AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office Scheme: ఆ పోస్టాఫీస్ పథకంలో నెలనెలా రూ.500 పెట్టుబడితో రూ.4 లక్షల రాబడి.. పెట్టుబడి సమయంలో జాగ్రత్తలు మస్ట్

దాయానికి అనుగుణంగా మీరు ఏ పెట్టుబడిని ప్రారంభించవచ్చు. ఎందుకంటే పెట్టుబడి మాత్రమే మీ డబ్బును పెంచుతుంది. మీరు డబ్బును ఆదా చేసి దానిని సురక్షితంగా ఉంచితే అనుకోని పరిస్థితుల్లో వెన్నుదన్నుగా ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారిని పొదుపు మార్గంలో ఉండేలా చేసేందుకు ఇండియన్ పోస్ట్ ఆఫీస్‌లో అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి.

Post Office Scheme: ఆ పోస్టాఫీస్ పథకంలో నెలనెలా రూ.500 పెట్టుబడితో రూ.4 లక్షల రాబడి.. పెట్టుబడి సమయంలో జాగ్రత్తలు మస్ట్
Post Office
Nikhil
| Edited By: Janardhan Veluru|

Updated on: May 16, 2024 | 6:55 PM

Share

భారతదేశంలో చాలా మంది భవిష్యత్ అవసరాలకు పెట్టుబడి మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో చాలా పెట్టుబడి పథకాలు పెట్టుబడిదారులకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఆదాయానికి అనుగుణంగా మీరు ఏ పెట్టుబడిని ప్రారంభించవచ్చు. ఎందుకంటే పెట్టుబడి మాత్రమే మీ డబ్బును పెంచుతుంది. మీరు డబ్బును ఆదా చేసి దానిని సురక్షితంగా ఉంచితే అనుకోని పరిస్థితుల్లో వెన్నుదన్నుగా ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారిని పొదుపు మార్గంలో ఉండేలా చేసేందుకు ఇండియన్ పోస్ట్ ఆఫీస్‌లో అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ప్రతి నెలా క్రమం తప్పకుండా కేవలం రూ.500 పెట్టుబడితో మంచి నిధిని సమూకర్చుకోవచ్చు. ఈ నేపథ్యంలో చిన్న పెట్టుబడితో మంచి రాబడినిచ్చే పోస్టాఫీస్ పథకాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

పీపీఎఫ్ 

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే పీపీఎఫ్ అనేది దీర్ఘకాలిక పథకం. ఈ పథకంలో  సంవత్సరానికి కనిష్టంగా రూ. 500, గరిష్టంగా రూ. 1.5 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. ఇలా దాదాపు 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. మీకు కావాలంటే, మెచ్యూరిటీ తర్వాత, మీరు 5 సంవత్సరాల బ్లాక్‌లో ఖాతాను పొడిగించవచ్చు. మీరు ఈ పథకంలో ప్రతి నెలా రూ. 500 ఇన్వెస్ట్ చేస్తే మీరు ఏటా రూ. 6,000 ఇన్వెస్ట్ చేస్తారు. ప్రస్తుతం పీపీఎఫ్‌పై 7.1 శాతం వడ్డీ ఇస్తోంది. అటువంటి పరిస్థితిలో, ఈ పథకంలో ప్రతి నెలా రూ. 500 డిపాజిట్ చేయడం ద్వారా, మీరు 7.1 శాతం వడ్డీతో 15 సంవత్సరాలలో రూ. 1,62,728 జోడించవచ్చు. 5.5 ఏళ్లు పొడిగిస్తే 20 ఏళ్లలో రూ.2,66,332, 25 ఏళ్లలో రూ.4,12,321 జోడించవచ్చు.

ఎస్ఎస్‌వై 

మీకు ఓ కుమార్తె ఉంటే మీ కుమార్తె పేరు మీద సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ప్రభుత్వ పథకంలో ఏటా కనీసం రూ.250, గరిష్టంగా రూ.1.5 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. ప్రస్తుతం దానిపై 8.2 శాతం వడ్డీ ఇస్తోంది. మీరు ఈ పథకంలో 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలి. 21 సంవత్సరాల తర్వాత పథకం మెచ్యూర్ అవుతుంది. ఇందులో నెలకు రూ.500 ఇన్వెస్ట్ చేస్తే 15 ఏళ్లలో మొత్తం రూ.90,000 ఇన్వెస్ట్ చేస్తే 8.2 శాతం వడ్డీతో 21 ఏళ్ల తర్వాత రూ.2,77,103 పొందుతారు.

ఇవి కూడా చదవండి

రికరింగ్ డిపాజిట్

పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ అంటే పోస్ట్ ఆఫీస్ ఆర్‌డీ పథకంలో ప్రతి నెలా నిర్ణీత మొత్తం పెట్టుబడి పెట్టాలి. ఈ పథకం చిన్న పెట్టుబడిదారులకు వారి భవిష్యత్ అవసరాలను తీర్చడానికి కార్పస్‌ను రూపొందించడంలో సహాయపడుతుంది. ఇందులో ఇన్వెస్ట్‌మెంట్‌ను రూ. 100తో కూడా ప్రారంభించవచ్చు. ఒకసారి మీరు ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించిన తర్వాత మీరు 5 సంవత్సరాల పాటు నిరంతరం పెట్టుబడి పెట్టాలి. ప్రస్తుతం ఈ పథకంలో వడ్డీ రేటు 6.7 శాతంగా ఉంది. ఈ పథకంలో ప్రతి నెలా రూ. 500 ఇన్వెస్ట్ చేస్తే మీరు 5 సంవత్సరాలలో రూ. 30,000, 5 సంవత్సరాల తర్వాత మీకు 6.7 శాతం చొప్పున రూ.35,681 అంటే వడ్డీగా రూ. 5,681 పొందుతారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..