీసుకుంది. పర్వత ప్రాంతంలో ఎక్కడంటే అక్కడ చెత్త పడేస్తుండటం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తుండటంతో పర్యాటకులను కట్టడి చేయాలని నిర్ణయించింది. ఇకపై ఆ పర్వతం కనిపించకుండా 8 అడుగుల ఎత్తు, 65 అడుగుల పొడవుతో భారీ మెష్ నెట్ ను నల్ల తెరలాగా అడ్డుగా ఏర్పాటు చేయనుంది. వచ్చే వారమే దీని ఏర్పాటు మొదలవుతుందని ఓ అధికారి తెలిపారు. నిబంధనలను కొందరు పర్యాటకులు గౌరవించకపోవడం వల్లే తాము ఈ పని చేయాల్సి వస్తోందని ఓ అధికారి ఏఎఫ్ పీ వార్తాసంస్థకు తెలిపారు. రాజధాని టోక్యోకు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉండే ఫ్యూజీకావాగుచికో నగరంలో ఈ అగ్నిపర్వతం ఉంది. ఈ నగరం నలువైపుల నుంచి చూసినా అగ్నిపర్వతం కనిపిస్తుంది. అయితే అక్కడున్న ఓ డిపార్ట్ మెంటల్ స్టోర్ దగ్గర ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్ బాగా పాపులర్ అయింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విజయ్ మాల్యా విషయంలో ఫ్రాన్స్ సాయం కోరిన భారత్

పురుగులు పట్టిన బియ్యం తినొచ్చా ?? తింటె ఏమౌతుంది ??

Follow us