US Car Accident: రోడ్డుపై పల్టీలు కొట్టి చెట్టుపై ఇరుక్కుపోయిన కారు! ముగ్గురు భారత మహిళలు మృతి

అమెరికాలోని సౌత్‌ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు గుజరాత్‌ మహిళలు మరణించారు. మృతులాందరూ గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాకు చెందిన వారుగా స్థానిక అధికారులు తెలిపారు. మృతులను రేఖాబెన్ పటేల్‌, సంగీతాబెన్ పటేల్, మనీశాబెన్ పటేల్..గా గుర్తించారు. వారు ప్రయాణిస్తున్న SUVకారు సౌత్ కరోలినాలోని గ్రీన్‌విల్లే కౌంటీలోని ఒక వంతెనపైకి దూసుకెళ్లి..

US Car Accident: రోడ్డుపై పల్టీలు కొట్టి చెట్టుపై ఇరుక్కుపోయిన కారు! ముగ్గురు భారత మహిళలు మృతి
US Car Accident
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 28, 2024 | 6:39 AM

సౌత్‌ కరోలినా, ఏప్రిల్ 28: అమెరికాలోని సౌత్‌ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు గుజరాత్‌ మహిళలు మరణించారు. మృతులాందరూ గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాకు చెందిన వారుగా స్థానిక అధికారులు తెలిపారు. మృతులను రేఖాబెన్ పటేల్‌, సంగీతాబెన్ పటేల్, మనీశాబెన్ పటేల్..గా గుర్తించారు. వారు ప్రయాణిస్తున్న SUVకారు సౌత్ కరోలినాలోని గ్రీన్‌విల్లే కౌంటీలోని ఒక వంతెనపైకి దూసుకెళ్లి.. పలుమార్లు పల్టీలు కొడుతూ చెట్లలో ఇరుక్కుపోయింది. అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. గ్రీన్‌విల్లే కౌంటీ కరోనర్స్ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం..

హైవేపై ప్రయాణిస్తున్న ఎస్‌యూవీ కారు రహదారిపై పలుమార్లు పల్టీ కొడుతూ చెట్లపైకి ఎగిరిపడింది. అనంతరం చెట్లలోనే కారు కూడా ఇరుక్కుపోయింది. ఆ సమయంలో కారు సుమారు 20 అడుగుల ఎత్తుకు గాల్లోకి లేచినట్లు అధికారులు తెలిపారు. వారు ప్రయాణిస్తున్న కారు పరిమితికి మించి అతి వేగంతో దూసుకొచ్చిందని చీఫ్ డిప్యూటీ కరోనర్ మైక్ ఎల్లిస్ మీడియాకు తెలిపారు. ఈ ఘటనలో ఇతర వాహనాల ప్రమేయం లేదని ఆయన స్పష్టం చేశారు. చెట్టుపై ఇరుక్కుపోయిన కారు ముక్కలు ముక్కలై ఛిద్రమై ఉండటాన్ని బట్టి ప్రమాద తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. అతి వేగంతో 4-6 లేన్ల ట్రాఫిక్‌ను జంప్‌ చేయడం, 20 అడుగుల ఎత్తుకు ఎగిరి చెట్లపైకి దూసుకపోవడం.. ఇలాంటి ప్రమాదాలు చాలా అరుదుగా జరుగుతుంటాయని అధికారులు తెలిపారు.

సౌత్ కరోలినా హైవే పెట్రోల్, గాంట్ ఫైర్, రెస్క్యూ, గ్రీన్‌విల్లే కౌంటీ ఈఎమ్‌ఎస్‌ యూనిట్‌లతో సహా సలు రెస్క్యూ టీంలు హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనలో కారులో ఉన్న ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.