- Telugu News Photo Gallery Travel India: Himachal pradesh chamba travel in summer season plan your trip
వేసవిని ప్రశాంతంగా ఎంజాయ్ చేయడానికి దేశ, విదేశాల నుంచి ఇక్కడకు పోటెత్తుతారు.. ఎందుకంటే
హిమాలయ పర్వతాలను అనుకుని ఉన్న ప్రకృతి కాన్వాస్ చిత్రించిన చిత్రం హిమాచల్ ప్రదేశ్. హిమపాతాలు, పర్వతాలతో అందమైన దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. శీతాకాలంలో మంచు అందాలను.. వేసవి కాలంలో చల్లదనం కోసం ఎక్కువ మంది పర్యటించడానికి ఇష్టపడే ప్రాతం. సిమ్లా-మనాలి చాలా మందికి తెలుసు. రవాణా సదుపాయాలు ప్రతి ప్రాంతానికి అందుబాటులోకి వచ్చిన తర్వాత దేశంలో తమకు నచ్చిన మనసు మెచ్చిన ప్రాంతాలను పర్యటించడానికి ప్రతి ఒక్కరూ ఆసక్తిని చూపిస్తున్నారు. ఢిల్లీ దాని పరిసర ప్రాంతాలలో నివసించే ప్రజలకు మాత్రమే కాదు.. ఆ సేతుహిమచల ప్రజలకు ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ అత్యంత ఇష్టమైన ప్రదేశం. ఇప్పుడు వేసవి సెలవులు ఉన్నాయి. దీంతో ప్రజలు ఇక్కడకు వెళ్ళడానికి, సరదాగా గడపడానికి ఆసక్తిని చూపిస్తారు.
Updated on: May 16, 2024 | 4:54 PM

వేసవి కాలంలో భారతీయ పర్యాటకులతో పాటు విదేశీయులు కూడా ఇక్కడికి వస్తుంటారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో ఇక్కడ హోటళ్లు కూడా అందుబాటులో లేవు. మీరు సెలవుల్లో హిమాచల్‌ను సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే చంబాను కూడా సందర్శించవచ్చు. ఎంజాయ్‌మెంట్‌తో పాటు ఎలాంటి సమస్యలు ఎదురుకాని ప్రదేశం ఇది.

చంబా ఎంత దూరం: నిజానికి చంబా హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక చిన్న పట్టణం. ఢిల్లీ నుంచి దీని దూరం 578 కి.మీ. సముద్ర మట్టానికి దీని ఎత్తు 1,006 మీటర్లు. ఇక్కడి అందమైన కొండలను చూసిన తర్వాత ప్రకృతి ప్రేమికులకు ఇక్కడి నుంచి ఎక్కడకు వెళ్ళాలని అనిపించదు.

ఖజ్జియార్ సరస్సు: ఖజ్జియార్ సరస్సు చిన్నదే అయినప్పటికీ చుట్టూ విస్తరించి ఉన్న పచ్చదనం ఈ ప్రాంత అందాన్ని మరింత పెంచుతుంది. ఇక్కడ ఖజ్జీ నాగ్ ఆలయాన్ని కూడా సందర్శించవచ్చు. ఈ దేవాలయం కారణంగానే దీనికి ఖజ్జియార్ సరస్సు అని పేరు వచ్చింది. ఖజ్జియార్‌ను భారతదేశంలోని 'మినీ స్విట్జర్లాండ్' అని కూడా పిలుస్తారు.

సాహసాలను ఇష్టపడేవారికి: ఎవరైనా సాహసాలను ఇష్టపడితే ఖచ్చితంగా సచ్ పాస్‌ని సందర్శించాలి. ఇక్కడ పర్వతాలపై బైకింగ్ చేయడం అతి పెద్ద సాహసం అని చెప్పవచ్చు. బైకింగ్ చేయడానికి ఆసక్తి ఉంటె అద్దెకు కూడా లభిస్తాయి. ఇక్కడ బైకింగ్ వినోదాన్ని ఇస్తుంది.

చంబా సందర్శించడానికి ఉత్తమ సీజన్: మార్చి నుంచి జూన్ వరకు చంబా సందర్శించడానికి ఉత్తమమైన సీజన్‌గా పరిగణించబడుతుంది. చలికాలంలో ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది. కొన్నిసార్లు హిమపాతం కూడా అందంగా కనిపిస్తుంది.

చంబా ఎలా చేరుకోవాలంటే: చంబాకు వెళ్లడానికి న్యూ ఢిల్లీ నుంచి అనేక బస్సులు అందుబాటులో ఉన్నాయి. కాశ్మీరీ గేట్‌కు వెళ్లవచ్చు, అక్కడి నుంచి బస్సులో 11 నుండి 12 గంటలలో చంబా చేరుకుంటారు. రైలులో వెళ్లాలనుకుంటే పఠాన్‌కోట్ ఇక్కడికి సమీప రైల్వే స్టేషన్ కు చేరుకోవచ్చు.





























