PM Modi: సామాన్యురాలి స్వచ్ఛ భారత్ స్ఫూర్తికి ఫిదా.. స్వయంగా ప్రశంసించిన ప్రధాని మోదీ..
స్వచ్ఛభారత్ ఉద్యమానికి అంకురార్పణ చేసి, చైతన్యం తీసుకువస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..ఒక సామాన్యురాలిని అభినందించారు. ఎవరూ చెప్పకున్నా, స్వచ్ఛభారత్‌లో తన వంతు ఆ మహిళ కృషి చేయడమే ఇందుకు కారణం. కర్నాటకలో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ పండ్లు అమ్ముకునే మహిళను కలిసి అభినందించారు.
స్వచ్ఛభారత్ ఉద్యమానికి అంకురార్పణ చేసి, చైతన్యం తీసుకువస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..ఒక సామాన్యురాలిని అభినందించారు. ఎవరూ చెప్పకున్నా, స్వచ్ఛభారత్‌లో తన వంతు ఆ మహిళ కృషి చేయడమే ఇందుకు కారణం. కర్నాటకలో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ పండ్లు అమ్ముకునే మహిళను కలిసి అభినందించారు. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా సిర్సీలో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ వద్దకు వచ్చిన మోహిని గౌడను కలిసి ప్రధాని మోదీ ఆప్యాయంగా మాట్లాడారు.
మోహినీ గౌడ.. కర్నాటకలోని అంకోలా బస్టాండ్‌లో ఫ్రూట్స్ అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తోంది. తన కస్టమర్లకు అమ్మే పండ్లను ప్లాస్టిక్ కవర్లకు బదులుగా ఆకులలో చుట్టి ఇస్తోంది. అలా ఆమె దగ్గర పండ్లు కొన్నవారు వాటిని తిన్న తర్వాత వాటితో పాటు ఇస్తున్న ఆకులను అలాగే బస్టాండ్‌లో ఎక్కడపడితే అక్కడ పారేస్తున్నారు. అది గమనించిన ఆమె వాటిని సేకరించి తీసుకెళ్లి చెత్తబుట్టలో వేస్తుంది.
వీడియో చూడండి..
అది ఆమె పని కాదు. అయినా ఆమె ఒక బాధ్యతగా ఆపని చేస్తోంది. ఈ మహిళను పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మెచ్చుకోగా.. ఇప్పుడు తాజాగా ప్రధాని మోదీ ఆమెను కలిసి అభినందించారు..
పిఎం మోడీ స్వచ్ఛ భారత్ విజన్‌కి ప్రజలు చేసే ఇటువంటి పనులు ఇతరులకు కూడా ప్రేరణ కలిగించే శక్తిగా పనిచేస్తాయంటూ పలువురు ప్రముఖులు పేర్కొంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..