TCS CEO Salary: వామ్మో.. టీసీఎస్ CEO జీతం ఎంతో తెలుసా? ఆయన కంటే COO జీతం ఎక్కువ..!

ఐటీ కంపెనీల్లో పనిచేసే సాధారణ ఉద్యోగుల జీతాలే కాదు.. ఆ కంపెనీల మేనేజ్‌మెంట్లలో కీలక బాధ్యతలు నిర్వహించే వారు కూడా భారీ జీతాలు అందుకుంటున్నారు. దేశంలోని దిగ్గజ ఐటీ సర్వీసెస్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ (TCS) సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ కే కృతివాసన్ గత ఆర్థిక సంవత్సరంలో భారీగా జీతభత్యాలు అందుకున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆయన..

TCS CEO Salary: వామ్మో.. టీసీఎస్ CEO జీతం ఎంతో తెలుసా? ఆయన కంటే COO జీతం ఎక్కువ..!
TCS
Follow us
Janardhan Veluru

|

Updated on: May 09, 2024 | 2:49 PM

ఐటీ కంపెనీల్లో పనిచేసే సాధారణ ఉద్యోగుల జీతాలే కాదు.. ఆ కంపెనీల మేనేజ్‌మెంట్లలో కీలక బాధ్యతలు నిర్వహించే వారు కూడా భారీ జీతాలు అందుకుంటున్నారు. దేశంలోని దిగ్గజ ఐటీ సర్వీసెస్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ (TCS) సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ కే కృతివాసన్ గత ఆర్థిక సంవత్సరంలో భారీగా జీతభత్యాలు అందుకున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ.25.4 కోట్ల జీతాన్ని పొందారు. అంటే నెలసరి జీతం రూ.2 కోట్ల పైమాటే. 2023 జూన్ 1 తేదీన కృతివాసన్ టీసీఎస్ సీఈవో, ఎండీగా బాధ్యతలు చేపట్టారు.అంతకు ముందు 2023 ఏప్రిల్ 1 నుంచి 2023 మే 31 వరకు ఆ కంపెనీకి బ్యాంకింగ్, ఫినాన్సియల్ సర్వీసెస్, ఇన్స్యూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) గ్లోబల్ హెడ్‌గా ఉన్నారు. ఈ సేవలను కలుపుకుని.. జూన్ 1, 2023 నుంచి మార్చి 31, 2024 వరకు సీఈవో, ఎండీగా పనిచేసినందుకు కృతివాసన్ రూ.25.4 కోట్ల జీతాన్ని పొందారు. వాస్తవానికి ఆ కంపెనీ మాజీ సీఈవో రాజేశ్ గోపినాథ్ జీతంతో పోల్చితే కృతివాసన్ జీతం తక్కువే. 2022-23 ఆర్థిక సంవత్సరానికి టీసీఎస్ సీఈవోగా ఉన్న రాజేశ్ గోపినాథ్ 29.16 కోట్ల జీతాన్ని పొందారు.

కాగా టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న ఎన్ గణపతి సుబ్రహ్మణ్యం 2023-24 ఆర్థిక సంవత్సరానికి 26.18 కోట్ల జీతాన్ని పొందారు. మునుపటి ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2023-24లో ఆయన జీతం 8.2 శాతం పెరిగింది. ఈ నెలతో ఆయన పదవీ విరమణ చేయనున్నారు.

ఉద్యోగుల జీతాల పెంపు ఇలా..

టీసీఎస్ వార్షిక రిపోర్ట్‌లోని వివరాల మేరకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్‌లో పనిచేసే మధ్యస్థ ఉద్యోగుల జీతాలు 10.8 శాతం పెరిగాయి. ప్రస్తుతం టీసీఎస్ కంపెనీ రోల్స్‌లో 6,01,546 మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారు. భారతదేశంలోని TCS ఉద్యోగులకు సగటు వార్షిక జీతం పెరుగుదల 5.5 శాతం నుండి 8 శాతం వరకు ఉండగా.. మంచి పనితీరును కనబర్చిన ఉద్యోగులు 10 శాతానికి పైగా జీతం పెంపును అందుకున్నారు.

భారతదేశం వెలుపల పనిచేస్తున్న ఉద్యోగులకు 1.5 శాతం నుండి 6 శాతం వరకు జీతాలు పెరిగాయని టీసీఎస్ కంపెనీ తెలిపింది. ఆయా దేశాల్లో మార్కెట్ ట్రెండ్స్‌కు అనుగుణంగా అక్కడ పనిచేసే తమ ఉద్యోగుల రెమ్యునరేషన్‌లో పెరుగుదల ఉంటుందని ఆ కంపెనీ వెల్లడించింది.

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి