ఈ ఏనుగులు వెరీ స్మార్ట్ సుమీ.. క్రమ శిక్షణతో ట్రక్ ఎక్కిన వీడియో నెట్టింట్లో వైరల్

వైరల్ అవుతున్న వీడియోలో రెండు ఏనుగులు పూర్తి క్రమశిక్షణతో ట్రక్కు ఎక్కినట్లు కనిపిస్తుంది. ఈ వీడియోను గాయకుడు హరిహరన్ ఒక రోజు క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇప్పటివరకు 35,000 లైక్‌లు వచ్చాయి. కొంతమంది ఈ ఏనుగులను ప్రశంసించగా, కొన్ని ఏనుగులను తమ స్వలాభం కోసం పెంపడంపై తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. వన్యప్రాణుల సంరక్షణ అవసరం అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ ఏనుగులు వెరీ స్మార్ట్ సుమీ.. క్రమ శిక్షణతో ట్రక్ ఎక్కిన వీడియో నెట్టింట్లో వైరల్
Elephant Video Viral
Follow us
Surya Kala

|

Updated on: May 16, 2024 | 5:20 PM

భూమి మీద అతి పెద్ద జంతువు ఏనుగు. వీటి ప్రవర్తన మానవులకు దగ్గర సంబంధం ఉన్నాయి అనిపించేలా ఉంటుంది. ఏనుగులు మంచి జ్ఞాపకశక్తి ఉన్న జంతువులుగా ప్రసిద్ధి చెందాయి. దీనికి సరైన ఉదాహరణ ఇటీవల వైరల్ అవుతున్న వీడియో. ఇందులో రెండు ఏనుగులు పూర్తి క్రమశిక్షణతో ట్రక్కు ఎక్కినట్లు కనిపిస్తుంది. ఈ వీడియోను గాయకుడు హరిహరన్ ఒక రోజు క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇప్పటివరకు 35,000 లైక్‌లు వచ్చాయి. కొంతమంది ఈ ఏనుగులను ప్రశంసించగా, కొన్ని ఏనుగులను తమ స్వలాభం కోసం పెంపడంపై తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. వన్యప్రాణుల సంరక్షణ అవసరం అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

వీడియోలో మొదటి ఏనుగు లోడింగ్ ట్రక్కు ఎక్కేందుకు స్టూల్‌పైకి ఎక్కినట్లు కనిపిస్తుంది. తరువాత ట్రక్ లోపలి వెళ్లి ఒక పక్కకు నిల్చుంది. ఇక రెండవ ఏనుగు మృదువుగా స్టూల్‌పైకి ఎక్కి.. తర్వాత ట్రక్కుపైకి ఎక్కింది. తర్వాత రెండవ ఏనుగు తన ట్రంక్‌తో స్టూల్‌ని ఎత్తి లోడింగ్ ట్రక్కులో పక్కకు పెట్టింది. వైరల్ అవుతున్న ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన రావడం గమనార్హం. కొందరు దీనిని విమర్శిస్తుంటే, మరికొందరు జంతువుల తెలివితేటలను కూడా ప్రశంసిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

బాలీవుడ్ గాయకుడు పాపోన్ ఏనుగుల తెలివితేటలను ప్రశంసిస్తూ, “ఈ గ్రహం మీద అత్యంత తెలివైన జీవుల్లో ఒకటి!” అని వ్యాఖ్యానించారు. ఒక ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు పోస్ట్‌పై ఇలా రాశారు, “అద్భుతమైనది. ఇంగితజ్ఞానం మాత్రమే కాదు, ప్రతిభ కూడా కనిపిస్తుంది ఈ వీడియోలో.”

మరో వినియోగదారు పోస్ట్‌పై వ్యాఖ్యానిస్తూ ఏనుగులపై మనుషులు చేస్తున్న అకృత్యాలను పట్టించుకోనందుకు తన నిరాశను వ్యక్తం చేశారు. ఏనుగు తెలివితేటలను చూసి మనం ఆశ్చర్యపోవాలా లేక అవి హింసకు గురవుతున్నందుకు బాధపడాలా? అంటూ వ్యాఖ్యానించారు. మనుషులు కూడా హాయిగా కూర్చోవాలనుకుంటున్నారు.. అయితే మీ పేజీలో ఇలాంటి వీడియోను చూడటం తనకు బాధ కలిగించిందని పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..