AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Ideas: నెలకు రూ. 40 వేలు సంపాదన.! ఈ వ్యాపారం గురించి తెలిస్తే మతిపోవాల్సిందే..

ఈ మధ్యకాలంలో ఎంతోమంది పెద్ద పెద్ద డిగ్రీలు చేసినా కూడా.. ఇంట్లో ఖాళీగానే కూర్చుంటున్నారు.! జాబ్ కోసం ఎంత వెతికినా దొరకట్లేదు. మరి అలాంటివారి కోసమే ఈ ఐడియా.. రిస్క్ ఎక్కువ ఉండదు. మినిమం పెట్టుబడితో.. మాంచి లాభాలు సంపాదించవచ్చు. మీరు ఉంటున్న ప్లేస్ నుంచి.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

Business Ideas: నెలకు రూ. 40 వేలు సంపాదన.! ఈ వ్యాపారం గురించి తెలిస్తే మతిపోవాల్సిందే..
Money Making Tips
Ravi Kiran
|

Updated on: May 17, 2024 | 9:00 AM

Share

ఈ మధ్యకాలంలో ఎంతోమంది పెద్ద పెద్ద డిగ్రీలు చేసినా కూడా.. ఇంట్లో ఖాళీగానే కూర్చుంటున్నారు.! జాబ్ కోసం ఎంత వెతికినా దొరకట్లేదు. మరి అలాంటివారి కోసమే ఈ ఐడియా.. రిస్క్ ఎక్కువ ఉండదు. మినిమం పెట్టుబడితో.. మాంచి లాభాలు సంపాదించవచ్చు. మీరు ఉంటున్న ప్లేస్ నుంచి ఈ వ్యాపారాన్ని సులువుగా ప్రారంభించవచ్చు. సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. మరి ఆ డీటయిల్స్ ఇవిగో.. ఈ రోజుల్లో ఫుడ్ బిజినెస్‌కు ఎక్కువ డిమాండ్ ఉంది. ఐటీ కారిడార్లలో ఎక్కువగా పని చేశారు.. ఇంటి ఫుడ్ కంటే.. బయట.. జోమాటో లాంటి ఫుడ్ యాప్స్ ద్వారానే మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు. అందుకే అలాంటి ప్లేస్‌లో మీరు చపాతీలు, పరాటాలు ప్రిపేర్ చేసే ఫుడ్ సెంటర్ పెడితే.. మనకు అయ్యే ఖర్చు.. చాలా తక్కువ ఉంటుంది. గోధుమ పిండితో పరాటాలు.. ఇక వాటికీ తోడుగా ఆలుగడ్డ, ముల్లంగి, పనీర్, చికెన్, మటన్ కర్రీలను తయారు చేస్తే చాలు. మంచి రద్దీ ప్లేస్‌లో ఈ పరాటా ఫుడ్ స్టాల్‌.. బాగానే గిరాకీలు తెచ్చిపెడుతుంది.

ఈ ఫుడ్ స్టాల్‌కి మీకు కావాల్సిందల్లా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కనెక్షన్, ఆ తర్వాత పరాటాల తయారీకి కావాల్సిన సామాగ్రి అంతే.! ఇవన్నీ కలుపుకుని మీకు రూ. 25 వేల వరకు ఖర్చవుతుంది. ఇక ఒక పరాటా ధర రూ. 20 అనుకుంటే.. మీరు రోజుకు 100 అమ్మితే.. రూ. 2 వేల వరకు వస్తుంది. ఇక నాన్ వెజ్ పరాటాలైతే ఎక్స్‌ట్రా మనీ వస్తుంది. ఫుడ్ డెలివరీ యాప్స్ స్విగ్గీ, జోమాటోలతో ఒప్పందం కుదుర్చుకుంటే.. మీకు నెలనెలా ఆదాయం కూడా పెరుగుతుంది. అన్ని ఖర్చులుపోనూ దాదాపు నెలకు రూ. 50 వేలు వరకు సంపాదన వచ్చే అవకాశం ఉంది.