AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: సోఫాలో కూర్చొని బైక్ డ్రైవ్ చేస్తే.. అదొక కల కదా! ఆ కలను నిజం చేశారు చూడండి..

ఓ ఇద్దరు వ్యక్తులు ఓ భారీ సోఫాను వారి ఈ-స్కూటర్లపై పెట్టుకొని ఎంచక్కా వెళ్లిపోయారు. ఇదే ఇప్పుడు ఆన్ లైన్లో ట్రెండింగ్ లో ఉంది. వాస్తవానికి ఒకరు వెళ్లడానికి మాత్రమే అవకాశం ఉన్న ఆ స్కూటర్లపై ఏకంగా అతి పెద్ద సోఫాను జస్ట్ అలా పెట్టేసి చాలా క్యాజువల్ గా వెళ్లిపోవడం వండర్ అని ఆ వీడియో చూసిన వాళ్లు కామెంట్ చేస్తున్నారు.

Viral Video: సోఫాలో కూర్చొని బైక్ డ్రైవ్ చేస్తే.. అదొక కల కదా! ఆ కలను నిజం చేశారు చూడండి..
Sofa On Electric Scooter
Madhu
|

Updated on: May 16, 2024 | 4:46 PM

Share

‘వేర్ ధేర్ ఈజ్ ఏ విల్ ధేర్ ఈజ్ ఏ వే’ అంటే చేయాలనే సంకల్పం ఉండాలే గానీ ప్రతి దానికి ఏదో ఒక మార్గం ఉంటుంది అని అర్థం. ఇది అందరికీ తెలిసిన సామెతే. ఎవరైనా ఈ పని కష్టం.. ఇది చేయలం అంటున్న సమయంలో దీనిని వినియోగిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఎందుకు దీనిని ప్రస్తావించామంటే.. ఆన్ లైన్లో ఇటీవల ఓ వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో ఏముందా అని వెతికితే.. ఓ ఇద్దరు వ్యక్తులు ఓ భారీ సోఫాను వారి ఈ-స్కూటర్లపై పెట్టుకొని ఎంచక్కా వెళ్లిపోయారు. ఇదే ఇప్పుడు ఆన్ లైన్లో ట్రెండింగ్ లో ఉంది. వాస్తవానికి ఒకరు వెళ్లడానికి మాత్రమే అవకాశం ఉన్న ఆ స్కూటర్లపై ఏకంగా అతి పెద్ద సోఫాను జస్ట్ అలా పెట్టేసి చాలా క్యాజువల్ గా వెళ్లిపోవడం వండర్ అని ఆ వీడియో చూసిన వాళ్లు కామెంట్ చేస్తున్నారు. ఆ ఇద్దరు యువకులు అద్భుతమే సృష్టించారని మాట్లాడుతున్నారు.

ఆ వీడియో ఇక్కడిది అంటే..

ఇద్దరు యువకులు తమ ఎలక్ట్రిక్ స్కూటర్లపై పెద్ద సోఫాను తరలిస్తున్న వీడియోను ప్రముఖ అమెరికన్ గాయని, పాటల రచయిత లిరికా ఆండర్సన్ ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. దానికి ఓ క్యాప్షన్ ఇచ్చారు ‘ఈ ఇద్దరు వ్యక్తులు స్కూటర్‌లపై భారీ సోఫాని తరలిస్తున్నారు. నైస్ వర్క్ మిత్రులారా! నేను నిన్ను ఎలా నియమించుకోగలను’ అంటూ ఇమోజీలు యాడ్ చేశారు. ఐదు రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియో ఆన్‌లైన్ లో దూసుకెళ్లిపోతోంది. ఇప్పటికే 4.7 మిలియన్ల వ్యూస్ సంపాదించింది. ఇక కామెంట్లలోనూ నెటిజెనులు చాలా ఆసక్తి చూపుతున్నారు. ఆ కామెంట్ల సెక్షన్ నిజంగా ఓ యుద్ధభూమిలాగే మారింది. కౌంటర్లు, రివర్స్ కౌంటర్లు, కామెంట్లతో ఆ వీడియో ఆన్ లైన్ ను ఊపేస్తోంది.

ఆసక్తి కలిగించిన కొందరి కామెంట్లను చూద్దాం..

“నేను నా సహధర్మచారిణిని కనుగొన్నప్పుడు మేము ఇలాగే వెళ్తాము” అని ఒక వినియోగదారు చమత్కరించారు. మరొకరు కుర్రాళ్ల నైపుణ్యాలను ప్రశంసించారు. ఏ సమస్య వచ్చినా దానికి ఓ పరిష్కారం ఉంటుందన్న దానికి ఇదే నిదర్శనమని చెప్పుకొచ్చారు. “ఓహ్, నేను ఖచ్చితంగా వారిని ఏదో ఒక పని కోసం నియమించుకోవాలి…” అని ఒక వ్యక్తి అభిప్రాయపడ్డాడు. ప్రతిస్పందనలలో, చాలా మంది వినియోగదారులు వారి అసాధారణ అంచనాలను హైలైట్ చేశారు. “వారు సోఫాలో కూర్చుని పారిపోతారని ఇంకెవరు అనుకున్నారు?” ఒక వినియోగదారుని ప్రశ్నించగా మరొకరు తెలివిగా “నన్ను బాస్ లాగా మధ్యలో కూర్చోనివ్వండి” అని రాశారు. సోఫాలో కూర్చుని స్కూటర్ నడపాలని నేను ఎదురు చూస్తున్నాను..” అని ఒక పరిశీలకుడు చమత్కరించాడు. “సోఫా మీద కూర్చున్న మూడో వ్యక్తి తాను అయివుండాలి” అని ఒక వ్యాఖ్యాత ఆశపడుతున్నట్లు వెల్లడించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..