- Telugu News Photo Gallery Cinema photos Heroine Rashmika Mandanna praises Mumbai's Atal Setu bridge Telugu actress Photos
Rashmika Mandanna: రష్మిక వైరల్ స్టేట్‌మెంట్..! పాలిటిక్స్ ని టచ్ చేసిందా.?
రోమ్‌లో ఉంటే రోమన్‌లా ఉండమని అంటారు కదా.. ఇప్పుడు ఆ సక్సెస్‌ఫుల్ మంత్రాని ఇంప్లిమెంట్ చేసే పనిలో ఉన్నారు మేడమ్ రష్మిక మందన్న. నేషనల్ క్రష్ అనే ప్రీ ఫిక్స్ కి న్యాయం చేయాలని ఫిక్సయిపోయినట్టున్నారు మన శ్రీవల్లి. సౌత్ ఇండియాలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ ఇప్పుడు ముంబై వీధులను తెగ పొగిడేస్తున్నారు.. ఆమె మాటలన్నీ ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. యానిమల్ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అయ్యాక క్లౌడ్ నైన్‌లో ఉన్నారు రష్మిక.
Updated on: May 16, 2024 | 4:48 PM

రోమ్‌లో ఉంటే రోమన్‌లా ఉండమని అంటారు కదా... ఇప్పుడు ఆ సక్సెస్‌ఫుల్ మంత్రాని ఇంప్లిమెంట్ చేసే పనిలో ఉన్నారు మేడమ్ రష్మిక మందన్న. నేషనల్ క్రష్ అనే ప్రీ ఫిక్స్ కి న్యాయం చేయాలని ఫిక్సయిపోయినట్టున్నారు మన శ్రీవల్లి.

సౌత్ ఇండియాలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ ఇప్పుడు ముంబై వీధులను తెగ పొగిడేస్తున్నారు... ఆమె మాటలన్నీ ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. యానిమల్ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అయ్యాక క్లౌడ్ నైన్‌లో ఉన్నారు రష్మిక మందన్న.

ఇంతకు ముందు కర్ణాటక టు హైదరాబాద్ జర్నీ ఎక్కువగా ఉండేది ఈ బ్యూటీకి. కానీ ఇప్పుడు కర్ణాటక టు ముంబై ట్రావెల్ ఫ్రీక్వెంట్‌గా ఉంటోంది. అందుకే ముంబై వీధుల్లో జర్నీ గురించి, దానికి స్పెండ్ చేస్తున్న టైమ్ గురించి స్పెషల్‌గా మాట్లాడారు ఈ బ్యూటీ.

గతంలో ముంబై లో రెండు గంటల పాటు సాగిన జర్నీ ఇప్పుడు జస్ట్ 20 నిమిషాల్లో పూర్తవుతుందని ప్రశంసిస్తున్నారు రష్మిక. దీన్ని బట్టి ఆమె ముంబైలో ఎంత ఫ్రీక్వెంట్‌గా ట్రావెల్ చేస్తున్నారో ఊహించుకోవచ్చంటున్నారు నెటిజన్లు.

ముంబై అటల్ సేతు వల్ల... తగ్గిన ట్రావెల్ టైమ్‌ని గుర్తు చేస్తూ... ఇండియా అభివృద్ధి చెందుతుందని హ్యాపీనెస్‌ని షేర్ చేసుకున్నారు రష్మిక. నార్త్ లో ఆమె ప్రస్తుతం సల్మాన్‌ఖాన్ సినిమా సికిందర్‌లో నటిస్తున్నారు. సౌత్ కెప్టెన్ మురుగదాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా కోసం ఎలాగూ నార్త్ ట్రిప్‌లు తప్పవు. దానికి తోడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటిస్తున్న కుబేర షూటింగ్ కూడా ముంబైలో జరుగుతోంది. నాగార్జున కీ రోల్ చేస్తున్నారు కుబేర మూవీలో. దేవదాస్ సినిమాలో ఆల్రెడీ నాగ్‌తో పనిచేశారు రష్మిక మందన్న.

పుష్ప2 సినిమా షూటింగ్ పూర్తయితే, త్వరలోనే ప్రమోషన్ల కోసం కూడా ఉత్తరాదికి జర్నీ చేయాల్సి ఉంటుంది శ్రీవల్లి. షూటింగుల కోసమో, ప్రమోషన్ల కోసమో, పార్టీలకు అటెండ్ కావడం కోసమో.... బ్యాక్ టు బ్యాక్ ముంబై ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతూనే ఉన్నారు నేషనల్ క్రష్.





























