ఎల్‌నినో ఎఫెక్ట్.. తీవ్ర కరువుతో మూగజీవులు విల విల
ఆఫ్రికా దేశమైన బోట్స్ వానాను తీవ్ర కరవు అల్లాడిస్తోంది. దీంతో వన్యప్రాణులు నీటి కోసం విలవిల్లాడుతున్నాయి. ముఖ్యంగా నీటిలోనే ఎక్కువగా సేదతీరే హిప్పోపోటమస్ ల గుంపులు ఎండిన కుంటల్లో చిక్కుకుపోయాయి. ఎల్ నినో వాతావరణ పరిస్థితుల కారణంగా బోట్స్ వానాలో కరవు తాండవిస్తోంది. వర్షాలు లేక పంటల దిగుబడి దెబ్బతినడంతో లక్షలాది మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఆఫ్రికాలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న చాలా దేశాలు ఇప్పటికే అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి.
ఆఫ్రికా దేశమైన బోట్స్ వానాను తీవ్ర కరవు అల్లాడిస్తోంది. దీంతో వన్యప్రాణులు నీటి కోసం విలవిల్లాడుతున్నాయి. ముఖ్యంగా నీటిలోనే ఎక్కువగా సేదతీరే హిప్పోపోటమస్ ల గుంపులు ఎండిన కుంటల్లో చిక్కుకుపోయాయి. ఎల్ నినో వాతావరణ పరిస్థితుల కారణంగా బోట్స్ వానాలో కరవు తాండవిస్తోంది. వర్షాలు లేక పంటల దిగుబడి దెబ్బతినడంతో లక్షలాది మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఆఫ్రికాలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న చాలా దేశాలు ఇప్పటికే అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి. ఉత్తర బోట్స్ వానాలో చిత్తడి నేలలతో కూడిన ఒకవాంగో డెల్టా సమీపంలో ప్రవహించే తమలాకేన్ నది ఎండిపోయింది. దీంతో అక్కడి హిప్పోల గుంపులు పర్యాటక పట్టణమైన మౌన్ కు క్యూ కట్టాయి. నది ఎండిపోవడంతో జంతువుల పరిస్థితి దారుణంగా ఉందని బోట్స్ వానా రాజధాని గబరోన్ లో ఉన్న వన్యప్రాణి, జాతీయ పార్కుల శాఖ ప్రతినిధి లెసెగో మొసెకి తెలిపారు. బోట్స్ వానా హిప్పోలకు పుట్టినిల్లు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రాణాలకు తెగించి 50 మంది ప్రాణాలు కాపాడిన బాలుడు
అమెరికా పోలీసులు మళ్లీ అదే తీరు.. మరో నల్లజాతీయుడు మృతి
ఇకపై ఏటా రెండు సార్లు సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

