- Telugu News Photo Gallery Cricket photos Virat Kohli's Comments On Indian Football Legend Sunil Chhetri's Retirement Post
Virat Kohli-Sunil Chhetri: ‘నిన్ను చూసి గర్విస్తున్నా’.. స్నేహితుడి రిటైర్మెంట్‌పై కింగ్ కోహ్లీ
భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. జూన్ 6న కువైట్‌తో జరగనున్న మ్యాచ్‌తో అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతానని 39 ఏళ్ల ఛెత్రీ చెప్పాడు. దీనిపై సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసిన సునీల్ ఛెత్రి.. పలు విషయాలపై మాట్లాడాడు.
Updated on: May 16, 2024 | 5:15 PM

భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. జూన్ 6న కువైట్‌తో జరగనున్న మ్యాచ్‌తో అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతానని 39 ఏళ్ల ఛెత్రీ చెప్పాడు. దీనిపై సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసిన సునీల్ ఛెత్రి.. పలు విషయాలపై మాట్లాడాడు.

ముఖ్యంగా అరంగేట్రం మ్యాచ్ అనుభవాన్ని, ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు సునీల్. ఈ ఎమోషనల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సునీల్ ఛెత్రీ షేర్ చేసిన వీడియోపై టీమిండియా క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ స్పందించాడు. ' మై బ్రదర్, నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది' అంటూ హార్ట్ ఎమోజీ పెట్టాడు కోహ్లీ.

విరాట్ కోహ్లీ, సునీల్ ఛెత్రీ మంచి స్నేహితులు. గతంలో చాలాసార్లు వీరిద్దరూ కలిసి కనిపించారు. ముఖ్యంగా సునీల్ ఛెత్రీ ఐపీఎల్ చివరి సీజన్‌లో RCB క్యాంపులో పలు సార్లు కనిపించాడు.

ఈ సందర్భంగా మాట్లాడిన సునీల్ ఛెత్రి 'నేను కూడా బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్ ప్లేయర్‌నే. నేను BFCతో ఆడటం మొదలుపెట్టినప్పటి నుంచి RCBకి సపోర్ట్ చేస్తున్నాను. బెంగళూరు మన నగరం. బెంగళూరు జట్టు మాది కాదా అని నేను కూడా ఆర్‌సిబి అభిమానిని' అని చెప్పుకొచ్చా డు.