AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: నదిలో వేటకు వెళ్లి వల వేసిన జాలర్లు.. అందులో చిక్కింది చూసి షాక్

ఎప్పట్లానే వారు నదిలో చేపల వేటకు వెళ్లారు. వలలో ఓ మాదిరిగా చేపలు పడ్డాయి. ఈ పూటకి పర్లేదులే అనుకున్నారు. అయితే పడ్డ చేపల్ని గ్రేడింగ్ చేస్తుండగా.. అందులో ఓ ప్రమాదకర ఫిష్ కనిపించింది. అదేంటి..? దానితో డేంజర్ ఏంటి తెలుసుకుందాం పదండి....

Viral: నదిలో వేటకు వెళ్లి వల వేసిన జాలర్లు.. అందులో చిక్కింది చూసి షాక్
Devil Fish
Ram Naramaneni
|

Updated on: Apr 29, 2024 | 6:45 PM

Share

అది మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లోని కసరి నది పరీవాహక ప్రాంతం. సునీల్ జాదవ్, అనిల్ జాదవ్, కృష్ణ సత్పుటే ఈ ప్రాంతంలో చేపల వ్యాపారం చేస్తూ పొట్ట పోసుకుంటున్నారు. తాజాగా కసరి నదిలో చేపల వేటకు వెళ్లిన వారు.. వలలో చిక్కిన చేపను చూసి కంగుతిన్నారు. ఎందుకంటే.. అదేదో తినే చేప లేదా మెడిసిన్ కోసం ఉపయోగించే చేప కాదు. ప్రమాదకర సక్కర్ ఫిష్. దాన్నే దెయ్యం చేప అని కూడా అంటారు. ఈ చేప ఏదైనా చెరువు లేదా సరస్సులోకి ఎంట్రీ ఇచ్చిందంటే.. మిగతా జాతి చేపలన్నీ సర్వనాశనం. వెంటాడి వేటాడి చంపేస్తాయ్.

కొరమేను, శీలావతి, బొమ్మిడాయి, బొచ్చ, పండుగప్ప ఈ టైపు చేపలు కావివి. టోటల్‌ డిఫరెంట్. ఒంటిపైన పొలుసులు ఉండవు. చారలు మాత్రమే ఉంటాయి. నోరు కూడా ముందు భాగంలో ఉండదు.. గదువ భాగాన ఉంటుంది. ఆకారం కూడా మిగతా చేపల్లా ఉండదు.. విమానాన్ని పోలి ఉంటుంది. ఒంట్లో మాంసం ఉండదు.. రాయిలా ఉండే బోన్స్ ఇరువైపులా ఉంటాయి. వాడుక భాషలో చేపల రైతులు వీటిని డెవిల్ ఫిష్‌, విమానం ఫిష్ అని పిలుస్తుంటారు. వన్స్‌ ఇది ఎంటర్ అయితే డెవిల్‌ ఫిష్ తన సంతానాన్ని వంద రెట్లు పెంచేసుకుంటుంది. మాంసం పెడితే నలనలా నమిలేస్తుంది. రాళ్లనైనా జీర్ణం చేసుకునే శక్తి దీనిది. ఆక్సిజన్‌ స్థాయి తక్కువగా ఉన్నా జీవిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే డెవిల్‌ ఫిష్.. జగమొండిది. భూమి పొరల్లోకి వెళ్లిపోతుంది. ఈ గట్టు నుంచి ఆ గట్టులోకి సునాయాసంగా దూరిపోతుంది. డెవిల్ పిష్ తరహా చేపలు ఎక్వేరియంలలో కనిపిస్తాయి. ఇవి కేవలం ఏదో అట్రాక్షన్ కోసమే పనికొస్తాయి. ఇవి తినడానికి పనికిరావు. పైగా మిగతా చేపలను ఎదగనీయవు. అందుకే ఈ తరహా చేపలు ఎవరూ పెంచరు.

సక్కర్‌ చేప హోంనివారిస్‌కు చెందిందిగా మత్స్య శాఖ అధికారులు చెబుతున్నారు. దీని శాస్త్రీయ నామం హైపోస్తోమస్‌ క్లిపికోస్తోమస్‌. నార్త్‌ అమెరికాలో దీన్ని ఆక్వేరియంలలో పెంచుతారు. ఆక్వేరియం అద్దాలకు పెట్టే పాచి తింటూ ఇవి బతికేస్తాయి. అయితే ఉద్యోగుల బదిలీల సమయంలో, ఆక్వేరియంలు తీసేసినపుడు ఇలాంటి చేపలను కాలువలో పడేయడంతో ఇవి కాలువల్లో చేరి తమ సంతతిని వృద్ధి చేసుకుంటున్నాయి. నదుల్లోకి, పంట కాలువల్లోకి చేరి, ఆ తర్వాత చెరువుల్లో చేరుతున్నాయి. ఒంటి నిండా మచ్చలు, తల పైభాగంలో కళ్లు ఉండటంతో పాటు పళ్లు చాలా పదునుగా ఉండటంతో వీటిని నాశనం చేసే మందును ఇప్పటి వరకు కనిపెట్టలేదంటున్నారు మత్స్యశాఖ అధికారులు. ఇవి ఇతర చేపల గుడ్లను, చేపలను అలవోకగా మింగేస్తాయి. అలానే ఇవి తినడానికి కూడా పనికిరావు. దీంతో ఈ చేప ఎక్కడ కనిపించినా మత్స్యకారులు, ఆక్వా రైతులు ఆందోళన చెందుతూ ఉంటారు. (Source)

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారీకి సూపర్‌ ట్రిక్‌.. ఇలా చేశారంటే..
ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారీకి సూపర్‌ ట్రిక్‌.. ఇలా చేశారంటే..
మొన్నటి వరకు స్టార్ హీరోయిన్..ఇప్పుడు IPS ఆఫీసర్
మొన్నటి వరకు స్టార్ హీరోయిన్..ఇప్పుడు IPS ఆఫీసర్
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో కొత్త రూల్స్.. ఆ టికెట్లు ఉండవ
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో కొత్త రూల్స్.. ఆ టికెట్లు ఉండవ
మేడారం మహా జాతరకు బస్ ఛార్జీలు ఖరారు.. ఇలా చేస్తే ఇంటికే ‘బంగారం’
మేడారం మహా జాతరకు బస్ ఛార్జీలు ఖరారు.. ఇలా చేస్తే ఇంటికే ‘బంగారం’
4 కారణాల వల్లే కోటాను కోట్లు పోగొట్టుకున్నా..!
4 కారణాల వల్లే కోటాను కోట్లు పోగొట్టుకున్నా..!