అమెరికా పోలీసులు మళ్లీ అదే తీరు.. మరో నల్లజాతీయుడు మృతి

అమెరికా పోలీసులు మళ్లీ అదే తీరు.. మరో నల్లజాతీయుడు మృతి

Phani CH

|

Updated on: Apr 28, 2024 | 6:48 PM

అమెరికాలో 2020లో పోలీసుల జాత్యహంకారానికి బలైన జార్జి ఫ్లాయిడ్ తరహా ఘటన రిపీటైంది. ఒహాయో రాష్ర్టంలో ఓ నల్ల జాతీయుడి అరెస్టు సందర్భంగా పోలీసులు సాగించిన దురాగతం బయటపడింది. కాంటన్ పోలీస్ డిపార్ట్ మెంట్ విడుదల చేసిన పోలీసుల బాడీ కెమెరా వీడియో ఇందుకు సాక్ష్యంగా నిలిచింది. ఏప్రిల్‌ 18న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ కారు ప్రమాద ప్రాంతం నుంచి పరారైన కేసులో అనుమానితుడైన 53 ఏళ్ల ఫ్రాంక్ టైసన్ అరెస్టుకు సంబంధించిన దృశ్యం ఆ వీడియోలో రికార్డయింది.

అమెరికాలో 2020లో పోలీసుల జాత్యహంకారానికి బలైన జార్జి ఫ్లాయిడ్ తరహా ఘటన రిపీటైంది. ఒహాయో రాష్ర్టంలో ఓ నల్ల జాతీయుడి అరెస్టు సందర్భంగా పోలీసులు సాగించిన దురాగతం బయటపడింది. కాంటన్ పోలీస్ డిపార్ట్ మెంట్ విడుదల చేసిన పోలీసుల బాడీ కెమెరా వీడియో ఇందుకు సాక్ష్యంగా నిలిచింది. ఏప్రిల్‌ 18న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ కారు ప్రమాద ప్రాంతం నుంచి పరారైన కేసులో అనుమానితుడైన 53 ఏళ్ల ఫ్రాంక్ టైసన్ అరెస్టుకు సంబంధించిన దృశ్యం ఆ వీడియోలో రికార్డయింది. ఓ బార్ లో ఉన్న అనుమానితుడిని ఒహాయో పోలీసులు అరెస్టు చేసేందుకు వచ్చిన సమయంలో వారి మధ్య మొదట కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం టైసన్ ను పోలీసులు బలప్రయోగంతో కింద పడేశారు. బోర్లా పడిన అతని చేతులను వెనక్కి విరిచి ఒక పోలీసు అధికారి బేడీలు వేస్తుండగా మరో పోలీసు అధికారి అతని మెడను తన మోకాలితో గట్టిగా అదిమి పట్టాడు. తనకు ఊపిరి ఆడట్లేదని, కాపాడాలని టైసన్ పలుమార్లు మొత్తుకున్నా వారు పట్టించుకోలేదు. మెడను అదిమిపట్టిన పోలీసు అధికారి ‘నువ్వు బాగానే ఉన్నావు’ అంటూ వ్యాఖ్యానించాడు. ‘బార్ లో జరిగే గొడవలో భాగం కావాలని నేనెప్పుడూ అనుకొనే వాడిని’ అంటూ సహచరులతో ఆ అధికారి పేర్కొనడం ఆ ఫుటేజీలో వినిపించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇకపై ఏటా రెండు సార్లు సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు

భారీ వ‌ర్షాల‌కు 155 మంది మృతి !! ఎక్కడంటే ??

మీ మొబైల్ పోయిందా ?? అయితే సుడాన్ వెళ్ళిపోయి ఉంటుంది

ప్రపంచంలోని 50 ఉత్తమ వంటకాల్లో 9 భారతీయ వంటకాలు

పర్వతం కనిపించకుండా భారీగా నల్లటి తెర !! ఎందుకంటే ??