AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kota Student Suicides: కోటాలో మరో సూసైడ్.. ఈ ఏడాది ఇప్పటి వరకూ 9 మంది మృతి!

హర్యానా రోహ్‌తక్‌కు చెందిన సుమిత్‌ (20) అనే విద్యార్థి రాజస్థాన్‌లోని కోటాలో గత ఏడాది కాలంగా కున్హాడి ల్యాండ్‌మార్క్‌ సిటీలో ఉన్న ఓ హాస్టల్‌లో ఉంటూ నీట్‌ పరీక్షకు సన్నద్ధమవుతున్నాడు. అక్కడే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్‌లో నీట్ పరీక్ష ప్రిపరేషన్‌లో భాగంగా తరగతులకు హాజరవుతున్నాడు. ఈ క్రమంలో ఏం జరిగిందో తెలియదు గానీ ఆదివారం సాయంత్రం హాస్టల్‌లోని తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి..

Kota Student Suicides: కోటాలో మరో సూసైడ్.. ఈ ఏడాది ఇప్పటి వరకూ 9 మంది మృతి!
Kota Student Suicides
Srilakshmi C
|

Updated on: Apr 29, 2024 | 6:09 PM

Share

కోటా, ఏప్రిల్ 29: దేశంలో ప్రముఖ కోచింగ్‌ హబ్‌ రాజస్థాన్‌లోని కోటాలో మరో విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నీట్ పరీక్షకు సన్నద్ధమవుతోన్న విద్యార్ధి ఒత్తిడి తట్టుకోలేక గదిలో ఉరి పెట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఏడాది ఇది తొమ్మిదో ఆత్మహత్య కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. వివరాల్లోకెళ్తే..

హర్యానా రోహ్‌తక్‌కు చెందిన సుమిత్‌ (20) అనే విద్యార్థి రాజస్థాన్‌లోని కోటాలో గత ఏడాది కాలంగా కున్హాడి ల్యాండ్‌మార్క్‌ సిటీలో ఉన్న ఓ హాస్టల్‌లో ఉంటూ నీట్‌ పరీక్షకు సన్నద్ధమవుతున్నాడు. అక్కడే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్‌లో నీట్ పరీక్ష ప్రిపరేషన్‌లో భాగంగా తరగతులకు హాజరవుతున్నాడు. ఈ క్రమంలో ఏం జరిగిందో తెలియదు గానీ ఆదివారం సాయంత్రం హాస్టల్‌లోని తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సుమిత్‌ కుటుంబ సభ్యులు సుమిత్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వకపోవడంతో హాస్టల్‌ వార్డెన్‌కు ఫోన్‌ చేశారు. దీంతో హాస్టల వార్డెన్‌ సుమిత్‌ గది తలుపు ఎన్నిసార్లు తట్టినా స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన హాస్టల్‌ వార్డెన్‌ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హాస్టల్‌కు చేరుకుని గది తలుపులు పగలగొట్టి చూడగా సుమిత్‌ ఫ్యాన్‌కు విగత జీవిగా వేలాడుతూ కనిపించాడు.

పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. మృతుడి తల్లిదండ్రులు వచ్చిన తర్వాత పోస్టుమార్టం నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుమిత్‌ మృతికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. గత నెలలో కోటాలోని మరో హాస్టల్‌లో లక్నోకు చెందిన 19 యేళ్ల సౌమ్య అనే విద్యార్ధిని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. నీట్‌కు సిద్ధమవుతున్న మరో విద్యార్థి ఉరుజ్ ఖాన్ మార్చి 25న కోటలోని ఓ అద్దె గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. ఇలా ఈ ఏడాది సుమిత్‌తో కలిపి మొత్తం తొమ్మిది మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. గతేడాది నీట్‌కు సిద్ధమవుతున్న సమయంలో కోటాలో 29 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. కాగా కోటాలో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. చదువు ఒత్తిడి, వ్యక్తిగత కారణాలతో విద్యార్థులు వరుస ఆత్మహత్యలకు పాల్పడి కన్నోళ్లకు కడుపుకోత మిగులుస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు దెబ్బతింటాయి జాగ్రత్త..
చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు దెబ్బతింటాయి జాగ్రత్త..
నిధి పాపని పెళ్లి చేసుకోవాలంటే ఎలా ఉండాలి.. ?
నిధి పాపని పెళ్లి చేసుకోవాలంటే ఎలా ఉండాలి.. ?
గౌతమ్ గంభీర్ ఎఫెక్ట్‌తో గజగజ వణికిపోతున్న టీమిండియా ఆటగాళ్లు..?
గౌతమ్ గంభీర్ ఎఫెక్ట్‌తో గజగజ వణికిపోతున్న టీమిండియా ఆటగాళ్లు..?
లీటరుకు 28.65 కి.మీ.. ఈ 10 హైబ్రిడ్‌ కార్ల గురించి మీకు తెలుసా?
లీటరుకు 28.65 కి.మీ.. ఈ 10 హైబ్రిడ్‌ కార్ల గురించి మీకు తెలుసా?
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ