ప్రాణాలకు తెగించి 50 మంది ప్రాణాలు కాపాడిన బాలుడు

ఆపదలో ఉన్నవారిని రక్షించడానికి వయసుతో సంబంధం లేదని, కాపాడాలనే సంకల్పం, ధైర్యం ఉంటే చాలని నిరూపించాడు ఓ విద్యార్ధి. సమయస్పూర్తితో వ్యవహరించి ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకున్న 50 మందిని ప్రాణాలకు తెగించి రక్షించాడు. బాలుడి ధైర్యానికి అందరూ హ్యాట్సాఫ్‌ అంటూ ప్రశంసలుకురిపించారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని అలెన్‌ హెర్బల్‌ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

ప్రాణాలకు తెగించి 50 మంది ప్రాణాలు కాపాడిన బాలుడు

|

Updated on: Apr 28, 2024 | 6:50 PM

ఆపదలో ఉన్నవారిని రక్షించడానికి వయసుతో సంబంధం లేదని, కాపాడాలనే సంకల్పం, ధైర్యం ఉంటే చాలని నిరూపించాడు ఓ విద్యార్ధి. సమయస్పూర్తితో వ్యవహరించి ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకున్న 50 మందిని ప్రాణాలకు తెగించి రక్షించాడు. బాలుడి ధైర్యానికి అందరూ హ్యాట్సాఫ్‌ అంటూ ప్రశంసలుకురిపించారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని అలెన్‌ హెర్బల్‌ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమను ఆనుకుని నూతనంగా నిర్మిస్తున్న షెడ్డులో వెల్డింగ్‌ పనులు జరుగుతుండగా.. మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాద సమయంలో కంపెనీలో సుమారు 300 మంది కార్మికులు ఉన్నారు. మంటలు అంటుకోగానే ప్రాణ భయంతో చాలా మంది బయటకు పరుగులు తీశారు. దట్టమైన పొగ కమ్మేయడంతో ఎటూ వెళ్లలేక సుమారు 50 మంది వరకు లోపలే చిక్కుకుపోయారు. దీంతో అక్కడ ఆందోళనకర పరిస్థితి నెలకొంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమెరికా పోలీసులు మళ్లీ అదే తీరు.. మరో నల్లజాతీయుడు మృతి

ఇకపై ఏటా రెండు సార్లు సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు

భారీ వ‌ర్షాల‌కు 155 మంది మృతి !! ఎక్కడంటే ??

మీ మొబైల్ పోయిందా ?? అయితే సుడాన్ వెళ్ళిపోయి ఉంటుంది

ప్రపంచంలోని 50 ఉత్తమ వంటకాల్లో 9 భారతీయ వంటకాలు

Follow us
Latest Articles