- Telugu News Photo Gallery Cinema photos Heroine alia bhatt reveals her youthful beauty secret Telugu Actress Photos
Alia Bhatt: ఆలియా యంగ్ లుక్.. అసలు రహస్యం తెలుసా.?
పెళ్లయి, పిల్లకు తల్లయిన తర్వాత కూడా ఆలియా అంత యంగ్‌గా ఎలా ఉంటున్నారు? బాలీవుడ్‌లో మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ ఇదే ఇప్పుడు. అందరూ అంతగా డిస్కస్ చేసుకుంటున్న విషయానికి ఒకే ఒక్క మాటతో ఆన్సర్ చేసేశారు మిసెస్ రణ్ బీర్ కపూర్. ఆ మాట విన్న వాళ్లందరూ 'ఆహా.. ఆలియా.. ఎంత తెలివిగా ఆన్సర్ చేశారు' అని అంటున్నారు. ఇంతకీ ఆ మాటేంటి.? ఆలియా అంతలా ఏం చెప్పేశారు.?
Updated on: May 16, 2024 | 5:32 PM

పెళ్లయి, పిల్లకు తల్లయిన తర్వాత కూడా ఆలియా అంత యంగ్‌గా ఎలా ఉంటున్నారు? బాలీవుడ్‌లో మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ ఇదే ఇప్పుడు. అందరూ అంతగా డిస్కస్ చేసుకుంటున్న విషయానికి ఒకే ఒక్క మాటతో ఆన్సర్ చేసేశారు మిసెస్ రణ్ బీర్ కపూర్.

పేరుకు వాళ్లు ముంబై ముద్దుగుమ్మలే కానీ చూపంతా మాత్రం టాలీవుడ్‌పైనే ఉంది. ఒక్కరో ఇద్దరో కాదు.. బాలీవుడ్ బ్యూటీస్ అంతా ఇప్పుడు తెలుగు సినిమా వైపు పరుగులు తీస్తున్నారు.

తన అందానికి సిసలైన రహస్యం రణ్‌బీర్ అని క్రెడిట్ మొత్తాన్ని భర్తకే ఇచ్చేస్తున్నారు ఆలియాభట్. ఏ విషయాన్నైనా ఆలియా తేలిగ్గా వదలడానికి ఇష్టపడేవారు కాదట. కానీ రణ్‌బీర్ మాత్రం ఎక్కడి విషయాలను అక్కడ విడిచిపెట్టి, ముందుకు వెళ్తారట.

అతని దగ్గర నుంచి నేర్చుకున్న ఆ విషయం వల్ల మనసు ఎంతో తేలికపడిందని అన్నారు ఆలియా. ఆలియాకి కెమెరానే లోకం. అయినా ఆమె పనిని ఏరోజూ ఇంటికి క్యారీ చేయరట.

సినిమా ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లయినా తనకి సవాలు విసిరే కేరక్టర్ల కోసం ఇంకా వెతుకుతుంటారట. సినిమా అంటేనే ఎంటర్‌టైన్‌మెంట్. కానీ అంతకు మించి సందేశాన్నిచ్చే, ప్రేక్షకుల్లో ఆలోచనను రేకెత్తించే కథలను సెలక్ట్ చేసుకోవాలని అనుకుంటారట సిల్వర్‌స్క్రీన్ గంగూభాయ్.

జీవితంలో తాను తీసుకున్న ప్రతి చిన్న నిర్ణయం తన అందంపై, ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుందన్నది ఆలియా నమ్మే మాట. రాహాకి తల్లయిన తర్వాత కూడా తాను అందంగా కనిపించడానికి కారణం రణ్‌బీరేనని ముద్దుగా చెప్పేస్తున్నారు ఆలియా.

తాను టీనేజ్ గర్ల్ గా ఉంటేనే రణ్‌బీర్‌కి ఇష్టమని, అతని ఇష్టాన్ని గౌరవించడమే తన పని అని ఓపెన్ అయ్యారు ఈ బ్యూటీ.




